జాతీయ వార్తలు

మరింత లోతుగా దర్యాప్తు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిక్కు అల్లర్ల కేసులో సిబిఐకి కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన కేసును మరింత లోతుగా దర్యాప్తు జరపాలని స్థానిక కోర్టు శుక్రవారం సిబిఐని ఆదేశించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన కొన్ని అంశాలున్నాయని, వాస్తవాలను వెలికితీయడమే దర్యాప్తు ముఖ్య ఉద్దేశం గనుక ఆ లక్ష్యాన్ని సాధించడానికి సిబిఐ చేయాల్సినదంతా చేస్తుందని ఆశిస్తున్నానని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్‌పిఎస్ లాలేర్ పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఒక తీర్పును కోర్టు ప్రస్తావిస్తూ, దర్యాప్తును ప్రతి రెండు నెలలకోసారి కోర్టు పర్యవేక్షిస్తే న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. అందువల్ల ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సిబిఐని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను 2016 ఫిబ్రవరి 2కు వాయిదా వేస్తున్నట్లు జడ్జి తెలిపారు. టైట్లర్‌ను నిర్దోషిగా పేర్కొంటూ సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికను సవాలు చేస్తూ ఉత్తర ఢిల్లీలోని ఓ గురుద్వారా వద్ద జరిగిన అల్లర్లలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరైన బాదల్ సింగ్ భార్య, ఫిర్యాదుదారు లఖ్విందర్ కౌర్ దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.