రాష్ట్రీయం

ఏపికి లోటు తీర్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ రెవెన్యూ లోటు
14వేల కోట్లు ఇవ్వండి
తేల్చి చెప్పిన ఏజిఐ
త్వరలో కేంద్రం నిర్ణయం?
ప్యాకేజీలో సర్దుబాటు చేసే అవకాశం
హైదరాబాద్, డిసెంబర్ 5: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన రెవెన్యూ లోటు ఉందని అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది. ఆంధ్ర రాష్ట్రానికి రూ.14,423 కోట్ల నిధులను కేంద్రం నష్ట పరిహారంగా చెల్లించాల్సిందేనని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నివేదిక సమర్పించారు. ఈ మేరకు నిధులను కేంద్రం విడుదల చేస్తే ఆంధ్ర రాష్ట్రం నిధుల లేమి నుంచి కోలుకుంటుందని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రం ఇంతవరకు రూ.2300 కోట్లను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఇంకా రూ.12,123 కోట్ల రూపాయలను కేంద్రం ఈ ఏడాది విడుదల చేయాల్సి ఉంది. ఏక మొత్తంలో ఈ నిధులను కేంద్రం మంజూరు చేయాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వాస్తవానికి విభజన వల్ల ఆంధ్ర రాష్ట్రానికి రూ.16,500 కోట్ల లోటు ఏర్పడింది.
కాగా కేంద్ర ఆర్ధిక శాఖ ఇటీవల లోటు మొత్తాన్ని మదింపు వేసి తాజాగా అంచనాలను తెలియచేయాలని అకౌంటెంట్ జనరల్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ వివరాలు రావడం ఆలస్యమవుతాయనే ఉద్దేశంతో సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఈ ఏడాది మార్చి 30వ తేదీన రూ. 2300 కోట్లను మంజూరు చేసింది.
దీంతో వీలైనంత త్వరలో కేంద్రం ఏజి నివేదికలో పేర్కొన్నట్లుగా రూ. 12,123 కోట్ల నిధులను దశల వారీగా మంజూరు చేసే అవకాశం ఉందని రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం 2014-15 సంవత్సరానికి రూ.6006 కోట్ల లోటును బడ్జెట్‌లో చూపించింది. అనంతరం ఈ లోటు 2014-15 సంవత్సరానికి రూ.14,204 కోట్లకు పెరిగింది. గత ఏడాది రెవెన్యూ రాబడిలో కూడా 8.7 శాతం తగ్గింది. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పాణిగ్రాహిని కలవనున్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ లోటు నిధుల మంజూరుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి ప్యాకేజీపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీలో భాగంగా లోటు నిధులను సర్దుబాటు చేస్తారనే ఆశాభావాన్ని ఆర్ధిక శాఖ వర్గాలు వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఈ లోటును భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు మొత్తం ఆదాయంలో వాణిజ్య రెవెన్యూ ఆదాయం 65 శాతం కాంట్రిబ్యూట్ చేసేది. ఇందులో హైదరాబాద్ నుంచి 35 శాతం ఆదాయం వచ్చేది. హైదరాబాద్‌ను కోల్పోవడంతో రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం ఆదుకోవాల్సి ఉంటుంది.