ధనం మూలం
సంపదకు జపాన్ కైజెన్ విధానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కైజెన్ జపాన్ పదం. దీని గురించి విన్నారా? సరిగా అర్థం చేసుకుంటే కైజెన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మిమ్ములను ఆరోగ్య వంతులుగా మారుస్తుంది. సంపన్నులను చేస్తుంది. మీకున్న చెడు అలవాట్లు అన్నీ కైజెన్ విధానంలో వదిలేయవచ్చు, ఆరోగ్య కరమైన అలవాట్లు అలవర్చుకోవచ్చు. ఇంట్లో రాగిరేకులు కట్టుకుంటే సంపద వస్తుంది, చైనా వాస్తు మిమ్ములను ఎక్కుడికో తీసుకు వెళుతుంది అనే ప్రచారానికి లోటు లేదు. కైజెన్ అంటే అదో రకం జపాన్ వాస్తు అనుకోకుండి. ఇదేమీ మనకు తెలియంది కాదు. తెలిసిందే. కానీ మనం ఆచరించడం లేదు. ఆచరిస్తున్న జపాన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దేశాల సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందేందుకు సంపదకు కైజెన్ విధానం మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
వేయి మైళ్ల ప్రయాణం ఐనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్కో నీటి బిందువుతోనే సముద్రం అవుతుంది. ఇవి మనకు తెలిసిన మాటలే. కైజెన్ విధానం ఇదే.
ఎంత ధైర్యంగా కనిపించే వ్యక్తుల్లో అయినా భయం ఉంటుంది. ఏ కొత్త పని చేయాలన్నా మనల్ని భయం వెంటాడుతుంది. ఆదిమానవులు ఆడవుల్లో జీవించే కాలంలో చెట్టు పక్కన ఏదైనా అలికిడి ఐనా భయపడేవారు. అలా భయపడి అప్రమత్తంగా ఉంటేనే బతికి ఉంటారు. లేకపోతే ఏ పులికో మరే జంతువుకో బలవుతారు. ఆ భయం అనేది మనిషిని ఇప్పటికీ అలానే వెంటాడుతూనే ఉంది. ఏదైనా కొత్త పని చేయాలన్నా, ఒక భాష నేర్చుకోవాలన్నా, ఒక పరిశ్రమ స్థాపించాలన్నా మన మెదడు ముందుగా మనకు భయాన్ని పంపిస్తుంది. అది నీ వల్ల కాదు, చేస్తే ఏమవుతుందో అనే సంకేతాలను మెదడు పంపుతుంది. మార్పును వ్యతిరేకిస్తూ మెదడు భయపడమని చెబుతుంది.
కైజెన్ ఇక్కడే తన ప్రభావాన్ని చూపిస్తుంది. దేనికే భయపడవద్దు, సాహజమే జీవితం అంటూ ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కానీ మెదడు మాత్రం భయపడమనే సంకేతాలు పంపుతుంది. కైజెన్ విధానంలో ఈ సమస్యను ఎలా అదిగమిస్తారు అంటే...
ఒక పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలు చేసుకోవడమే కైజెన్ విధానం. ఉదాహరణకు మీరు బరువు పెరిగిపోతున్నారు. ఉదయమే లేచి వాకింగ్ చేయాలని, వ్యాయామం చేయాలి, యోగా చేయాలి అని చుట్టూ ఉన్న వారు సలహాలు ఇస్తారు. కానీ మీకు ఉదయం లేచే అలవాటే ఉండదు. కైజెన్ విధానం ఏమంటుంది అంటే రోజుకు గంట సేపు వాకింగ్ చేయడం మీ లక్ష్యం ఐతే. మొదటి రోజే గంట సేపు వాకింగ్ వద్దు. అలా చేస్తే నాలుగైదు రోజుల తరువాత ఆసక్తి తగ్గిపోతుంది. కైజెన్ విధానంలో మొదటి రోజు ఒక్క నిమిషమే వాకింగ్ చేయండి పరవాలేదు. ఓ వారం తరువాత రెండు నిమిషాలు ఇలా పెంచుకుంటూ పోతే క్రమంగా వాకింగ్ అంటే మీలో ఉండే వ్యతిరేకత పోతుంది. క్రమంగా వాకింగ్‌కు అలవాటు పడతారు. కొత్త పనిలో కొత్త ఉత్సాహం లభిస్తుంది. కొద్ది రోజుల తరువాత గంట సేపు ఉత్సాహంగా నడవగలరు. గంట నడకను ఏళ్ల తరబడి వాయిదాలు వేస్తూ పోవడం కన్నా ఒక నిమిషంతో నడకకు శ్రీకారం చుట్టడం మేలు.
