ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మధ్యయుగం మనస్తత్వానికి ప్రతీక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత దేశం శాంతి సౌభాగ్యాలను కోరుకుంటుంటే అందుకు విరుద్ధంగా పాకిస్తాన్ మాత్రం రక్తపాతం, అణు విధ్వంసం తప్పదంటూ చిందులు వేస్తోంది. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత వారం ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగాలు ఇందుకు నిదర్శనం. మోదీ తనకు ఇచ్చిన పదిహేను నిమిషాల సమయంలో చేసిన ప్రసంగం వివిధ దేశాధినేతలను ఎంతగానో ఆకట్టుకున్నది. మోదీ ఆంతర్జాతీయ స్థాయి రాజనీతిజుడుగా ఎదిగితే, ఇమ్రాన్ ఖాన్ మరింతగా దిగజారి పోయాడు. దౌత్యనీతికి కట్టుబడి సాగిన మోదీ ప్రసంగం ఆద్యంతం ప్రపంచాభివృద్ధి, విశ్వశాంతి, సామరస్యానికి అద్దం పట్టింది. ఇమ్రాన్ ప్రసంగం అణు యుద్ధం, అశాంతి, మారణ హోమం, హిందూమత ద్వేషానికి మారుపేరుగా మారింది. ఇమ్రాన్ తనకు కేటాయించిన పదిహేను నిమిషాల వ్యవధిలో ప్రసంగం ముగించకుండా దాదాపు ఒక గంట పాటు మాట్లాడి ‘మోదీ అహంకారి’ అంటూ వ్యక్తిగత ఆరోపణలు చేసి తన దిగజారుడుతనాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై దుమ్తెత్తిపోయటం ద్వారా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చారు.
మోదీ పాకిస్తాన్ పేరెత్తకుండానే పెరిగిపోతున్న మతపరమైన ఉగ్రవాదం మూలంగా ప్రపంచ శాంతికి ముంచుకొస్తున్న పెనుముప్పు గురించి హెచ్చరించారు. విశ్వకల్యాణమే భారత్ ధ్యేయమంటూ, ఆ దిశగా తాము తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. తాము శాంతిదూత బుద్ధుడిని ప్రపంచానికి ప్రసాదించిన దేశానికి చెందిన వాళ్లమంటూ, పొరుగు దేశం అయిన పాకిస్తాన్ ఎగుమతి చేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ప్రపంచానికి ఉగ్రవాదం పెద్ద సవాల్‌గా పరిణమించిందని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశాలన్నీ ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద ఇచ్చిన శాంతి సందేశం ఇప్పుడు ప్రపంచానికి ఎంతో అవసరమంటూ అహింస ప్రాముఖ్యతను వివరించారు. భారత దేశంలోని 130 కోట్ల మంది ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము పని చేస్తున్నామని, దీనివల్ల కేవలం భారత దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం కలుగుతుందంటూ ఆయన ప్రపంచాభివృద్ధి గురించి మాట్లాడారు. ‘మేము అందరి గురించి ఆలోచిస్తాము, అందరు మనవాళ్లే అన్న భావనతో ముందుకు సాగుతాము, ఇది భారత దేశం ఆలోచనా విధానం..’ అంటూ ఆయన వసుదైవ కుటుంబం, విశ్వ కల్యాణం గురించి మాట్లాడారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల మూలంగా ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు విఘాతం కలుగుతోందని మోదీ చెప్పారు.
మోదీ ప్రసంగమంతా ప్రపంచాభివృద్ధి, ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాల సమైక్యత, వాతావరణాన్ని కాపాడుకునేందుకు దేశాలన్నీ కలిసి తీసుకోవలసిన చర్యలపై కేంద్రీకృతమైంది. ప్రపంచశాంతి, సా మరస్యానికి మోదీ ప్రాధాన్యత ఇస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రసంగమంతా ఉగ్రవాదం, రక్తపాతం, అణుయుద్ధం, ఇస్లామిక్ ఉగ్రవాదం, ప్రపంచ వినాశనంపై కేంద్రీకృతమైంది. ఇమ్రాన్ తాను ప్రపంచ దేశాధినేతల సమక్షంలో మాట్లాడుతున్నానే విచక్షణా జానాన్ని కోల్పోయి మాట్లాడారు. ప్రపంచం ఒక వైపుంటే ముస్లింలు మరో వైపు ఉన్నారంటూ ఆయన విభజన మనస్తత్వాన్ని ప్రదర్శించారు. భారత దేశం కశ్మీర్‌లో మారణ హోమం కొనసాగిస్తోందంటూ పలు ఆరోపణలు చేశారు.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించిన తరువాత అక్కడి ప్రజలను మోదీ ప్రభుత్వం నిర్బంధంలో పెట్టిందని, ఈ అంశంపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోకపోతే అణుయుద్దం తప్పదని, రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం జరిగితే ఇతర దేశాలకు కూడా నష్టం కలుగుతుందని ఇమ్రాన్ అన్నారు. ఈ విషయమై ఐరాస వెంటనే జోక్యం చేసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ ఇమ్రాన్ చిందులు వేశారు. భారత దేశంతో అణుయుద్ధం తప్పదనే సంకేతం ఆయన ఇవ్వడం గమనార్హం. ఇమ్రాన్ ప్రసంగం విద్వేషం, కసి, మతోన్మాదానికి అద్దం పట్టింది. ఇమ్రాన్ సుదీర్ఘంగా మాట్లాడుతుండగా, ఇచ్చిన సమయం ముగిసిందనే ఎర్రబల్బు పదేపదే వెలుగుతున్నా ఆయన తన ప్రసంగాన్ని ఆపలేదు. సమయ నిబంధనను పాటించకూడదని ఆయన ముందే నిర్ణయించుకుని వచ్చినట్లున్నా రు. అం దుకే ఎర్రబల్బు ఎన్నిసార్లు వెలిగినా పట్టించుకోలేదు. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనల పట్ల నిర్లక్ష్యధోరణిని ప్రదర్శించటం ద్వారా పాకిస్తాన్‌కు ఇమ్రాన్ మరింత చెడ్డపేరు తెచ్చారు. ఇప్పటికే పాకిస్తాన్‌కు ‘రోగ్ నేషన్’ (వంచక దేశం) అనే ముద్ర ఉన్నది. ఇమ్రాన్ తన ప్రసంగం ద్వారా పాకిస్తాన్ ‘రోగ్ నేషన్’ అని రుజువుచేశారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఏ దేశాధినేత కూడా తనకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపుమాట్లాడలేదు. గతంలో ఎవరైనా నిర్ణీత సమయం కంటే రెండు, మూడు నిమిషాలు అధికంగా మాట్లాడి ఉంటారు. కానీ ఇలా ఏకంగా నలభై ఐదు నిమిషాల పాటు మాట్లాడలేదు. గతంలో ఏ దేశాధినేత కూడా ఐక్యరాజ్య సమితి వేదికను, సర్వసభ్య సమావేశాన్ని ఇలా దుర్వినియోగం చేయలేదు.
