ధనం మూలం

సంపన్నులు - మధ్యతరగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మో నాకు భయం... రిస్క్ తీసుకోవడం నా వల్ల కాదు. రిస్క్ తీసుకోవడం అవసరమా? బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. ఎవరినీ నమ్మను. కొత్త ఆలోచనలు నా వల్ల కాదు. ఏదో గడిచిపోతుంది. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం అవసరమా? అన్నింటి కన్నా ఉద్యోగ భద్రత ముఖ్యం. ’
సాధారణంగా మధ్యతరగతి వారిలో వినిపించే మాటలు ఇవి. రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడిన తత్వమే సంపన్నులు కాకుండా అడ్డుకొంటుంది. మన మనస్తత్వమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది అంటారు. నిజానికి చేతిలో కాదు మన భవిష్యత్తు మన ఆలోచనల్లో ఉంటుంది. మన ఆలోచనలకు తగ్గట్టుగానే మనం నిర్ణయాలు తీసుకుంటాం. దానికి తగ్గట్టుగానే మన ఆర్థిక స్థితి ఉంటుంది.
ఇక్కడ సంపన్నులు గొప్పవారు అని చెప్పడం కాదు. అదే విధంగా మధ్యతరగతి జీవితం తప్పు అని కాదు. ప్రతి మనిషి తన శక్తిమేరకు అభివృద్ధి సాధించాలి. ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకా ఎదగాలి . ఎదుగుదల అన్ని రూపాల్లో ఉండాలి. ఒకప్పుడు తిండి కోసం ఇతర దేశాలపై ఆధారపడిన మన దేశం ఇప్పుడు ఇతర దేశాల ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి పంపే స్థాయికి చేరుకుంది. ప్రపంచంలో మూడవ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్ధగా ఎదుగుతోంది. దేశమే కాదు వ్యక్తులు సైతం ఉన్న స్థాయిలోనే ఉండిపోకూడదు. ఒక మెట్టు పైకి ఎదగాలి. పై మెట్టుకు ఎదగడానికి అవరోధంగా నిలిచే లక్షణాలను వదిలిపెట్టాలి.
ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆ రోజుల్లో దాదాపు ఆరువందల రూపాయల బోనస్ డబ్బు జేబులో ఉంది. వారాసిగూడ ఇప్పుడు ప్రైమ్ లొకాలిటీ. రూపాయికి గజం స్థలం. ఓ మూడు వందల గజాల స్థలం కొనమని తెలిసిన వారు అడిగితే... అంత విశాలమైన వెంచర్‌లో నా ప్లాట్ ఎక్కడుందని వెతికేది ఎవరు? కొన్నా, ఉంటుందనే గ్యారంటీ ఏమిటి? అనే అనేక భయాలు. సందేహాలతో కొనలేదు. ఇప్పుడా ప్రాంతంలో గజం కనీసం 50 వేల రూపాయల ధర పలుకుతుంది. కొద్దిపాటి ధైర్యం చేసి ఉంటే కోటిన్నర రూపాయల ఆస్తి చేతిలో ఉండేది.
ప్రతి దానికి భయపడితే ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేం.
జీవితంలో ఎంతో కొంత ధైర్యం చేస్తేనే ఉన్న స్థితి నుంచి ఎదిగే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం ధైర్యం చేయలేని వారు, కొత్తగా ఆలోచించలేని వారు జీవితంలో ఉత్సాహంగా ఉండలేరు. సంపద వారి చెంత చేరదు. నిజానికి సంపన్నులకు డిగ్రీలు తక్కువగా ఉన్నా ధైర్యం, చొరవ ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఎదగాలి అంటే రిస్క్ తీసుకునే తత్వం ఉండాలి. ఉద్యోగం వల్ల జీవితానికి భద్రత లభించవచ్చు, కానీ సంపన్నులు కాలేరు.
తరువాత చేద్దాం, రేపు చేద్దాం అనే వాయిదాలు వేసే తత్వం మధ్యతరగతిలో ఎక్కువ. ఇది ఎంత త్వరగా వదులుకుంటే అంత త్వరగా సంపదకు చేరువ కావచ్చు. సంపన్నుల్లో ఇలాంటి బద్ధకం తక్కువ. అన్ని కోణాల్లో ఆలోచించి సత్వరం నిర్ణయం తీసుకోగలగాలి. వాయిదాలు వేసే తత్వం ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. మధ్యతరగతి వారికి వాయిదాలే వేసే తత్వం ఉంటే, అదే సంపన్నులకు మాత్రం ఒక పని చేపడితే దాన్ని పూర్తి చేసేంత వరకు విశ్రమించని తత్వం ఉంటుంది. ప్రతి పనిని మనమే చేయలేం. ఏ పని ఎవరితో చేయించాలో తెలిసి ఉండడం సంపన్నుల లక్షణం.
