ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘హక్కుల’ తీర్మానాలతో హడావుడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకాలం పార్లమెంటు ఉభయ సభల్లో రాజకీయ యుద్ధం చేసిన కాంగ్రెస్,్భజపాలు ఇప్పుడు సభాహక్కుల ధిక్కార నోటీసులతో ఆధిపత్యం చాటుకునేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారంపై ప్రభుత్వం లోక్‌సభను తప్పుదోవ పట్టించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీపై, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందం అంశంపై నిర్మాలా సీతారామన్‌పై తప్పుడు ఆరోపణలు చేసి సభను తప్పుదోవ పట్టించారంటూ భాజపా సభా హక్కుల నోటీసు ఇచ్చింది.
ఈ రెండు పార్టీలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయే తప్ప, దేశరక్షణకు సంబంధించిన అంశాలపై ఆచితూచి వ్యవహరించాలనే పరిపక్వతను ప్రదర్శించటం లేదు. నిజాయితీకి మారుపేరని చెప్పుకునే మోదీ ప్రభుత్వం రాఫెల్ ఒప్పందంలో భారీ కుంభకోణానికి పాల్పడిందని రాహుల్ ఆరోపిస్తుంటే, భాజపా నేతలు దీనిని ‘స్వదేశీ’ నినాదంతో అడ్డుకుంటున్నారు. రక్షణ ఉత్పత్తుల కొనుగోలులో విదేశీ ముడుపులకు అలవాటు పడిన కాంగ్రెస్ స్వదేశంలో యుద్ధ విమానాల తయారీకి అడ్డుపడుతోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం సభ్యుడు కేశినేని నాని ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై గత వారం లోక్‌సభలో దాదాపు పనె్నండు గంటల పాటు చర్చ జరగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరఫున అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించిన రాహుల్ మాట్లాడుతూ, రాఫెల్ యుద్ధ విమానాల ఖరీదును వెల్లడించేందుకు ఇష్టపడని నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్, ఇండియాల మధ్య లేని రహస్య ఒప్పందం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాఫెల్ ఒప్పందంలోని వివరాలను బహిర్గతం చేయకూడదంటూ ఉభయ దేశాల మధ్య అంగీకారం ఉందని చెప్పిన రక్షణమంత్రి సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చినపుడు తాను కలుసుకోగా ఎలాంటి రహస్య ఒప్పందం లేదని తనకు చెప్పారని రాహుల్ గుర్తుచేశారు. రాహుల్ మాటల్లో నిజం లేదని నిర్మల చెబుతూ, ఒప్పందం వివరాలను వెల్లడించరాదంటూ రెండు దేశాల మధ్య అవగాహన ఉందన్నారు. యూపీఏ హ యాంలో ఏ.కె.ఆంటోని రక్షణమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందం జరిగిందంటూ సంబంధిత పత్రాలను సభలో నిర్మలా సీతారామన్ చూపించారు. ఇది నిజమేనని ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఆ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. తన హయాంలో ఇలాంటి రహస్య ఒప్పందం జరగలేదని ఆంటోనీ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.
ఈ పరిణామాలను పరిశీలిస్తే రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్, భాజపాలు అసత్యాలు చెబుతున్నాయని అనిపిస్తుంది. రాఫెల్ విమానాల దిగుమతి, తయారీ, వాటి ఖరీదు వంటి వివరాలన్నీ వివాదాస్పదంగా మారాయి. దేశభద్రతకు సంబంధించిన ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన అవసరం రెండు ప్రధాన పార్టీలపైనా ఉంది. వాయుసేన వద్ద ఉన్న యుద్ధ విమానాలు పాతవైపోతూండటంతో ఆధునిక యుద్ధ విమానాల సేకరణలో భాగంగా ఫ్రాన్స్‌తో యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరింది. 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన 2001లో రాగా 2007లో ఆ ప్రక్రియ ప్రారంభమైంది. సిద్ధంగా ఉన్న 18 యుద్ధ విమానాలను కొనుగోలు చేసి, మిగతావి బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌లో తయారు చేయాలని నిర్ణయించారు. మొత్తం ప్రక్రియకు రూ. 54 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ సంస్థతో ఒప్పందంపై 2012లో చర్చలు పారంభించారు. ఒక్కో యుద్ధ విమానం ఖరీదు 740 కోట్లు కాగా, భారత ప్రభుత్వం వాటి ఖరీదులో 20 శాతం మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేయటంతో చర్చలు మందగించాయి. 2014లో రెండు దేశాల్లో ఎన్నికలు జరగటంతో చర్చల ప్రక్రియ మరింత ఆలస్యమైంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక, రాఫెల్ ఒప్పందం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. ఫ్రాన్స్ నుండి సాంకేతిక సహాయం తీసుకొని దేశీయంగా యుద్ధ విమానాలను తయారు చేసే కాంట్రాక్టును అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైంది.
రాఫెల్ ఒప్పందం వెనక లక్షా ముప్పయి వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని రాహుల్ ఆరోపిస్తున్నారు. యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ సంస్థకు కాంట్రాక్టును ఎలా అప్పగిస్తారన్నది ఆయన ప్రశ్న. రాఫెల్ ఒప్పందం కుదుర్చుకునేందుకు మోదీ వెంట ఫ్రాన్స్ వెళ్లిన బృందంలో అనిల్ అంబానీ ఉండటం తెలిసిందే. ఒప్పందంపై ప్రకటన చేయడానికి కేవలం పదిహేను రోజుల ముందు రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థ ఊపిరిపోసుకున్నదని కాంగ్రెస్ ఆరోపణ. ఒప్పందంలో కుంభకోణం జరిగిందని చెప్పేందుకు ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా? అని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. మన వాయుసేనలో యుద్ధ విమానాల బలం రోజురోజుకూ తగ్గుతుంటే, వీటి కొనుగోలుకు సంబంధించిన పార్లమెంటులో వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొటేందుకు భాజపా నాయకులు స్వదేశీ వాదనను ముందుకు తెస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు రక్షణ రంగ ఉత్పత్తులను దేశంలోనే తయారు చేయాలని ఎందుకు ఆలోచించలేదని అధికార పక్షం ఎదురుదాడి చేస్తోంది. ముడుపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాలు విదేశీ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని భాజపా ఆరోపిస్తోంది. ప్రభుత్వ రంగంలోనే అన్నీ తయారు చేయాలంటే కుదరదు గనుక ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం యుద్ధ విమానాల తయారీ పనులను రిలయన్స్‌కు అప్పగిస్తోందని వారు సమర్ధిస్తున్నారు. కాగా, భారత వాయుసేనకు మధ్యరకం యుద్ధ విమానాలు ఉంటే బాగుంటుందనే ఆలోచన 2001లో వస్తే అది కార్యరూపంలో పెట్టేందుకు ఏడు సంవత్సరాలు పట్టింది. కానీ అప్పుడు కూడా కార్యాచరణలో ఏదీ జరగలేదు. రాఫెల్ ఒప్పందంపై ఇపుడు అధికార, ప్రతిపక్షాలు వాదులాడుకుంటున్నాయి. రాజకీయాల సంగతెలా ఉన్నా, ఇప్పటికీ యుద్ధ విమానాలను దేశీయంగా మనం తయారు చేసుకోలేక పోవడం పెద్ద లోపమే.

--కె.కైలాష్ 98115 73262