నరేంద్ర మోదీ ప్రసంగం ఐక్యరాజ్యసమితిలో భారత దేశం పరువుప్రతిష్టలతో పాటు పలుకుబడిని పెంచితే, ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం పాకిస్తాన్ ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఐక్యరాజ్య సమితిలో భాష, మాటతీరు అత్యంత ముఖ్యం. ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో అత్యంత పరుష పదజాలాన్ని ప్రయోగించారు. ఐక్యరాజ్య సమితి చర్చల్లో ఉపయోగించేందుకు వీలులేని పదాలను వాడారు. ‘కశ్మీర్‌లో కర్ఫ్యూను ఎత్తివేయగానే ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడతారు, రక్తపాతం జరుగుతుంది, నరేంద్ర మోదీ ఆధిపత్యం చూపిస్తూ అహంకారంగా వ్యవహరిస్తున్నారు, కశ్మీర్ ప్రజలు తుపాకులను చేత పడతారు, ముగింపు వరకు యుద్ధం చేస్తారు’ అని చెప్పటం ద్వారా ఆయన కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది ఆయన మధ్యయుగం మనస్తత్వానికి అద్దం పట్టింది.
చైనాలోని ముస్లింలు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముస్లింలతో పోలిస్తే జమ్ము కశ్మీర్‌లోని ముస్లింలు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. చైనా ప్రభుత్వం తమ దేశంలోని ముస్లింలు మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి నిరాకరించింది. ముస్లింలు తమ ఇళ్లలో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలే తప్ప మసీదుకు వెళ్ళేందుకు వీలు లేదు. ఇక పండుగల సమయంలో రోడ్లపై ప్రార్థనలు చేయటం అనేది కలలోని మాట. ఇమ్రాన్ ఖాన్ వీటిని పట్టించుకోకుండా కేవలం కశ్మీర్ ముస్లింల గురించి మాట్లాడటం పాకిస్తాన్‌కు భారత దేశం పట్ల ఉన్న విద్వేషానికి నిదర్శనం. ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి వేదికపై నుండి అణు యుద్ధం గురించి మాట్లాడటం ఆయన కవ్వింపు ధోరణిని సూచిస్తోంది తప్ప రాజనీతిజతను కాదు. ఆయన ప్రసంగం మోటుతనంతోపాటు పాకిస్తాన్ పాలకులు, ప్రభుత్వం, సైన్యం మోటుతనాన్ని ఐక్యరాజ్య సమితి ముందు బట్టబయలు చేసింది. పాకిస్తాన్‌లో 130 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు నివసించటంతోపాటు ఇరవై ఐదు ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు లేవంటూ ఐక్య రాజ్య సమితి వేదికపై నుండి చెప్పటం హాస్యాస్పదం. అల్‌ఖైదా, ఐసిస్ తదితర ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు ప్రతినెలా పెన్షన్ చెల్లిస్తున్న పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాదులు లేరని చెప్పటం ఐక్యరాజ్య సమితిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం కాదా? ఇస్లామిక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నందుకే పాకిస్తాన్‌పై ఎఫ్‌ఏటిఎఫ్ ఆంక్షలు విధించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు నిధు లు అందచేస్తున్నందుకే అమెరికా ప్రభుత్వం న్యూయార్క్‌లోని హబీబ్ బ్యాంక్‌ను మూసి వేయించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హజరైన సభ్య దేశాల అధినేతలందరికీ ఈ విషయాలు బాగా తెలుసు. తమ దేశంలో ఉగ్రవాదులు లేరు, ఉగ్రవాద సంస్థలు లేవని వారి సమక్షంలో చెప్పటం ఒక దేశాధినేతకు ఎంత మాత్రం మంచిది కాదు. ఇలా మాట్లాడటం వల్ల ఇమ్రాన్ ఖాన్ నవ్వుల పాలవడం తప్ప ఇతర దేశాల మద్దతును ఏనాడూ సంపాదించలేరు.

-కె.కైలాష్ 98115 73262