ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చెప్పటం సులభం.. చేయటం కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, భారత భూభాగమని ప్రకటించినంత మాత్రాన సరిపోదు. శత్రువుల చెరలో ఉన్న భారత భూభాగాన్ని విడిపించుకునేందుకు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అనేది ముఖ్యం. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మరణించిన తరువాత కశ్మీర్‌లో నెలకొన్న అందోళనకర పరిస్థితులపై గతవారం పార్లమెంటు గ్రంథాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత భూభాగమని మరోసారి ప్రకటించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత భూగామనే వాస్తవాన్ని గతంలో అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు ఎర్ర కోటపై నుండి ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచా రు. కశ్మీర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడవేసేందుకు నరసింహారావు ఎర్ర కోటపై నుండి ఈ ప్రకటన చేశారు. ఇప్పుడు నరేం ద్రమోదీ అఖిలపక్ష సమావేశంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత భూభాగమని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత భూభాగమని ప్రకటించిన నరసింహారావు ఆ తరువాత తన ప్రకటనను విస్మరించారని చెప్పక తప్పదు. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత భూభాగానికి స్వాతంత్రం కల్పించేందుకు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నరసింహారావు ఎర్ర కోటపై నుండి చేసి ప్రకటనను నిజం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మన వైపు నుం డి ఎలాంటి ప్రయత్నం జరగలేదు కానీ పాకిస్తాన్ మా త్రం జమ్ముకశ్మీర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగింది. సీమాంతర ఉగ్రవాదానికి తెర లేపటం ద్వారా మన దేశా న్ని ముప్పుతిప్పలు పెడుతోంది. రెండు సార్లు జరిగిన యుద్ధంతో పాటు కార్గిల్ యుద్ధంలో కూడా ఓటమి పా లైన పాకిస్తాన్ ఇస్లామిక్ సీమాంతర ఉగ్రవాదంతో మన దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. భారత దేశంతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తే ఓటమి ఖాయమనే వాస్తవాన్ని గ్రహించిన పాకిస్తాన్ పాలకులు, సైన్యం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుతూ విజయం సాధిస్తున్నారు.
పాకిస్తాన్ విజయవంతంగా అమలు చేస్తున్న ఇస్లామాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టటంలో విఫలమవుతున్న మన పాలకులు మరోసారి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, బలుచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ఆగడాలను ప్రపంచం ముందు పెట్టాలని నరేంద్ర మోదీ సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, బలుచిస్తాన్ ప్రజలు స్వయంప్రతిపత్తి కోసం చేస్తున్న పోరాటానికి ఎన్.డి.ఏ ప్రభుత్వం బహిరంగంగా మద్దతు ఇవ్వగలదా? కశ్మీర్‌లో ఇస్లామిక్ తీవ్రవాదుల ద్వారా భీభత్సం సృష్టిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం ధైర్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. నరసింహారావు మాదిరిగా నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ భా రత భూభాగం, దానిని వెనుకకు తీసుకోవటమే మిగిలిపోయిన కార్యక్రమమని ప్రకటించి ఊరుకుంటే సరిపోదు. శత్రువుల చెరలో ఉన్న భారత భూగాన్ని స్వాధీనం చేసుకునేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోగలగాలి.
వాస్తవానికి భారత్-పాకిస్తాన్‌లుగా విడిపోయిన తరువాత దాదాపు ఏడు నెలల పాటు బలుచిస్తాన్ స్వతంత్ర దేశంగా కొనసాగింది. కశ్మీర్ మాదిరిగానే బలుచిస్తాన్ పా లకుడు, ఖాన్ ఆఫ్ కలట్ మీర్ సులేమాన్ దావూద్ కూడా భారత దేశంలో విలీనం కావాలనుకున్నారు. అయితే అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ, రక్షణ శాఖ మంత్రి వి.పి.మీనన్‌లు వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి మూలంగా బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో భాగమైంది. ఖాన్ ఆఫ్ కలట్ బలుచిస్తాన్‌ను భారత దేశంలో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని వి.పి.మీనన్ విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూ ఖాన్ ఆఫ్ కలట్ ప్రతిపాదనను భారతదేశం తిరస్కరించిందని చెప్పారు. మీన న్ చేసిన ప్రకటన నిజం కాదంటూ అప్పటి హోం శాఖ మంత్రి సర్దార్ పటేల్ ఆ తరువాత సర్ది చెప్పినా జరగవలసిన నష్టం జరిగిపోయింది. పాకిస్తాన్ పాలకులు ఆ వెం టనే బలుచిస్తాన్‌పై సైనిక చర్య తీసుకుని తమ దేశంలో విలీనం చేసుకున్నారు. కశ్మీర్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంభించి విఫలమయ్యారు, లేకపోతే కశ్మీర్ కూడా పాకిస్తాన్‌లో కలిసిపోయేది.
మన పాలకులు సమయానికి అవసరమైన చొరవ చూపించలేక, ధైర్యాన్ని ప్రదర్శించలేకపోవటం వల్లనే దేశం పలుమార్లు సమస్యల్లో పడిపోయింది. కశ్మీర్ విషయంలో కూడా మన పాలకులు ప్రారంభంలో సరైన విధానాన్ని అవలంభించకపోవటం వల్లనే ఈ రాష్ట్రం సమస్యాత్మకంగా తయారైంది. కశ్మీర్‌కు సంబంధించి పాకిస్తాన్‌తో మొదటి నుండి కఠిన వైఖరి అవలంభించి ఉంటే పరిస్థితి ఈరోజు మరో రకంగా ఉండేది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలు, ఇటీవల జరిగిన కార్గిల్ యుద్ధ సమయం లో కూడా మన పాలకులు ముందు చూపుతో ధైర్యంగా వ్యవహరించలేకపోయారు. 1971 యుద్ధంలో అప్పటి ప్ర ధాన మంత్రి ఇందిరా గాంధీ అత్యంత చాకచర్యంగా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ను విడగొట్టినా లాహోర్ పొలిమేరల్లోకి వెళ్లిన మన సైన్యాన్ని వెనకకు పిలిపించి తప్పు చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో బి.జె.పి పాలకులు యుద్ధానికి కాలు దువ్వారు తప్ప ముందడుగు వేయలేకపోయారు. ఇప్పుడు నరేంద్ర మోదీ దూకుడు దౌత్యంతో ఆక్రమిత కాశ్మీర్ భారత భూభాగమేనని అఖిల పక్ష సమావేశంలో చెప్పినా దానిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన తెగువను ప్రదర్శిస్తారని చెప్పలేము. మాటలు కోటలు దాటినా కాళ్లు గడపలు దాటనప్పుడు ఎన్ని ప్రకటనలు చేసినా ఏం లాభం?