ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రక్షకులు కాదు భక్షకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేసే బదులు వారిని భక్షించే స్థాయికి ఎదిగిపోయారు. ఓటింగ్ జరిగేంత వరకు ప్రజల కాళ్లావేళ్లా పడే నాయకులు ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వారిని పీల్చిపిప్పి చేస్తున్నారు. ఓటుకు నోటు ఇచ్చి కొన్నాం కాబట్టి ఓటర్లు అంటే ప్రజలు తమ బానిసలు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులే కాదు వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కొడుకులు తమ తల్లిదండ్రుల అధికార బలంతో పెట్రేగిపోతున్నారు. చివరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల శాసన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సైతం ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు.
అవినీతిపై యుద్ధం పేరుతో ఆం ఆద్మీ (సగటు మనిషి) అనే పేరుతో పార్టీ పెట్టి ఢిల్లీ అసెంబ్లీని దక్కించుకున్న కేజ్రీవాల్ నాయకత్వంలోని పార్టీ దేశ రాజధానిలో ప్రజలను నిలువునా ముంచుతోంది. మహిళల బతుకులతో ఆడుకుంటోంది. చేతికి అందినంతమేర అంత కాజేస్తూ ప్రజాస్వామ్యానికి మచ్చగా తయారైంది. ఆం ఆద్మీ పార్టీకి చెందిన పది శాసన సభ్యులు అవినీతి, అక్రమాలు, మహిళలను వేధించటం, లంచం పుచ్చుకోవటం, పని కోసం ఇంటికి వచ్చిన వారిని కొట్టటం, ఇంటికి వచ్చిన మహిళలపై దౌర్జన్యం చేయటం వంటి ఆరోపణలతో అరెస్టయ ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నారు. ఆం ఆద్మీ పార్టీకి చెందిన సోంనాథ్ భారతి తన భార్య లిపికను చిత్ర హింసలకు గురి చేసినందుకు జైలు పాలయ్యాడు. ఈ మహానుభావుడు ఢిల్లీ న్యాయ శాఖ మంత్రిగా ఉం టూ భార్యను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. చివరకు భర్త పెడుతున్న కష్టాలు భరించలేని లిపిక మహిళా సంఘాల మద్దతుతో తన భర్త ఆగడాలు ప్రజల ముందు పెట్టటంలో విజయం సాధించింది. దీనితోఢిల్లీ పోలీసులు సోంనాథ్ భారతిని అరెస్టు చేయకతప్పలేదు.
ఓక్లా శాసన సభ్యుడు అమానుల్లా ఖాన్, మెహరౌలీ శాసన సభ్యుడు నరేష్ యాదవ్, దేవోలీ శాసన సభ్యుడు ప్రకాశ్ జరవాల్, సంగం విహార్ శాసన సభ్యుడు దినేష్ మోహనియా, వికాస్‌పురి శాసన సభ్యుడు మహేంద్ర యాదవ్, మాడల్ టౌన్ శాసన సభ్యుడు అఖిలేష్ త్రిపాఠీ, రొహతాశ్ నగర్ శాసన సభ్యురాలు సరితా సింగ్, కంటోన్‌మెంట్ శాసన సభ్యుడు సురేందర్ సింగ్, కోండ్లి శాసన సభ్యుడు మనోజ్‌కుమార్, ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ వివిధ నేరాలతో జైళ్లలో ఉన్నారు. మహిళా వేధింపులే కాదు పోలీసు అధికారులపై చేయి చేసుకోవటం, తప్పుడు సర్ట్ఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేయటం వంటి పలు నేరాలకు వీరు పాల్పడ్డారు. న్యాయ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్‌ను బోగస్ డిగ్రీ కేసులో అరెస్టు చేయవలసి వచ్చిందంటే ఆం ఆద్మీ పార్టీ శాసన సభ్యులు ఎలాంటి వారనేది సులభంగానే ఊహించుకోవచ్చు. కేవలం ఆం ఆద్మీ పార్టీకి చెందిన శాసన సభ్యులు మాత్రమే ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్‌కు చెం దిన ఒక మంత్రి కుమారుడు తెలంగాణా రాజధాని హైదరాబాదులో బంజారాహిల్స్‌లో ఒక యువతిని ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించిన కేసు గురించి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కారణాల మూ లంగా ఈ కేసును తొక్కిపెట్టింది. ఆంధ్రాలో ఒక శాసన సభ్యుడు తహశీల్‌దారుపై చేసుకుంటే పట్టించుకునే నాథుడు లేడు.
రాజకీయ పార్టీలకు చెందిన కొందరు శాసన సభ్యు లు, ఎం.పిలు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యుల్లో 36 శాతం మంది అంటే 186 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎం.పిలు కేంద్ర ఎన్నికల సం ఘానికి అందచేసిన అపిడ్‌విట్‌లో తెలియజేసిన అంగీకరించిన విషయం ఇది. బ్రిటీష్ పాలకులు స్వాతంత్య్రా నంతరం దేశం విడిచిపెట్టి పోతూ ఖాళీ చేసిన స్థానాలను మన ప్రజా ప్రతినిధులు ఆక్రమించుకున్నారు. అంటే మన పాలకులు బ్రిటీష్ పాలకుల్లా వ్యవహరిస్తూ పాలితులు అంటే ప్రజలను తమ బానిసలుగా చూస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు కావస్తున్నా ఈరోజుకు కూడా సగటు మనిషి ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. అధికార యంత్రాంగానికి ప్రజలంటే ఎంత మాత్రం గౌరవం లేదు. ప్రజలను గౌరవించటం నేర్చుకోవాలి, వారిని విశ్వసించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక మనసులోని మాట ప్రసంగంలోచెప్పారంటే దేశంలో పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదనేది ఊహించుకోవచ్చు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత బహుషా ఒక పది సంవత్సరాల పాటు దేశంలో నిజమైన ప్రజాస్వా మ్యం అమలై ఉంటుంది. ఆ తరువాత ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబ పాలన ప్రారంభమైందని చెప్పకతప్పదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబపాలన కొనసాగుతోంది. కింది నుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్మూ-కశ్మీర్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబాలు పాలిస్తున్నాయి. బి.జె.పి వామపక్షాలు మినహా కాంగ్రెస్‌తో సహా దేశంలోని అన్ని పార్టీలు కూడా ఒక కుటుంబం ద్వారా పని చేస్తున్న పార్టీలే. ఈ రాష్ట్రాల్లో కొందరు ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదంగా మారింది. బి.జె.పి, వామపక్ష పార్టీల్లో కూడా కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు, సంఘాల ప్రాబల్యమే కొనసాగుతోంది తప్ప నిజమైన ప్రజాస్వామ్యం మచ్చుకకు కూడా కనిపించటం లేదు.