ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చైనాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్యూనిస్టు చైనా సామ్రాజ్యవాదం పొరుగు దేశాలకు ముఖ్యంగా భారత దేశానికి తలనొప్పిగా తయారైంది. 1962 యుద్ధంలో నేర్పిన గుణ పాఠాన్ని ఎలా మరిచిపోతారంటూ దాదాగిరి చేస్తోంది. అవసరమైతే మరోసారి బుద్ది చెబుతామంటూ దౌర్యన్యానికి దిగుతోంది. మితిమీరిన ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తున్న చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తూ కమ్యూనిస్టులమని చెప్పుకునే చైనా విస్తరణ వాదాన్ని తలకెక్కించుకోవటం విచిత్రంగా ఉన్నది. ఆక్సాయి చిన్, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఎప్పటికప్పుడు మన దేశంతో గొడవకు దిగే చైనా ఇప్పుడు తాజాగా భూటాన్‌కు సంబంధించిన 269 చదరపు కిలోమీటర్ల భూమి విషయంలో మనతో గొడవకు దిగింది. సిక్కిం సెక్టార్‌లోని డోక్లోమ్ ప్రాంతంలో చైనా, భారత సైన్యాలు భాహా, భాహీకి దిగాయి. గతంలో చైనా సైనికులు మన భూభగంలోకి చొచ్చుకు వచ్చి గొడవ చేయటం పరిపాటే. అయితే ఈ సారి భారత సైనికులు చైనా భూభాగంలోకి వెళ్లి చైనా సైన్యం చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవటం గమనార్హం. సిక్కిం సెక్టార్‌లో చైనా, భూటాన్‌కు మధ్య దాదాపు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల మేర సరిహధ్దు ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న ముక్కోణపు భూభాగంలో చైనా, భూటాన్‌తోపాటు భారత దేశానికి కూడా కొంత సరిహద్దు ఉన్నది. చైనా, భూటాన్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేనందున భారత దేశం భూటాన్ తరపున ఈ ప్రాంతంలో సరిహద్దుల రక్షణ బాధ్యత నిర్వహిస్తోంది. డోక్లోమ్ వరకు పక్కా రోడ్డును వేయటం ద్వారా భూటాన్‌పై సైనిక పరమైన వత్తిడి పెంచాలన్నది చైనా వ్యూహం. డోక్లోమ్ వరకు పక్కా రోడ్డును నిర్మంచటం వలన టిబెట్‌ను మరింత సురక్షితం చేసుకోవటంతోపాటు అరుణాచల్‌ప్రదేశ్ వైపు సైన్యాన్ని తరలించటం చైనాకు మరింత సులువవుతుంది. డోక్లోమ్ ప్రాంతంలో రోడ్డు నిర్మించటం ద్వారా ఇంత క్రితం చేపట్టిన అంతర్జాతీయ రోడ్డు నిర్మాణం పనులను మరింత వేగవంతం చేసేందుకు చైనాకు వీలు కలుగుతుంది. ఇన్ని పరిణామాలకు దారి తీసే డోక్లోమ్ రోడ్డు నిర్మాణం పూర్తేతే భారతదేశ భద్రతకు పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లుతుంది. చైనా ఇప్పటికే భారత దేశంతో ఆనుకున్న సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది.
చైనా ఈ రోడ్ల వ్యవస్థ ద్వారా వేలాది మంది సైనికులను భారత దేశం సరిహద్దుల వద్దకు సునాయసంగా తరలించగలుగుతుంది. చైనా నిర్మించుకున్న ఈ రోడ్ల వ్యవస్థకు డోక్లోమ్ రోడ్డు కూడా తోడైడే భారత, భూటాన్ దేశాలకు పెనుముప్పు ఏర్పడటంతోపాటు మైన్మార్, లావోస్ తదితర దేశాల భద్రత కూడా ప్రమాదంలో పడిపోతుంది. భారత దేశం ఈ కారణాల మూలంగానే డోక్లోమ్ రోడ్డు నిర్మాణానికి అడ్డు పడుతోంది. భూటాన్‌కు చెందిన ఈ భూభాగాన్ని చైనా కాలా కాలం నుండి తమ ఆధీనంలో పెట్టుకున్నది. ఈ త్రికోణ భూభాగంపై చాలా కాలం నుండి మూడు దేశాల మధ్య గొడవ సాగుతోంది. 2012లో మూడు దేశాల మధ్య కుదిరిన ఓప్పందం మేరకు ఈ త్రికోణం భూమికి సంబంధించిన సరిహద్దులను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 2012లో ఒప్పందం కుదిరినప్పటి నుండి ఈ ప్రాంతంలో శాంతి నెలకొన్నది. అయితే చైనా ఇప్పుడిక్కడ రోడ్డు నిర్మాణం తలపెట్టటంతో మూడు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైన్యం తమ భూభాగంలోకి వచ్చి గొడవ చేస్తోంది, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చైనా పదే, పదే హెచ్చరిస్తోంది. 1962 మాదిరిగా అవసరమైతే మరోసారి భారత దేశానికి బుద్ది చెప్పుతామంటూ చైనా సైన్యం పరుష పదజాలంతో హెచ్చరికలు చేస్తోంది. 1962 యుద్ధం గుణ పాఠాన్ని మరిచిపోవద్దంటూ అవహేళన చేస్తోంది. చైనా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న మన దేశం 2012లో కుదిరిన ఒప్పందం ప్రకారం నడుచుకుందామని చైనాకు సూచిస్తోంది. భూటాన్‌తో తమకున్న ఒప్పందం మేరకు డోక్లోమ్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్పష్టమైన పద జాలంతో చెబుతోంది. 