రాష్ట్రీయం

‘డార్క్‌నెట్’కు చెక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 1.5కోట్లతో కొత్త టెక్నాలజీ
ఉగ్రవాదుల డీప్‌వెబ్ హ్యాకింగ్‌పై నిఘా
త్వరలో అందుబాటులోకి స్కానింగ్ సిస్టం
హైదరాబాద్, డిసెంబర్ 26: ‘డార్క్‌నెట్’ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తున్న టెర్రరిస్టుల డీప్‌వెబ్ హ్యాకింగ్‌పై తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. కొత్త టెక్నాలజీ వినియోగించేందుకు ప్రభుత్వం రూ. 1.5 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా ‘డార్క్‌నెట్’ ఉగ్ర కార్యకలాపాలకు పోలీసులు కళ్లెం వేయనున్నారు. తీవ్రవాద సంస్థలు ఇప్పటి వరకు సోషల్ మీడియాను ఉపయోగించి టెర్రరిస్టు సానుభూతిపరులకు వల వేసేవారు. డార్క్‌నెట్, డీప్‌వెబ్ ద్వారా కొన్ని వెబ్‌సైట్లను హ్యాకింగ్ చేసి ఉగ్రదాడులకు పాల్పడే సమాచారాన్ని సానుభూతిపరులకు అందజేసేవారు. అయితే పోలీసులకు ఈ టెక్నాలజీతో తీవ్రవాదులు, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే సమాచారాన్ని సేకరించలేకపోతుండటంతో పోలీసు శాఖ ‘డార్క్‌నెట్’ను హ్యాకింగ్ చేసి ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను పట్టుకునేందుకు మరో కొత్త టెక్నాలజీకి రూపకల్పన చేయనుంది. రూ. 1.5కోట్లతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించేందుకు పోలీసుశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ ‘డార్క్‌నెట్’ టూల్స్‌ను, ప్రొవైడర్లను నిలుపుదల చేసేందుకు అంగీకరించాయని, ఐసిస్, దాయేష్, అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలను కనిపెట్టే విధంగా ఓ ట్యాబ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. పోలీసులకు సవాల్‌గా మారిన ‘డార్క్‌నెట్’కు చెక్ చెప్పేందుకు కొత్త టెక్నాలజీ వినియోగం అనివార్యమని, కొత్తగా వినియోగంలోకి తెచ్చే స్కానర్ విధానాన్ని ఉగ్రవాదుల ప్రచారం, చర్చలు, ఫొటోలు వంటి వాటిని కనిపెట్టొచ్చని ఓ తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు.