ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

శ్రుతిమించి రాగాన పడుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయ వ్యవస్థ క్రియాశీలత (జుడీషియల్ యాక్టివిజం) శృతి మించి రాగాన పడుతోందా అనే అనుమానం కలుగుతోంది. నైనిటాల్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జోసెఫ్ ఉత్తరాఖండ్‌లో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం. న్యాయమూర్తి జోసెఫ్ విచారణ సంధర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీపై చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు. రాష్టప్రతిపై ఒక న్యాయమూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మన వ్యవస్థలో తరిగిపోతున్న నిబద్ధతకు అద్దం పడుతోంది.
‘రాష్టప్రతి తప్పులు చేయకుండా ఉండటానికి రాజు కాదు, రాష్టప్రతి కూడా తప్పులు చేస్తారు, సంపూర్ణ్ధాకారం ఎవరి మనసునైనా పాడు చేయగలుగుతుంది, రాష్టప్రతి కూడా తప్పులు చేస్తారు కాబట్టి ఆయన నిర్ణయాల తప్పొప్పులను నిర్దారించే అధికారం కోర్టులకు ఉం టుంది’ అంటూ నైనిటాల్ హైకోర్టు వ్యాఖ్యానించట న్యా య వ్యవస్థ అత్యుత్సాహానికి అద్దం పడుతోంది. రాజులు తప్పు చేయవచ్చంటూ పరోక్షంగా సూచించటం హైకోర్టుకు ఎంత మాత్రం తగదు. రాష్టప్రతి పాల విధింపుపై విచారించే సమయంలో రాష్టప్రతిని విమర్శించటం కోర్టు పరిధిలోని అంశం కానేకాదు. రాష్టప్రతిపై నైనిటాల్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగించవలసి అవసరం ఉన్నది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును వీలున్నంత త్వరగా ఆశ్రయించాలి. రాష్టప్రతి పదవిలో ఉన్న వ్యక్తి తప్పు చేయరని వాదించలేము అయితే తప్పొప్పులను నిర్ధారించే సమయంలో ఘాటైన విమర్శలకు ఎంత మాత్రం తావివ్వకూడదు.
రాష్టప్రతి ఒక వ్యక్తి గాదు, రాష్టప్రతి పదవి మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దేశంలోని ప్రతి పని రాష్టప్రతి లేదా గవర్నర్ పేరుతోనే జరుగుతుంది. కేంద్రం లో ప్రధాన మంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రధాన కార్యనిర్వహణాధికారులైనప్పటికీ వారు తీసుకునే ప్రతి నిర్ణయం రాష్టప్రతి, గవర్నర్ల పేరుతోనే అమలులోకి వస్తుంది. ఈ లెక్కన రాష్టప్రతి, గవర్నర్లను విమర్శించటం అంటే దేశం, రాష్ట్ర ప్రజలను విమర్శించినట్లు, అవమానించినట్లు అవుతుంది. రాష్టప్రతి కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలనే అమలు చేస్తారు తప్ప తనంత తాను ఏమీ చేయరు. అదే విధంగా రాష్ట్రాల్లో గవర్నర్లు కూడా ఆయా రాష్ట్రాల మంత్రివర్గాలు తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తారు. నైనిటాల్ హైకోర్టు ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్టప్రతి పాలనను విమర్శించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి తప్ప నేరు రాష్టప్రతిని విమర్శించకూడదు. నైనిటాల్ హైకోర్టు రాష్టప్రతిపై చేసిన విమర్శల్లో కోపతాపాలున్నాయి తప్ప విచక్షణతో కూడిన చిత్తశుద్ధికనిపించటం లేదు.
ప్రణబ్ ముఖర్జీ ఇటీవల భోపాల్‌లో న్యాయమూర్తుల సదస్సులో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ క్రియాశీలత శృతి మించటంపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ తమ అధికారాన్ని అమలు చేయటంలో సమతౌల్యాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా కోల్పోకూడదు, సమతౌల్యం కోల్పోయే పరిస్థితులు ఎదురైనప్పుడు స్వీయ నిగ్రహాన్ని పాటించాలని ప్రణబ్ ముఖర్జీ సూచించారు. రాజ్యాంగం మహోన్నతమైందంటూ ప్రజాస్వా మ్య వ్యవస్థలోని అన్ని అంగాలు తమ పరిధిలోనే వ్యవహరించాలి తప్ప ఇతర అంగాల అధికారాలను హరించకూడదు, పరిధులు దాట కూడదని ఆయన హితవు చెప్పారు. ప్రజా స్వామ్య వ్యవస్థలోని మూడు అంగాల అధికారాలకు రాజ్యాంగం అద్దం పడుంతోంది, దీని సమతూకానికి దెబ్బ తగలకుండా చూడాలి, న్యాయ వ్యవస్థ క్రియాశీలత లేదా అత్యుత్సాహం మూలంగా ఈ సమతూకం దెబ్బ తినకుండా చూడాలని ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ప్రణబ్ ముఖర్జీ భోపాల్‌లో వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు నైనిటాల్ హైకోర్టుకు రుచించినట్లు కనిపించటం లేదు. అందుకే నైనిటాల్ హైకోర్టు నేరుగా రాష్టప్రతిపై విమర్శ బాణాలు సంధించింది.
ప్రణబ్ ముఖర్జీ భోపాల్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయాల పట్ల న్యాయమూర్తులకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే తమ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు పలు ఇతర మార్గాలున్నాయి. తమ అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకోకుండా రాష్టప్రతి పాలన విధింపుకు సంబంధించిన కేసును విచారించే సమయంలో రాష్టప్రతిపై విమర్శలు గుప్పించటం, రాష్టప్రతిని రాజుతో పోల్చటం మంచిది కాదు. న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించే రాష్టప్రతిపై న్యాయమూర్తులు విమర్శలు గుప్పించటం, అందునా సమతూకం లేని విమర్శలు గుప్పించటం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంత మాత్రం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్టప్రతి పాలనను రద్దు చేసిన నైనిటాల్ హైకోర్టు ఇందుకు సంబంధించిన తీర్పును వౌఖికంగా ఇచ్చి లిఖిత పూర్వక తీర్పు ప్రతి వారం రోజుల తరువాత అందజేస్తామని చెప్పటం వెనక ఉన్న అర్థం ఏమిటి? ఏ కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అందుకు సంబంధించిన లిఖితపూర్వక ప్రతి లభించేంత వరకు అమలులోకి రాదు.
రాష్టప్రతి పాలన రద్దుకు సంబంధించిన తీర్పు లిఖిత కాపీ వారం రోజుల తరువాత అందజేస్తామని చెప్పటం ద్వారా సదరు న్యాయమూర్తులు కేంద్రానికి అన్యాయ చేసినట్లు కాదా? న్యాయం పేరుతో అన్యాయం చేయటం హైకోర్టుకు ఎంత మాత్రం తగదు. తీర్పు కాపీ అందేలోగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఏమైనా చేసుకోవచ్చు అనే విధంగా నైనిటాల్ హైకోర్టు వ్యవహరించటం ఏ విధంగా సమర్థనీయం? నైనిటాల్ హైకోర్టు చేసిన ఈ తప్పు ఆధారంగానే సుప్రీం కోర్టు ఉత్తరాఖండ్‌లో రాష్ప్రపతి పాలనను పునరుద్ధరించటం గమనార్హం. తప్పుడు తీర్పులకు న్యాయమూర్తులను జవాబుదారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలుగుతామా?