సబ్ ఫీచర్

డెలివరీ గరల్స్ వచ్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డెలివరీ బోయ్’ అనే మాట సర్వసాధారణంగా అందరూ వినేదే. కాని ‘డెలివరీ గళ్’ అనే మాట నేడు సరికొత్తగా వినబోతున్నారు. కేరళ ప్రజలు ఇప్పటికే వింటున్నారు. ఈ వ్యవస్థ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు లేకపోలేదు. అమెజాన్ సంస్థ దీనికి రూపకల్పన చేసింది. తిరువనంతపురంలో ఏడుగురు మహిళలు ఈ రంగంలోకి ప్రవేశించారు. వీరంతా గృహిణులే కావటం విశేషం. ముప్పయి ఏడేళ్ల దీప్తి ప్రమోద్ ఇంట్లో పనైపోగానే ఆమె తాను అందించాల్సిన వస్తువల బ్యాగ్‌ను టూవీలర్‌పై పెట్టుకుని కస్టమర్లకు అందజేసి తిరిగి ఇంటికి వచ్చేస్తోంది. ఖాళీ సమయంలో ఈ పని చేయటం సులువుగా ఉందని, ఎంతో కొంత స్వశక్తితో సంపాదిస్తున్నానని గర్వంగా చెబుతోంది. సంధ్య (34)కు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఇపుడు డెలివరీ సిస్టమ్ సజావుగా సాగిపోతుందని వెల్లడించింది. ఇలా ఒక్కొక్క మహిళ అమెజాన్ ఆఫీసుకు సమీపంలోని రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో అందించాల్సిన వస్తువల బ్యాగ్‌లను వాహనాలపై పెట్టుకుని చక చక ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తారు. వీరు రోజుకు 40 ప్యాకేజీల వరకు అందజేస్తున్నారు. కొద్దిపాటి చదువుకున్న మహిళలు ఖాళీ సమయంలో ఈ పని చేసుకోవచ్చని అమెజాన్ స్టేషన్ మేనేజర్ దివ్య చెబుతున్నారు. మహిళలు వస్తువలను డెలివరీ చేయటం తనకెంతో ఆశ్చర్యం కలిగించినా, ఈ విధానం చాలా బాగుందని, వారు కస్టమర్లతో మృధువుగా వ్యవహరిస్తూ చక్కగా పనిచేస్తున్నారని విష్ణువరదరాజన్ అనే ఐటీ ఉద్యోగిని వెల్లడించింది. ఏది ఏమైనా అమెజాన్ సంస్థ తిరువనంతపురంలో ప్రయోగాత్మకంగా మహిళలతో చేపట్టిన డెలివరీ సిస్టమ్ మరింత విస్తరించి వారి ఉపాధికి దోహదం చేస్తుందని ఆశిద్దాం.