డైలీ సీరియల్

విలువల లోగిలి-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎవరి ప్రేమ అయితేనేం? మనకి కావాల్సింది మనమంతా కలసి ఉండటం. అది జరుగుతోందిగా’’ అంది తేలికగా విశ్వ.
‘‘ఊరికే నిన్ను ఏడిపిద్దామని అన్నాలే!’’
‘‘ఈ నెల ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తాను’’ అంది విశ్వ.
‘‘ఈ రోజంతా ఎలా గడిపారో చెప్పి ఆ ఫోటోలు అన్నీ చూపించి వారి దగ్గిర ఆశీర్వాదం తీసుకున్నాడు సూర్యచంద్ర.
తర్వాత డాబాపైకి వెళ్లి కాసేపు వెనె్నల విహారం చేసి వచ్చారు. చందమామతో చెప్పుకున్న చల్లని కబుర్లని తమ జ్ఞాపకాల పెట్టెలో దాచేసుకున్నారు.
వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకోవచ్చు, చూసుకోవచ్చు అనుకొని ‘శుభరాత్రి’కి శ్రీకారం పలికారు.
ఆ రోజు పేపరు తిరగేస్తున్న విశ్వకు ఒక వార్త బాగా కదిలించింది.
చదువులో ‘అందరికన్నా మిన్న - లేమిలో కోలుకోరన్నా’ అనే హెడ్డింగ్‌లో వెలువడిందా న్యూస్.
ప్రభుత్వ స్కూల్‌లో చదువుతూ వందకు తొంభై ఆరు మార్కులు ప్రతి సబ్జెక్టులో తెచ్చుకునే ఈ విద్యార్థులు కాలేజీ చదువులకు నోచుకోలేదు. వారి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అని వ్యధ చెందుతున్నారు. తమకెవరయినా సహాయంచేస్తే ఉద్యోగం వచ్చాక వారి ఋణం తీర్చుకుంటామని కన్నీళ్ళతో విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. వీరంతా కూలి చేసుకునే వారి పిల్లలే అవటం గమనార్హం.
వెంటనే ఆ పత్రికాఫీసుకి ఫోను చేసి వారి వివరాలను సేకరించింది విశ్వ.
వాళ్ళను కలిసి వారేం చదువుకోవాలంటే అది తాను చదివిస్తానని వాగ్దానం చేసింది. మీ పదిమంది బాధ్యత నాదే. ఇక మీకే అవసరం వచ్చినా నేనున్నాను గుర్తుపెట్టుకోండి అని దానికి కావల్సిన ఏర్పాట్లు అన్నీ వారంలో పూర్తిచేసింది.
‘స్పందన’ అంటూ పత్రికలో ‘విశ్వ’ ఫొటో వేసి ఆమె గురించి వార్త ప్రచురించారు. దానిని ఆమె పట్టించుకోలేదు. ఆ పదిమంది బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. అదే తనకు కావాల్సింది. ఏ విద్యార్థీ డబ్బులేదని చదువు ఆపకూడదు. ఉన్నవాళ్ళంతా వారిని ఆదుకోవాలి. భగవంతుడు మనకు సంపదనిచ్చింది మనం అనుభవించటానికే కాదు ఇతరులకు సహాయపడటానికి అని గుర్తించాలి అనుకుంది మనసులో.
అత్తయ్య కూడా తనకు తోడయితే ఇలాంటివి ఇంకా ఎన్నో చెయ్యాలి. తన పేర పెట్టిన ట్రస్ట్‌కి న్యాయం చేయాలి. ఇదే తన ధ్యేయం అని అనుకోవటమే కాదు ఆచరణలో పెట్టింది. ఎక్కడ ఆపద వున్నా అక్కడ విశ్వ ఉండేది. ఎక్కడ తన అవసరం వుందో వెతికి మరీ పట్టుకొనేది. నిరంతరం ఆ అనే్వషణలోనే కాలం గడిపేది.
ఆమె ప్రతి ఆలోచనా ఆ దిశోనే పయనించేది.
***
అనుకొన్నరోజునే అమృత, నరేంద్రనాధ్‌లు భరతభూమిపై అడుగుపెట్టారు.
అమృత అయితే ఆనందంగా నేలను తాకి ముద్దుపెట్టుకుంది. ఎన్నో ఏళ్ళనుంచీ తను కన్న కల ఇది. ఎప్పుడూ రావటం, కొన్నాళ్ళు ఉండి వెళ్లిపోవటంతో ఈ అనుభూతే కరువయ్యింది. ఈ రోజు అలా కాదు శాశ్వతంగా తను ఇక్కడే ఉండిపోతోంది. ఆ భావనే ఆవిడను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.