1962 మాదిరిగా గుణపాఠం నేర్పిస్తామంటూ చైనా చేస్తున్న హెచ్చరికలకు కూడా మన దేశం ధీటైన సమాధానం ఇచ్చింది. 1962 భారత దేశానికి 2017 భారత దేశానికి పోలికలు లేవనేది మరిచిపోరాదంటూ రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చురక వేశారు. కేంద్రంలో యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌లు తమ ఇష్టానుసారం వ్యవహరించాయి. సరిహద్దుల్లో అవి ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగింది. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా మారింది. పాకిస్తాన్ దౌర్జన్యానకి ధీటైన సమాధానం చెప్పటంతోపాటు అవసరమైతే గట్టిగా బుద్ది చెబుతున్నారు. చైనా విషయంలో కూడా గట్టిగా వ్యవహరించటం జరుగుతోంది. చైనాకు భయపడే రోజులు పోయాయనేందుకు డోక్లోమ్ సంఘటన మంచి ఉదాహరణ. మామలూలుగా అయితే చైనా సైనికులు మన భూభాగంలోకి వస్తుంటారు. డోక్లోమ్‌లో ఇందుకు విరుద్దంగా భారత సైన్యం చైనా భూభాగంలోకి వెళ్లి రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయింది. భారత సైన్యం తమ భూభాగంలోకి వచ్చి రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయించటం చైనాకు మింగుడు పడటం లేదు. భారత సైనికులు తమ భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ధైర్యం చేయటం ఏమిటనేది చైనా పాలకులు ప్రశ్న. భూటాన్ తద్వారా మన దేశం ప్రయోజనాలను కాపాడేందుకు భారత సైనికులు చైనా భూభాగంలోకి వెళ్లవలసి వచ్చింది. చైనా 2012 ఒప్పందానికి విరుద్దంగా రోడ్డు నిర్మాణం చేపట్టింది కాబట్టి అడ్డుకోవలసి వస్తోందని మన దేశం వాదిస్తోంది. ఇన్ని సంవత్సరాల్లో చైనాకు మొదటిసారి షాక్ తగిలింది. చైనా ఈ పరిణామాలు తీవ్రంగా తీసుకుంటుందనేది నిర్వివాదాంశం. 1962 యుద్ధం తరువాత చైనా, భారత సైనికులు 1968లో పరస్పర కాల్పులకు దిగారు. రెండు వైపుల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిన అనంతరం ఉద్రిక్తత తగ్గింది. 2013లో చైనా మరోసారి గొడవకు దిగినప్పటి నుండి మన దేశం సరిహద్దుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. చైనా సరిహద్దుల్లో మన సైనిక ఏర్పాట్లు ఎంతో పెరిగాయి. ఈ నేపథ్యంలో డోక్లోమ్ వ్యవహారం చోటు చేసుకున్నది. డోక్లోమ్‌లో మన సైనికులు రోడ్డు నిర్మాణాన్ని ఆపినందుకు మండిపడిన చైనా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసింది. భారత దేశం తమ సైనికులను ఉపసంసరించుకోకపోతే తీవ్ర పరిణమాలు ఉంటాయని హెచ్చరించింది. పాకిస్తాన్‌తో చేతులు కలిపి ఆక్రమిత కాశ్మీర్‌లో రోడ్డు నిర్మాణం పేరుతో పాగా వేస్తున్న చైనాను దారికి తీసుకురావలసిన అవసరం ఉన్నది. ఈ పరిస్థితుల దృష్ట్యా మన దేశం చైనాను నిలవరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎన్.డి.ఏ పాలకులు డోక్లోమ్ పరిణామాలను సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేయాలి. డోక్లోమ్ సంఘటనను తీవ్రంగా పరిఘణిస్తున్న చైనా తన పెత్తందారి తనాన్ని కాపాడుకునేందుకు దుందుడుకుగా వ్యవహరించినా ఆశ్చర్యపోకొడదు. భారత దేశాన్ని శిక్షించటం ద్వారా భూటాన్‌కు చెందిన 269 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని హస్తగతం చేసుకునేందుకు చైనా తప్పకుండా ప్రయత్నిస్తుంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు మన సైన్యం సన్నద్దం కావాలి.
చైనా పద్నాలుగు దేశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. మిగతా దేశాలతో సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకున్న చైనా భారత దేశం సరిహద్దుల విషయంలో మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో జపాన్, వియత్నాం దేశాలతో గొడవ పడుతున్న చైనా మన దేశంతోపాటు జపాన్, ఉత్తర కొరియా, వియత్నాం తదితర దేశాలపై దాదాగిరి చేసేందుకు ప్రయత్నిస్తోంది. తన ఆధిపత్యానికి అడ్డుతగులతుందని భావిస్తున్న మన దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది.

కె. కైలాష్