ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాజకీయ రొంపిలోకి కశ్మీర్ వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌ను జాతీయ జీవన స్రవంతిలో కలిపి నాలుగు వారాలు కావస్తోంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడి ప్రజలు ఎలాంటి కోపతాపాలకు గురికాకుండా- హింసకు తావివ్వకపోవటం అభినందనీయం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో జమ్ము, లద్దాక్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు జమ్ము కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది. కశ్మీర్ ప్రజలు జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోతుంటే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీయూ మాజీ నాయకుడు శరద్ యాదవ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ శ్రీనగర్‌కు వెళ్లి కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కశ్మీర్‌లో ప్రజల మానవ హక్కుల గురించి అంతగా పట్టింపు ఉంటే విపక్ష నాయకులు నాలుగైదు నెలల పాటు వేచి చూసిన తరువాత అక్కడికి వెళ్లడం మంచిది. మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ను జన జీవన స్రవంతిలో కలపడాన్ని దేశం యావత్తూ హర్షిస్తోంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ అక్కడి ప్రజలు గొంతెత్తి చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు తొంబై శాతం మంది ప్రజలు మోదీ నిర్ణయాన్ని సమర్థించడం ప్రతిపక్షాలకు కనువిప్పు కావాలి.
దేశాన్ని దాదాపు డెబ్బై సంవత్సరాల నుండి పీడిస్తున్న జమ్ము కశ్మీర్ సమస్యను నరేంద్ర మోదీ, అమిత్ షాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించినందుకు ప్రతిపక్ష పార్టీలు సంతోషించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ప్రతిపక్ష నాయకులు కొందరు చీటికీ మాటికీ శ్రీనగర్ వెళ్లి అక్కడి మైనారిటీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించటం దేశ ప్రయోజనాలకు విరుద్ధం. 370వ అధికరణం రద్దుపై కశ్మీర్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటే ప్రతిపక్ష నాయకులు మొదట జమ్ము, లద్దాక్ వెళ్లడం మంచిది. వారు అక్కడికి వెళ్లి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభిప్రాయం అడిగితే ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది వెలుగులోకి వస్తుంది. రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, సీతారాం ఏచూరి, శరద్ యాదవ్ తదితర నాయకులు జమ్ము, లద్దాక్‌లకు ఎందుకు వెళ్లడం లేదన్నది ఆలోచించవలసిన అంశం. వాస్తవానికి జమ్ము కశ్మీర్‌లో హిందూ , బౌద్ధ మతస్థులు మైనారిటీలుగా ఉంటారు. దేశంలోని మైనారిటీల హక్కు లు, అధికారాల గురించి గొంతు చించుకుని మాట్లాడే ప్రతిపక్ష నాయకులు జమ్ము కశ్మీర్‌లోని మైనారిటీల ప్ర యోజనాల పరిరక్షణ కోసం ఎందుకు పోరాడడం లేదు? ఎందుకు వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు? ప్రతిపక్షాలు కేవలం కశ్మీర్‌లో మెజారిటీగా ఉన్న ముస్లిం మైనారిటీల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసమే పోరాడుతున్నారు? కశ్మీర్‌లోని మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించడం వారి బాధ్యత కా దా? కశ్మీరీ పండిట్లు దా దాపు ముప్పై సంవత్సరాల నుండి స్వదేశంలోనే కాందిశీకులుగా జీవితం గడుపుతున్నారు. వీ రి హక్కులు, అధికారాలు, ప్రయోజనాల పరిరక్షణ గురించి రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, శరద్ యాదవ్ తదితర నాయకులు ఎప్పుడైనా గొంతు విప్పారా? ఉద్యమం లేవదీశారా? జ మ్ము,్ఢల్లీ తదితర ప్రాంతాల్లో తల దాచుకుంటున్న కశ్మీరీ పండిట్ల వద్దకు వెళ్లి ఈ విపక్ష నేతలు పలకరించారా? ప్రతిపక్ష నాయకులు ముస్లిం మైనారిటీలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే వారు మాట్లాడితే చాలు శ్రీనగర్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరు శ్రీనగర్‌కు వెళ్లడం వెనక రాజకీయం ఉన్నది. 370వ అధికరణాన్ని రద్దు చేశాక- స్థానిక ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గొడవకు దిగకపోవటం ప్రతిపక్షాలకు బాధ కలిగిస్తుట్లున్నది.
