ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

సీఏఏ ఉద్యమకారుల అసలు రంగు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ లౌకిక తత్వం, రాజ్యాంగ విలువల పరి రక్షణకు ఉద్దేశించిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) వద్దంటూ ప్రారంభమైన ఉద్య మం ఇప్పుడు ఇస్లాం మత ప్రయోజనాల పరిరక్షణ ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్యమం ‘ముస్లింల గుర్తింపుపరిరక్షణ’కు అన్నట్టుగా మారిపోయింది. పౌర ఉద్యమం ముసుగులో జరుగుతున్న ఈ ఆందోళన ముస్లింల మేలు కోసమేనన్న ప్రచారం జరుగుతోంది. దీని వల్ల తలెత్తే విపరిణామాలకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఉద్యమం ముస్లింల హక్కుల కోసం జరుగుతోందన్న ప్రచారాన్ని విపక్ష నేతలు గుర్తిస్తున్నారా? లేదా? అనేది ముఖ్యం. ఒక మతస్థుల కోసం ఉద్యమం కొనసాగితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది సులభంగానే ఊహించవచ్చు. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో దృష్టి సారించడం మంచిది.
ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన సిఏఏ వ్యతిరేక ఉద్యమం రెండు వారాల వ్యవధిలో ఇస్లాం మత ప్రయోజనాల కోసం అన్నట్టుగా మారడానికి కొన్ని విదేశీ శక్తులు కారణమని అందరూ గ్రహించాలి. దేశంలో ఈ ఉద్యమం ఎక్కడ జరిగినా ముస్లిం మతస్థులు, ఆ వర్గం విద్యార్థులు ఉండటం గమనార్హం. దీన్ని పౌర ఉద్యమంగా బాధ్యతలేని కొన్ని పత్రికలు అభివర్ణించినా, వాస్తవానికి ఇది ఒక మతానికి సంబంధించి జరుగుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది ఎవరన్నది పరిశీలిస్తే పరిస్థితి ఎటువైపు పోతోందనేది స్పష్టంగా అర్థం అవుతుంది. నిజానికి పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదు. దీంతో ముస్లింలకు ఏ మాత్రం సంబంధం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌లలో మతపరమైన హింసను, విద్వేషాన్ని ఎదుర్కొంటున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, పార్సీలకు భారతీయ పౌరసత్వం కల్పించటం సీఏఏ లక్ష్యం. ఈ మూడు ఇస్లామిక్ దేశాల్లోని మెజారిటీ వర్గమైన ముస్లింలు మతపరపరమైన హింసకు గురయ్యే అవకాశాలే లేవు. ఈ దేశాల్లోని ముస్లింల వల్లనే హిందూ, సిక్కు తదితర మైనారిటీ మతస్థులు హింసకు గురవుతున్నారు. వీరికి రక్షణ కల్పించేందుకే మోదీ ప్రభుత్వం సీఏఏను తెచ్చింది. ఈ చట్టం భారత్‌లోని ముస్లింల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని జరుగుతున్న ప్రచారం ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మి ముస్లింలు ఉద్యమించడంతో చివరికి వారికే ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ఈ ఉద్యమం రాజ్యాంగ పరిరక్షణ, లౌకికవాద పరిరక్షణ మార్గం నుండి ఎప్పుడో తప్పిపోయింది. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణ ఉ ద్యమంగా మారిపోయింది. ‘తేరా మేరా రిష్తా క్యా, లా ఇలాహా ఇల్లల్లాహా’ (నీకు,నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అల్లా మాత్రమే), ‘ఆజాదీ కౌన్ దిలాయేగా, లా ఇల్లాహా, ఇల్లల్లాహా’ (స్వాతంత్య్రం ఎవరు ఇప్పిస్తారు? అల్లా తప్ప మరో దేవుడు లేడు’, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ ఆందోళనకారులు చేస్తున్న నినాదాలు ఇస్లాం మత ఉద్యమాన్ని సూచించటం గమనార్హం. ఇవి ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ నినాదాలు కావా? ఈ నినాదాలు లౌకికవాదులకు ఇష్టమేనా? ‘ఇన్ కాఫిరోనే్స ఆజాదీ’(ముస్లిమేతరుల నుండి స్వాతంత్య్రం) అని నినదించే వారు దేశభక్తులా? దేశద్రోహులా? హైదరాబాద్, లక్నో, ఢిల్లీ, గౌహతి, బెంగళూరు తదితర నగరాల్లో కొనసాగుతున్న సీఏఏ వ్యతిరేక ఉద్యమానికి పెద్దసంఖ్యలో ముస్లింలు హాజరైనట్లే, సీఏఏకు మద్దతుగా భాజపా నిర్వహిస్తున్న బహిరంగ సభలు, ర్యాలీలకు పెద్ద సంఖ్యలో హిందువులు హాజరైతే ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి? ఇది ఎటుదారి తీస్తుంది? అనే దానిపై ప్రతిపక్షాలు ఆలోచించాలి. ముస్లింల మాదిరి హిందువులు సైతం ప్రతిస్పందిస్తే ఏమవుతుందనేది చెప్పనక్కర లేదు.