ఇక ఆర్థిక వ్యవహారాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. మీ ఖర్చులు మీ చేయి దాటి పోతున్నాయి. జీతం రాగానే ఏమవుతున్నాయో మీకే అర్థం కాని పరిస్థితి. వృథా ఖర్చు అవుతోందని మీకు తెలుసు కానీ ఆ ఖర్చును ఆపలేకపోతున్నారు. ఒకేసారి ఖర్చు ఆపాలని అనుకుంటున్నా చేయలేకపోతుంటే కైజెన్ విధానం అమలు చేయండి.
షాపింగ్‌కు వెళ్లినప్పుడు మొదటి సారి మీరు కొనాలనుకున్న వాటి కన్నా ఒక్క వస్తువును తగ్గించండి. దీనిని ఒక అలవాటుగా మార్చుకుంటే క్రమంగా మీకు అవసరం అయిన వస్తువులు మాత్రమే కొంటారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు మనకు అవసరం అయిన వాటి కన్నా ఎక్కువ కొంటున్నారు. కనిపించిన వాటినల్లా కొంటున్నారు. అలా కాకుండా జాబితా రాసుకుని దానికే పరిమితం అయి ఒక్క వస్తువును తగ్గించండి. వింతగా అనిపించ వచ్చు కానీ కైజెన్ విధా మద్యం తాగే అలవాటును మాన్పించడానికి, సిగరెట్ తాగే అలవాటు మాన్పించడానికి సైతం ఉపయోగిస్తున్నారు. సిగరెట్లు తాగే అలవాటు మానలేకపోతే తొలుత ఒక్క సిగరెట్ తగ్గిస్తూ పోతే క్రమంగా పూర్తిగా మానేస్తారు. కోక్ ఎక్కువగా తాగే అలవాటున్న వారు తొలుత ఒక్క సిప్ తగ్గించ, క్రమంగా కోక్కు దూరం అయ్యారు.
ఇదే విధానం ద్వారా ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పొదుపును అలవాటు చేసుకోవచ్చు.
పొదుపు అంటే మొదటి నెల నుంచే వేల రూపాయల్లో ఉండాలని లేదు. ఒక్కో రూపాయితో పొదుపు అలవాటు చేసుకోవచ్చు. ఇదే విధంగా పొదుపును ఇనె్వస్ట్ చేయడం సైతం. చాలా మంది పొదుపు చేసినా ఎక్కడ ఇనె్వస్ట్ చేయాలో తెలియక భయపడుతుంటారు. స్టాక్ మార్కెట్ అన్నా, మ్యూచువల్ ఫండ్స్ అన్నా మొదట్లో భయం ఉండవచ్చు. కైజెన్ విధానంలో ఒక్క వెయ్యి రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్‌లోకి అడుగు పెట్టిండి.
కొత్త భాష నేర్చుకోవాలి అంటే కైజెన్ విధానంలో వారానికి ఒక్క పదం నేర్చుకోండి అని చెబుతారు. ఒక కొత్త భాష నేర్చుకోవాలని ఏళ్లతరబడి వాయిదాలు వేస్తున్న వారు ఎందరో ఉంటారు. వారానికి ఒక పదం అంటే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. దాని వల్ల భాషపై భయం పోతుంది. క్రమంగా భాష వంటపడుతుంది.
డబ్బు విషయంలో సైతం ఇంతే. ఆదాయం, పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ అంటే తొలుత మన వల్ల అవుతుందా? అని పించవచ్చు. కానీ చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటే ఎంత పెద్ద పనైనా సాధ్యమే. చేసే ఉద్యోగంతో పాటు అదనపు సంపాదన ఉండాలి అని కోరుకుంటే ఒకేసారి పెద్ద మొత్తంపై ఆశలు వద్దు. అదనంగా పని చేయడం ద్వారా కావచ్చు, ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా కావచ్చు మొదలంటూ కావాలి.
రెండవ ప్రపంచ యుద్ధంలో నిండా మునిగిపోయిన జపాన్ తిరిగి కోలుకున్నది కైజెన్ విధానం ద్వారానే. జపాన్‌పై అణుబాంబులు వేసిన తరువాత దేశం దారుణంగా దెబ్బతిన్నది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తిరిగి కోలుకుంటామా? అనే సందేహం నుంచి వచ్చిన పరిష్కారమే. కైజెన్ విధానం. ఈ విధానాన్ని నమ్ముకున్న జపాన్ తిరిగి కోలుకోవడమే కాదు ప్రపంచం ముందు తలెత్తుకుని నిలబడింది. ఒక్కో నీటి బొట్టు సముద్రంగా మారినట్టే, ఒక్కో రూపాయి ఒక చోట చేరితే కైజెన్ విధానం మిమ్ములను కోటీశ్వరులను చేస్తుంది.