క్రీడాభూమి

‘బ్రేవో’ డారెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫాలోఆన్ తప్పించుకున్న వెస్టిండీస్
మెల్బోర్న్, డిసెంబర్ 28: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పించుకుంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ను మూడు వికెట్లకు 551 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆదివారం ఆట ముగిసే సమయానికి 91 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకొని, ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. అయితే, డారెన్ బ్రేవో, కార్లొస్ బ్రాత్‌వెయిట్ ఏడో వికెట్‌కు 90 జోడించడంతో కోలుకుంది. ఒకవైపు వికెట్లు కూలుతున్నప్పటికీ క్రీజ్‌లో పాతుకుపోయిన డారెన్ బ్రేవో వీరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అతను 81 పరుగులు చేయగా, కార్లొస్ బ్రాత్‌వెయిట్ (59) కూడా అర్ధ శతకాన్ని సాధించాడు. చివరిలో కెమర్ రోచ్ (22) కొంత సేపు ఆసీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించాడు. డారెన్ బ్రేవో, కార్లొస్ బ్రాత్‌వెయిట్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ కారణంగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జేమ్స్ పాటిన్సన్, నాథన్ లియాన్ చెరి నాలుగు వికెట్లు పడగొట్టారు. పీటర్ సిడిల్‌కు రెండు వికెట్లు లభించాయి.
తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 179 పరుగులు చేసింది. జొస్ బర్న్స్ (4), డేవిడ్ వార్నర్ (17), ఉస్మాన్ ఖాజా (56) అవుట్‌కాగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 70, మిచెల్ మార్ష్ 18 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలివుండగా, ఆసీస్ ఇప్పటికే 459 పరుగులు ముందంజలో నిలిచింది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి.
** విండీస్ టాప్ స్కోరర్ డారెన్ బ్రేవో (81) **