పశ్చిమగోదావరి

రైతులకు చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనాల్సిందే: రాష్ట్ర రైతుకార్యాచరణ సమితి డిమాండు
భీమవరం, నవంబర్ 29: మరుగున పడిపోతున్న డెల్టాకు ప్రాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చి మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రైతుకార్యాచరణ సమితి అభిప్రాయపడింది. ముఖ్యంగా నీలి విప్లవానికి రాజధానిగా ఉన్న ఈ ప్రాంతంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు, ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అభినందనీయమని ఆ సమితి అధికార ప్రతినిధి మెంటే పద్మనాభం అన్నారు. వీటి ఏర్పాటుతో భీమవరం ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందన్నారు. ఆదివారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీసారి నష్టాలను చవిచూస్తున్న ఆక్వా రైతులకు ఈ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కుతో మేలు జరుగుతుందన్నారు. సుమారు రూ.250 కోట్లతో 3వేల టన్నుల కెపాసిటీతో దీని నిర్మాణం జరగనుందన్నారు. రొయ్య ధర పతనమవుతున్న తరుణంలో ఈ ఫుడ్‌పార్కులో నిల్వ ఉంచుకుని, డాలర్ ధర పెరిగినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. వీటి నిర్మాణ పనులు చేపడుతున్న ఆనంద గ్రూపు త్వరితగతిన ఈ పనులు పూర్తిచెయ్యాలన్నారు. అలాగే భీమవరం మండలం శివారులో 150 ఎకరాల్లో ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఈ ప్రాంతానికే ఒక వరమన్నారు. సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాండురంగరాజు మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో ఆక్వా యూనివర్శిటీ, గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు ఏర్పాటుచేయడంతో సుమారు 5వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఫుడ్ పార్కు నిర్మాణం వల్ల అక్కడి రైతులు నష్టపోతున్నామని ఆందోళన చేస్తున్నారని, అయితే దీని నిర్మాణం వల్ల ఎటువంటి హానీ ఉండదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏ ఒక్క రైతు కాలుష్యం భారినపడి నష్టపోతే వారి తరపున పోరాటం చేసేందుకు రాష్ట్ర రైతుకార్యాచరణ సమితి ముందుంటుందని ప్రకటించారు.
ప్రభుత్వం ప్రకటించిన ధరకు ధాన్యం కొనాల్సిందే
కొద్దిరోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని కొంటామని ప్రకటించారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపతిరాజు పాండురంగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదిరాజు నాగేశ్వరరాజులు తెలిపారు. అయితే ప్రభుత్వం పొడి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రకటించిన ధరకే తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని కొనాలని వారు డిమాండు చేశారు. క్వింటాలు ధాన్యాన్ని కేవలం రూ.800లకు మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నష్టాన్ని సమగ్రంగా అంచనా వెయ్యాలని, నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం జరిగే విధంగా ఈ అంచనాలు ఉండాలని తెలిపారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందరికీ సమానంగా ఇవ్వాలని డిమాండు చేశారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి తమ్మినీడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.