మధ్యతరగతి ఎక్కువగా అదృష్టాన్ని నమ్ముకుంటుంది. సంపన్నుడిని కావాలి అనే అదృష్టం నుదుటి మీద రాసి పెట్టి ఉంటే అవుతాను అని నమ్ముతారు. ఏం చేసినా అదృష్టం ఉంటేనే విజయం సాధిస్తామని భావిస్తారు. అదే సంపన్నులు మాత్రం పనినే నమ్ముకుంటారు. చేసిన పని వల్లనే తన భవిష్యత్తు మారుతుంది కానీ అదృష్టం వల్ల కాదని నమ్ముతారు. మధ్యతరగతి ఇతరులపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే సంపన్నులు తమపై తాము ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. మంచి చెడు అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఆ మేరకు ముందుకు వెళ్లడం సంపన్నుల లక్షణం. మధ్యతరగతి మాత్రం ఒక పనిలో పాజిటివ్ అంశాల కన్నా నెగిటివ్ అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మధ్యతరగతి ఎక్కువగా భవిష్యత్తును తలుచుకుని భయపడుతుంది. సంపన్నులు మాత్రం భవిష్యత్తు ఇప్పటి కన్నా ఇంకా మెరుగ్గా ఉంటుందనే పాజిటివ్ ఆలోచనతో ఉంటుంది. తమపై కన్నా వచ్చే తరంపై మధ్యతరగతికి ఎక్కువ నమ్మకం. మేం బాగా చదవకపోయినా మా పిల్లలు బాగా చదువుతారు, మేం సంపాదించక పోయినా మా పిల్లలు బాగా సంపాదిస్తారు అని ఎక్కువగా భవిష్యత్తు తరంపై ఆశలు పెట్టుకోవడం మధ్యతరగతి లక్షణం. సంపన్నులు మాత్రం తమ శక్తిమేరకు తాము కృషి చేయడం, తమ భవిష్యత్తు తరానికి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయడంపై ఆలోచన చేస్తారు.
మధ్యతరగతిలో తాము సంపన్నులం అని చూపించుకోవడం ఎక్కువగా ఉంటుంది. లేని సంపద ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నిస్తారు. ఉన్నదాని కన్నా ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు. దీని కోసం తమ స్థాయికి మించి ఖర్చు చేస్తారు. బట్టలు కావచ్చు, స్మార్ట్ ఫోన్‌లు కావచ్చు, కార్లు, ఇతర ఖర్చులు ఏవైనా కావచ్చు. నిజమైన సంపన్నుల కన్నా అప్పుతో కొనే మధ్యతరగతి ఎక్కువ ఖర్చు చేస్తుంది. సంపన్నులు సాధారణ కంపెనీ స్మార్ట్ ఫోన్ కొంటే మధ్యతరగతి మాత్రం అప్పు చేసైనా ఐ ఫోన్‌కే ప్రాధాన్యత ఇస్తుంది. సొంత ఇల్లు అనేది కూడా లేకుండానే రిటైర్ అయ్యారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇందులో తప్పెవరిదీ అంటే కేవలం ఆలోచనదే. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే అంచనా లేకపోవడం, మితిమీరిన భయం. ప్రభుత్వ ఉద్యోగం ఉంది జీవితం గడిచిపోతుంది అనుకునే ఉద్యోగ భద్రత.
చిలక జోస్యం, రాగిరేకులు, చేతి రాతలు, వాస్తు మీ జీవితాన్ని మార్చలేవు. రాగిరేకులు ఎక్కువగా అమ్ముడు పోతే అలా రాగిరేకులు అమ్ముకున్న వాడు కూడా ఏదో ఒకనాడు సంపన్నుడు కావచ్చు, కానీ ఆ రాగిరేకులు కొన్నవాడు ఒక్కడు కూడా రాగిరేకుల వల్ల సంపన్నుడు కాలేడు. లాటరీ టికెట్లు , జూదాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికీ సంపన్నులు కాలేరు. నేను కూడా సంపన్నుడిని కావాలి అనుకునే మీ ఆలోచనే మీకు మార్గం చూపుతుంది.

-బి. మురళి