ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మాటల దాడి.. ప్రచారంలో వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల తప్పులను ఎండగట్టటం సమర్థనీయమే కానీ, ఓట్ల కోసం ప్రజలను త ప్పుదోవ పట్టించటం, మభ్యపెట్టటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలకు ప్రణాళికలు, పథకాల గురించి చె ప్పుకునే స్వేచ్ఛ ప్రతి రాజకీయ పార్టీకీ ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెప్పటంతోపాటు ప్రత్యర్థుల విధానాలను ఎండగట్టటం ఎన్నికల ప్రచారంలో భాగమే అవుతుంది. అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపటం ప్రతిపక్షం బాధ్యత. తాము అధికారంలో ఉంటూ ఏ మేరకు అభివృద్ధి చేశామనేది చెప్పుకోవటం అధికార పార్టీ హక్కు. ఎన్నికల ప్ర చారం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలంటే అధికార, ప్రతిపక్షాలు కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్షాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. వివిధ పార్టీల నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ,ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారం తారస్థాయికి చేరుకోవటంతోపాటు ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది. నేతలు వారి స్థాయిని మరచి వ్యక్తిగత నిందారోపణలకు దిగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘బయటివాడు.. పనికిరాని వాడు’ అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు యుపి సిఎం అఖిలేష్ యాదవ్ విమర్శించటం గమనార్హం. దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమి, బిజెపి, మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పిలు ప్రచారంలో వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటుగా ఉంది. ప్రధాని మోదీ కూడా పలు సందర్భాల్లో స్థాయికి తగ్గి మాట్లాడటం గర్హనీయం. సమాజ్‌వాదీ-కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు బిజెపి, బిఎస్‌పిలకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే బిజెపి, బిఎస్‌పిలకు రాజకీయంగా బాగా కలిసి వచ్చేది. అఖిలేష్ యాదవ్ తెలివిగా వ్యవహరించి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. ఈ పొత్తు మూలంగా తమ విజయావకాశాలు దెబ్బతినకుండా మోదీ సైతం అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ల మధ్య చిచ్చుపెట్టేందుకు ఎప్పుడో ముప్పై మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను ఊటంకించడం వెనుక బిజెపి అసలు ఉద్దేశం బయటపడిం ది. 1984 మార్చి ఎనిమిదో తేదీనాడు ఇటావాలో ప్రస్తుత సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ము లాయం సింగ్ యాదవ్‌పై జరిగిన హత్యాయత్నం గు రించి మోదీ గత వారం కన్నౌజ్‌లో ఒక ఎన్నికల సభలో ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1984లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉం డగా, చరణ్‌సింగ్ నేతృత్వంలోని భారతీయ లోక్‌దళ్ పార్టీలో కీలక పదవిని నిర్వహిస్తున్న ములాయం సింగ్‌పై హత్యాయత్నం జరిగింది. మోటారు సైకిళ్లపై వచ్చిన కొందరు యువకులు ములాయం ప్రయాణిస్తున్న కారుపై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. తమను రాజకీయంగా దెబ్బతీస్తున్న ములాయంను కాంగ్రెస్ హత్య చేయించేందుకు ప్రయత్నించిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నరేంద్ర మోదీ ఇప్పుడీ అంశాన్ని ఎన్నికల సభల్లో ప్రస్తావిస్తూ, తండ్రిని చంపేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌తో అఖిలేష్ యాదవ్ స్నేహం చేస్తున్నారంటూ విమర్శలు సంధించారు. యుపిలో బిజెపి అధికారంలోకి వస్తే ‘గూండారాజ్యాన్ని’ తొలగించటంతోపాటు గణనీయమైన అభివృద్దిని సాధిస్తామంటూ మోదీ చేసిన ప్రసంగాలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే, అఖిలేష్ , రాహుల్, ఆయన సోదరి ప్రియాంక మాట్లాడుతున్న తీరు కూడా సమర్థనీయం కాదు. ఎంత ఎన్నికల ప్రచారమైనప్పటికీ, ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని అగౌరవ పరచడాన్ని ఎవరూ అంగీకరించరు. వారణాసి నుంచి లోక్‌సభకు గెలిచిన నరేంద్ర మోదీని ‘బయటివాడు’, ‘దత్తపుత్రుడు’ అంటూ విమర్శించటం ప్రియాంకకు తగదు. వారణాసి నుండి లోక్‌సభకు ఎన్నికైన తాను ఉత్తరప్రదేశ్‌కు ‘దత్తపుత్రుడి’నని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రియాంక తప్పుపట్టటం సమర్థనీయం కాదు. మోదీ వారణాసి నుంచి గెలవకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పుపట్టాలి కానీ యుపి నుంచి ఎంపిగా ఎన్నికైనందున తాను ‘దత్తపుత్రుడి’నని మోదీ చెప్పుకోవటంలో ఎలాంటి తప్పులేదు. ఎన్నికల ప్రచారంలో ‘బయటివాడు’, ‘స్థానికుడు’ అంటూ వివక్ష చూపించటం రాజకీయ నాయకులకు ఎంత మాత్రం తగదు. ఇలాంటి ‘విభజన బీజాలు’ నాటినంత మాత్రాన ఎన్నికల్లో విజయం సాధిస్తామనుకోవటం అవివేకమే అవుతుంది. విమర్శించేందుకు కూడా ఒక స్థాయి ఉండాలి. రాజకీయ కుటుంబం నుండి వచ్చినంత మాత్రాన తాము ఎవరినైనా విమర్శిస్తామనుకోవటం అజానం అవుతుంది.
ప్రియాంక చెప్పినట్లు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ హృదయాల్లో యుపి ఉంటే- ఆ రాష్ట్రం ఎందుకింత వెనుకబడినట్లు? రాష్ట్రంలో గూండారాజ్యం ఎందుకు కొనసాగుతోంది? ఈ అతిపెద్ద రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనుచూపుమేరలో ఎందుకు కానరాదు? దేశానికి ప్రధానమంత్రులను ఇచ్చిన ఉత్తరప్రదేశ్‌లో అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాలు ఎందుకంత వెనుకబడి ఉన్నాయి? మోదీని ‘షోలే’ సినిమాలోని గబ్బర్ సింగ్‌తో పోల్చటం ద్వారా రాహుల్ తన రాజకీయ అపరిపక్వతను మరోసారి చాటుకున్నారు. దేశానికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం సందర్భంగా విభజన బీజాలు నాటుతున్నాయి. కులం, మతం, ప్రాంతం పేరుతో ఓట్లు కూడగట్టుకునేందుకు ఎత్తుకుపై ఎత్తులు వేయటం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అన్ని పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలు, ఓట్లు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారం ఎందుకు చేయడం లేదు? ఒక పార్టీ ఉన్నత వర్గాల ప్రయోజనాల గురించి మాట్లాడితే, మరోపార్టీ మైనారిటీల ప్రయోజనం గురించి చెబుతోంది. ఇంకో పార్టీ అయితే ఒకటి, రెండు కులాల సమీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది తప్ప అణగారిన కులాల ప్రయోజనాలను కాపాడతామని మాట వరసకు కూడా హామీ ఇవ్వటం లేదు. ఒకటి,రెండు పార్టీలు రాష్ట్రంలోని మైనారిటీలకు ‘హిందూత్వ బూచి’ని చూపిస్తూ తమకు ఓటు వేయకపోతే ‘ప్రమాదం తప్పదం’టూ భయానక వాతావరణాన్ని సృష్టించటం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతమాత్రం వాంఛనీయం కాదు.
*

కె. కైలాష్