జాతీయ వార్తలు

దయాశంకర్ కోసం పోలీసుల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ కోసం యుపి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మాయావతిని కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు తొలుత పోలీసులు బలియా వెళ్లారు. ఆయన ఇంట్లో లేరని తెలియడంతో లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దయాశంకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిజెపి యుపి శాఖ అధ్యక్షుడు ప్రకటించారు. మరోవైపు బిఎస్‌పి కార్యకర్తలు ఆందోళనలకు దిగడంతో లక్నో సహా వివిధ నగరాల్లో బిజెపి కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.