తెలంగాణ

తుంగభద్రకు పోటెత్తిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తుంగభద్ర డ్యామ్‌కు వరద నీరు పోటెత్తింది. దీంతో డ్యామ్‌కు చెందిన 33 గేట్లను ఎత్తివేశారు. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవహిస్తోంది. డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో సైతం 1,55,431 క్యూసెక్కులు ఉండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరదను దిగువకు విడుదల చేయడంతో తెలంగాణ, ఏపీ, కర్ణాటక అధికారులను అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డ్ హెచ్చరిక జారీ చేసింది.