తెలంగాణ

కరవుపై ప్రత్యేక చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిజెఎసి చైర్మన్ కోదండరాం డిమాండ్

మహబూబ్‌నగర్, డిసెంబర్ 19: రాష్ట్రంలో ఏర్పడ్డ కరవుపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌కు విచ్చేసిన ఆయన టిఎన్‌జిఓ భవన్‌లో జిల్లా జేఏసి నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జేఏసి చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయని తీవ్రమైన కరవు వచ్చిందని ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అండగా నిలవాలని ఆయన కోరారు. ముఖ్యంగా కరవుపై ప్రత్యేక చట్టం తీసుకువస్తేనే రైతాంగానికి మేలు జరుగుతుందని లేకుంటే ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు రాష్ట్రంలో ఎక్కువ అవుతున్నాయని ఇది బాధకరమైన విషయమన్నారు. కరువు కారణంగా ప్రభుత్వం ప్రత్యేకంగా పాలమూరు జిల్లాపై దృష్టి సారించాలని ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అగమ్యగోచరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని రుణాల మాఫీ ప్రభుత్వం ఏకకాలంలో ఇస్తారో? లేక విడతల వారిగా ఆమలు చేస్తారో? ప్రస్తుతం తక్షణమే రైతాంగానికి రీషెడ్యూల్డ్ ద్వారా రుణాలు అందజేయాలన్నారు. రైతుల పక్షన ప్రతిపక్షాలు రెండవ గొంతుగా వినిపిస్తే, మూడవ గొంతుగా ప్రజాసంఘాలు నిలుస్తాయని తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎన్నో సంఘాలు ప్రజల కోసం పని చేస్తాయని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు. పంట నష్టపరిహారం అందించాలని ప్రతి రైతుకు ఎకరాలకు దాదాపు రూ.10 వేల పంటనష్ట పరిహారం అందించాలని ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కొదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే రైతుల ఆత్మహత్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.