ఇదంతా తన కోడలు విశ్వ చలువే.
తను సాధించలేనిది విశ్వ సాధించింది.
వారిని ఆహ్వానించటానికి సూర్యచంద్ర, విశ్వ అరగంట ముందే అక్కడకి వచ్చేశారు.
అమ్మనీ, నాన్ననీ వదిలి కొన్ని నెలలే అయినా ఎన్నో సంవత్సరాలు అయినట్లుంది. ఫ్లైట్ తొందరగా వచ్చేస్తే బాగుండును అనుకున్నాడు చందూ.
ఇన్నాళ్ళు ఆగినవాడు ఇపుడు ఆగలేకపోతున్నాడు.
అతన్ని మరింత ఎదురుచూసేట్లుగా చేసింది. అపుడే అందిన సమాచారం ఫ్లైట్ అరగంట ఆలస్యంగా చేరుతుందని అనౌన్స్‌మెంట్ వినిపించటంతో హతవిధీ అని కాస్త డీలాపడ్డాడు.
విశ్వ అతని టెన్షన్‌ని గమనించి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి అతన్ని మామూలు స్థితికి తీసుకువచ్చింది.
అప్పటికే ఫ్లైట్ లాండ్ అవటం, ప్యాసింజర్స్ రావడం జరుగుతోంది. వారిలో అమ్మా, నాన్న కనిపించటంతో చందూ ‘హాయ్!’ చెప్పాడు. వాళ్ళిద్దరూ రాగానే చందూని కౌగించుకున్నారు
విశ్వ వాళ్ళిద్దరినీ పలకరించింది.
లగేజీ తీసుకున్నాక ఇంటికి బయలుదేరారు. దారంతా ఏదో కొత్త ప్రదేశానికి వచ్చినట్లు గమనిస్తోంది అమృత.
కొన్నాళ్ల తర్వాత ఇది మామూలు అయిపోతుందని ఆమెకూ తెలుసు.
ఆఫీసు స్ట్ఫాంతా వద్దామని సంబరపడ్డారు. కానీ నరేంద్రనాధ్‌కి అలాంటి హంగామాలు ఇష్టముండవని ముందుగానే సూర్యచంద్ర చెప్పటంతో ఇక్కడే ఆహ్వానం పలకటానికి ప్రయత్నాలు చేసుకున్నారు.
దాన్ని మాత్రం అతను నివారించలేకపోయాడు. ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తండ్రిని పైకి తీసుకువెళ్ళాడు సూర్యచంద్ర.
స్ట్ఫా అందరినీ పరిచయం చేశాడు.
వాళ్ళంతా దండలతో, బొకేలతో ఆయనకి ఆహ్వానం పలికారు. ఆయన అందరినీ విష్ చేసి క్యాబిన్‌లోకి వెళ్ళారు.
వారంతా తమ తమ సీట్లలో కూర్చుని పనిచేసుకోసాగారు. వాళ్ళకి అక్కడ పనిచేయటం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సూర్యచంద్ర బాస్‌లా ఎప్పుడూ ప్రవర్తించడు. స్నేహితుడిలా వారితో మాట్లాడి పని చేయించుకుంటాడు. అది వాళ్ళందరికీ ఎంతో నచ్చుతుంది. అదీకాకుండా కాస్త పని ఒత్తిడి అనిపిస్తే బాల్కనీలోకి వెళతారు.
ఎదురుగా వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపటానికి నేనున్నాను అంటూ సముద్రుడు పలకరిస్తాడు. ఎగిసిపడే కెరటాలు ప్రేమ అలల్లా ఉరకలు వేస్తూ మీకోసమే మేమున్నామని సేద తీరుస్తాయి. అయిదు నిమిషాలు అలా నిలబడి ఆ దృశ్యం గమనిస్తే చాలు రెట్టింపు ఉత్సాహం వచ్చేస్తుంది. ఇలాంటిచోట ‘అమృత సాఫ్‌టెక్ సొల్యూషన్స్’ ఆఫీసుపెట్టాలని అనిపించినందుకు వారంతా సూర్యచంద్రని ఎంతగానో మనసులో ఆరాధిస్తారు, అభినందిస్తారు. ఏ యజమాని అయినా ఉద్యోగిని బానిసలా చూస్తే అతనితో పని చేయించుకోలేడు. అదే ప్రేమ చూపిస్తూ వారినీ తమ కుటుంబ సభ్యులులానే గౌరవిస్తూ వాళ్ళ కష్టనష్టాలను కనుక్కుంటూ వాటినుంచి వారిని బయటకు తీసుకురావటం కూడా తమ బాధ్యతే అన్నట్లు ప్రవర్తిస్తే ఇక వాళ్ళమధ్య అరమరికలు ఉండవు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