హైదరాబాద్

గురజాడ, శ్రీశ్రీలకు నృత్యనీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ‘దేశమును ప్రేమించుమన్నా... మంచి అన్నది పెంచుమన్నా...’ అన్న గురజాడ అప్పారావు నవంబర్ 30వ తేదీన జన్మించారు. ఈ మహనీయుడిని గురువుగా భావించి మహాకవి శ్రీశ్రీ రాసిన సాహిత్యం ఎంతోమంది మేధావులను నిద్రలేపింది. ఈయన రాసిన కవితల ఆధారంగా నాట్యాచారిణి కోక విజయలక్ష్మీ తన నృత్యపరిశోధనలతో ‘మహాకవి శ్రీశ్రీ’ నృత్యనాటికను శ్రీశ్రీ శతజయంతి కానుకగా గురజాడ జన్మదినాన మీడియాకు ప్రత్యేక ఇంటర్‌వ్యూలో తన మహా ప్రస్థానం తెలిపింది. ప్రముఖ పాత్రికేయులు ఎబికె ప్రసాద్ ఉపోద్ఘాతంతో రూపొందించిన ఈ నృత్య నాటికలో తొమ్మిది గీతాలను సమకూర్చానని తెలిపింది. మహాప్రస్థానంతోపాటు ఖడ్గసృష్టిలోని 11 కవితలను ఆధారంగా చేసుకుని నృత్యంగా మరల్చి అభినయంలో శ్రీశ్రీ అనుభూతులను ప్రదర్శించడానికి స్వయంగా నృత్యకల్పన చేశానని విజయలక్ష్మీ తెలిపింది. జగన్నాథ రథచక్రాలు, అవతలిగట్టు, ప్రతిజ్ఞ, ఏవితల్లి..., అద్వైతం, నేను సైతం, సైవగీతి మొదలైన కవితల ఆధారంగా తన నృత్యంలో ప్రేక్షకులకు శ్రీశ్రీని చూపిస్తున్నానని కోక విజయలక్ష్మీ తెలిపింది. ఈ నృత్యాలను వేదికపై ప్రదర్శించాలంటే శ్రీశ్రీ జీవితాన్ని చదివి ఆయన ఆశయాలను తనలో ఇముడ్చుకోగలిగితేనే సాధ్యపడుతుందని, ఈ విషయంలో విజయలక్ష్మీ పరిశోధన అపూర్వమైనదని సంగీత దర్శకులు బిఎస్‌వి శాస్ర్తీ అన్నారు. 2009 నవంబర్ 30న మొదటిసారిగా రవీంద్రభారతిలో ప్రదర్శించి ఆ నాటి ప్రముఖుల ఆశీస్సులు అందుకున్నానని, ఆ తరువాత తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలలో విజయవంతంగా ప్రదర్శించానని ఆమె చెప్పింది. తాను ప్రతి సంవత్సరం గురజాడ జయంతిన శ్రీశ్రీ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ శ్రీశ్రీ పేరుతో కవితలు, నాటికలు, నాటకాలు, కథల పోటీలు నిర్వహించి ఔత్సాహికులను ప్రోత్సహిస్తుంటానని ఆమె తెలిపింది. తెలుగు సాహితీ సంస్కృతులను ప్రజాలోకానికి అందించాలనే దృఢ సంకల్పంతో రైతు రాయల చరితం, తెలుగు ప్రశస్తి, అన్నమయ్య వంటి నృత్యరూపకాలను రూపొందించానని తెలిపింది. ‘‘కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి... కదిలించాలి’’ శ్రీశ్రీ విప్లవ సాహిత్యానుభూతులను నృత్యంద్వారా ఆస్వాదించానని, తనకు నృత్య ప్రేరణలు శ్రీశ్రీ కవితలే కల్పించాయని చెబుతూ గురజాడకు వందనం... శ్రీశ్రీకి నృత్యనీరాజనం అని కోక విజయలక్ష్మీ తెలిపింది.