ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ముందున్నది ముసళ్ల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ఒక రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన బిజెపి అజేయంగా మారినట్లు కాదు, అదే విధంగా ఒకటి, రెండు రాష్ట్రాల్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ కనుమరుగైపోయినట్లు ఎంత మాత్రం కాదు. కాంగ్రెస్ ముక్త దేశం అంటూ బిజెపి చేస్తున్న ప్రచారం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంత మాత్రం మంచిది కాదు. అధికార పక్షంతోపాటు బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే దేశం బాగు పడుతుంది. అధికార పక్షం అదుపులో ఉంటుంది. అసోంలో బిజెపి తనంత తాను విజయం సాధించలేదనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల మూలంగానే అసోంలో బిజెపి ఘన విజయం సాధించింది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్న మాట నూటికి నూరు శాతం నిజం. బిజెపి విజయం వెనక వారి శ్రమ దాగి ఉన్నది. అయితే కేవలం వారి శ్రమ, అకుంటిత దీక్ష మూలంగానే బిజెపి గెలిచిందని చెప్పలేము. అసోం గణపరిషత్ నుండి వచ్చిన సర్బానంద్ సోనోవాల్, గత సంవత్సరం కాంగ్రెస్ నుండి వచ్చి చేరిన హేమంత బిస్వ శర్మ కాంగ్రెస్‌కు అభిశాపమైంది. గత పదిహేను సంవత్సరాల నుండి అధికారంలో కాంగ్రెస్‌కు ఎదురైన ప్రభుత్వ వ్యతిరేకత మరో కారణం. హేమంత బిస్వశర్మ లాంటి మంచి నాయకుడిని వదలుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనా రహిత రాజకీయాలు బిజెపి విజయానికి సోపానాలయ్యాయి. బంగ్లాదేశ్ నుండి వలస వస్తున్న ముస్లిం మైనారిటీలతో ఇబ్బందులకు గురవుతున్న రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా సోనోవాల్ నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించటంతో బిజెపి విజయానికి పునాది పడింది. ముస్లిం వలసలతో విసిగిపోయిన హిందువులు బిజెపికి దన్నుగా నిలబడటంతో పార్టీ పరిస్థితి నల్లేరుపై నడకగా మారింది. మొత్తం మీద బిజెపి విజయానికి స్థానిక పరిస్థితులే కారణమయ్యాయి తప్ప పార్టీ సిద్ధాంతాలు, ఎన్‌డిఏ ప్రభుత్వ విజయాలు కాదు. బిజెపి సిద్ధాంతాలు, ఎన్‌డిఏ ప్రభుత్వం పని తీరు మూలంగా ఓట్లు పడ్డాయనుకుంటే బిహార్‌లో బిజెపి మంచి మెజారిటీతో విజయం సాధించి ఉండాల్సింది కానీ అలా జరగలేదు. ప్రజలు ముఖ్యంగా ఓటర్లు పార్లమెంటు ఎన్నికలు, శాసనసభ ఎన్నికల మధ్య ఉన్న తేడాను చూడగలుగుతున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పరిస్థతుల ఆధారంగా పార్టీలను ఎంచుకుంటున్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇదే జరిగింది. కేరళ ఓటర్లు ఎప్పటి మాదిరిగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్‌ను ఓడించి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు. కేరళలో బిజెపి రంగ ప్రవేశం చేయటంతో మతతత్వాన్ని రెచ్చగొట్టి మైనారిటీ ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు సంపాదించేందుకు యుడిఎఫ్ చేసిన కుటిల రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాల అవకాశ వాద రాజకీయాన్ని సమాధి చేశారు. తమ రాజకీయ అవసరాల కోసం ఒకటయ్యే పార్టీలకు పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి ఘన విజయం సాధించి పెట్టటం ద్వారా చెల్లు చీటీ ఇచ్చారు. అస్సోం, కేరళలో కాంగ్రెస్ ఓడిపోతోందనేది అందరు ఊహిచిందే. తమిళనాడులో డిఎంకె కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండే ఉండే జయలలిత పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేవనేది రాజకీయ పండితులు సులభంగానే సమాధానం చెప్పగలుగుతారు. తమిళనాడులో దిక్కు దివాణం లేని కాంగ్రెస్ పార్టీకి 41 సీట్లు ఇవ్వటమే కరుణానిధి చేసిన పెద్ద తప్పు. కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఓటర్లు స్థానిక పరిస్థితుల ఆధారంగానే ఓటు వేశారు తప్ప మరో కారణం లేదనేది స్పష్టమవుతుంది. ఈ లెక్కన కేరళ, అసోంలో ఓటమిపాలు కావటంతో కాంగ్రెస్ కనుమరుగైపోతుందని ఆశించటం పెద్ద తప్పు అవుతుంది. లోకసభలో ఒకప్పుడు బిజెపికి చెందిన కేవలం ఇద్దరు ఎం.పిలు మాత్రమే ఉండేవారు. ఇద్దరు మాత్రమే గెలిచారు కాబట్టి బిజెపి తూడ్చి పెట్టుకుపోయిందా? బిజెపి సిద్ధాంతాల ఆధారంగా కాకుండా వ్యక్తులు, స్థానిక పరిస్థితుల ఆధారంగా విజయం సాధిస్తోంది. పార్టీ సిద్ధాంతాల ఆదారంగా విజయం సాధించ గలిగితేనే బిజెపి వరుస విజయాలతో నాలుగు కాలాల పాటు నిలదొక్కుకోగలుగుతుంది.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ముందున్నది ముసళ్ల పండుగ. రెండు పార్టీలు అసలు పరీక్షలను రానున్న మూడు సంవత్సరాల్లో ఎదుర్కొననున్నాయి. రానున్న మూడు సంవత్సరాలు కూడా ఎన్నికల సంవత్సరాలే. రానున్న రెండు సంవత్సరాల్లో 15 రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరుగనున్నాయి. ఇవి జరిగిన వెంటనే లోక్‌సభ ఎన్నికలు కమ్ముకు వస్తాయి. వచ్చే సంవత్సరం అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభల ఎన్నికలు జరుగనున్నాయి. 2018లో కర్నాటక, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం, రాజస్తాన్, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉన్నది. 2017, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించగలిగితేనే బిజెపి, కాంగ్రెస్ ముక్త భారత్ సాధించగలుగుతుంది.