సీఏఏ వ్యతిరేక ఉద్యమకారులు ఒక రకంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను లక్ష్యంగా చేసుకొన్నారని చెప్పకతప్పదు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అని చెప్పుకునే మోదీ, అమిత్ షాలకు కావలసింది మతపరమైన విభజన. దేశంలో మెజారిటీ వర్గమైన హిందువులు తమ వైపు తిరగాలన్నది ఈ ఇద్దరు నేతలతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్ష్యమనేది అందరికీ తెలిసిందే. సీఏఏ వ్యతిరేక ఉద్యమం ఒక విధంగా మోదీ, అమిత్ షాల లక్ష్యాన్ని నెరవేర్చినట్టు కనిపిస్తుంది. సీఏఏకు నిరసనగా పెద్దసంఖ్యలో ముస్లింలు, ఆ వర్గం యువత హాజరు కావడాన్ని హిందువులు గమనిస్తున్నారు. కొందరు హిందువులు ఇప్పటికే ఈ ఉద్యమానికి ప్రతికూలంగా స్పందిస్తున్నా, చాలామంది హిందువులు మాత్రం తమ అభిప్రాయాలను బైటపెట్టటం లేదు. వీరు సీఏఏ ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. వీరంతా ఒక దృఢ నిర్ణయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్,ఇతర ప్రతిపక్షాలు గాలికి కొట్టుకుపోతాయనేది పచ్చి నిజం. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిరసన ర్యాలీల సందర్భంగా హింసకు పాల్పడిన ముస్లిం మతానికి చెందిన వారిని, ముఖ్యంగా యువతను పోలీసులు గు ర్తించారు. వారి తల్లిదండ్రులపై జరిమానాలు విధించే ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ ముస్లిం నాయకులతో మాట్లాడిన తీరు దేశంలో నెలకొంటున్న పరిస్థతులకు అద్దం పడుతోంది. మీరట్‌లో గొడవ అనంతరం రెండో రోజు ఆ ప్రాంతంలో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారి స్థానిక నాయకులతో మాట్లాడుతూ,‘్భరత్‌లో ఉండటం ఇష్టం లేకపోతే మీకు ఇష్టమైన దేశానికి వెళ్లవచ్చు, ఇక్కడి తిండి తింటూ పాకిస్తాన్‌కు వంత పాడటం ఎంతమాత్రం కుదరదంటూ హెచ్చరించటం గమనార్హం. జిల్లా ఎస్పీగా ఉన్న ఆ అధికారి ఇలా హెచ్చరికలు చేసినందుకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేయాల్సి ఉంది. లౌకిక వాదం, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే వారు ప్రస్తుత పరిస్థితులను విశే్లషించాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ భాజపా ఎమ్మెల్యే ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘మీరు పదిహేను శాతం, మేము ఎనభై ఐదు శాతం..’ అంటూ హెచ్చరించటం పరిస్థితులు విషమిస్తున్నాయనడానికి నిదర్శనం కాదా? పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడే పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది ఆలోచించాల్సిన విషయం. ముస్లింలకు చెందిన వాట్సాప్ గ్రూపులు, హిందూ మతానికి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చను పరిశీలిస్తే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయనేది అర్థం అవుతుంది. ఉద్యమాలు ఏ మాత్రం అదుపు తప్పినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ప్రతిపక్షం ఇప్పటికైనా గ్రహించాలి. మోదీ ప్రభుత్వం సీఏఏ విషయంలో ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదనేది అందరికీ తెలిసిందే. ఉద్యమం ఎంత విస్తరిస్తే మోదీ, అమిత్ షాలకు రాజకీయంగా అంతగా కలిసి వస్తుందనేది నిజం. సీఏఏను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఇతర వామపక్షాల నాయకులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. ఈ నిప్పు వారిని చుట్టుముట్టినపుడు వారు వాస్తవాలను గ్రహిస్తారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదనేది ప్రతిపక్షాలు ఇప్పటికైనా గ్రహించటం మంచిది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల వారు తమ ఓటుబ్యాంకు పరిరక్షణకు, రాజకీయ ప్రయోజనాల కోసమే సీఏఏను వ్యతిరేకిస్తున్నారు తప్ప ముస్లింల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కాదు. ఈ వాస్తవాన్ని ముస్లింలు గ్రహించడం అవసరం. ప్రతిపక్ష నాయకులు తమ అవసరం తీరాక ఈ ఉద్యమాన్ని, ముస్లింలను ముంచటం ఖాయం.
*

కె.కైలాష్ 98115 73262