జమ్ము కశ్మీర్‌లోని మొత్తం భూ భాగంలో దాదాపు 54 శాతం ప్రాంతం లద్దాక్‌లో ఉంటే, జమ్ములో 27 శాతం, కశ్మీర్‌లో 15 శాతం భూ భాగం ఉంది. ప్రతిపక్షాలు కేవలం ఈ పదిహేను శాతం ప్రాంతంలోని మెజారిటీ వర్గీయులైన ముస్లింల హక్కులు, ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడడం శోచనీయం. వీరికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పట్ల ప్రేమాభిమానాలుంటే జమ్ము ప్రాంత ప్రజలను కూడా కలుసుకుని వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. కానీ, విపక్ష నాయకులు ఇంతవరకు ఇలాంటి ప్రయత్నం చేయకపోవటం వారి ఆలోచనలకు అద్దం పడుతోంది. స్వతంత్ర భారతంలో తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పులను నేడు మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్, జూనియర్ నాయకులు సైతం మోదీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించారు. ఇంత జరిగిన తరువాత కూడా రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, శరద్ యాదవ్, సీతారాం ఏచూరి వంటి నాయకులు కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టేందుకు పరోక్షంగా ప్రయత్నించటం సమర్థనీయం కాదు.
కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం మోదీ ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు తీసుకున్నది. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి చర్యలు తీసుకోకతప్పదు. జమ్ము కశ్మీర్ సమస్య మామూలు సమస్య కాదు కాబట్టి మోదీ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించడం ఆషామాషీ విషయం కాదు, ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తరువాత కశ్మీర్ ప్రజలు హింసాత్మకంగా ప్రతిస్పందించే ప్రమాదం ఉన్నది కాబట్టే మోదీ ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు తీసుకున్నది. మోదీ, అమిత్ షాలు తీసుకున్న ఈ ముందస్తు చర్యలు ఆశించిన దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రత్యేక హోదా తొలగించి ఇరవై రోజులు దాటింది. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీలు, పాఠశాలలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు తెలుచుకున్నాయి. శ్రీనగర్‌తోపాటు జమ్ము కశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సామాన్య పరిస్థితుల స్థిరీకరణ కొనసాగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను మరికొంత కాలం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలు ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని తమ శ్రీనగర్ యాత్రల రాజకీయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయడం మంచిది. కశ్మీర్ ప్రజల ప్రయోజనాల పట్ల ప్రతిపక్షాలకు ఎనలేని ప్రేమాభిమానాలు, బాధ్యతలు ఉంటే వారు మరి కొంత కాలం వేచి చూసిన అనంతరం అక్కడికి వెళ్లటం మంచిది. రాష్ట్ర ప్రజలు వాస్తవ పరిస్థతులను ఆకళింపు చేసుకున్న తరువాత ప్రతిపక్షాలు అక్కడికి వెళితే బాగుంటుంది.
ప్రతిపక్షాలతోపాటు మేధావి వర్గానికి చెందిన కొందరు వామపక్ష ఆలోచనా పరులు, ఐఏఎస్ అధికారులు కూడా కశ్మీర్ పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌లో ఆంక్షలు విధించటం ద్వారా మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల హక్కులను హరిస్తోందంటూ కేరళకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు కశ్మీర్ నుండి అత్యధిక మార్కులతో సివిల్ సర్వీసెస్‌కు ఎన్నికైన మరో అధికారి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష నాయకులు, మేధావులు ఆలోచనను పక్కన పెట్టి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం వలన కశ్మీర్ ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే పప్పులో కాలేసినట్లే. పాకిస్తాన్ తదితర ముస్లిం దేశాలు జమ్ము కశ్మీర్‌ను ఇస్లామిక్ తీవ్రవాద ప్రాంతంగా మార్చివేశారు. అఫ్గానిస్తాన్ నుండి అమెరికా సైనిక దళాల ఉపసంహరణ జరిగిన అనంతరం అక్కడ ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్‌పై ప్రయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కశ్మీర్‌లోని హురియత్ తదితర సంస్థలు మతం ఆధారంగా రాజకీయం చేస్తున్నాయి తప్ప ప్రజల హక్కుల పరిరక్షణ లక్ష్యంతో పని చేయటం లేదనేది జగమెరిగిన సత్యం. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా పట్ల కశ్మీరీలకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో అంతే ప్రేమాభిమానాలు జమ్ము, లద్దాక్ ప్రజలకు ఉండాలి. కేవలం కశ్మీర్ ప్రాంత ప్రజలు మాత్రమే ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారంటే జమ్ము, లద్దాక్ ప్రజలకు దీనివల్ల ఇంతకాలం నష్టం జరిగినట్లే కదా? ఒక ప్రాంతానికి చెం దిన ప్రజలకు ఉపయోగపడుతూ ఇతర ప్రాంతాల వారికి ఉపయోగపడని ప్రత్యేక హోదా కొనసాగాలని ప్రతిపక్షాలు, మేధావి వర్గం కోరుకోవడం తప్పుకాదా? *

-కె.కైలాష్ 98115 73262