ఆంధ్రప్రదేశ్‌

ఏసిబి వలలో డిఇవో ఆఫీసు అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.25 వేల లంచంతో పట్టుబడ్డ ఎడి స్వరాజ్యబాబు

మచిలీపట్నం, మార్చి 10: కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్-2గా పనిచేస్తున్న టి స్వరాజ్యబాబు రూ.25వేలు లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు విజయవాడలోని ఒక ప్రైవేట్ స్కూల్‌ను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసే సంబంధిత ఫైల్‌ను ఆర్‌జెడి కార్యాలయానికి పంపే విషయంలో రూ.50వేలు డిమాండ్ చేసిన ఎడి స్వరాజ్యబాబును రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఏసిబి డిఎస్పీ గోపాలకృష్ణ వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన ముద్దాడ శివ తన భార్య జ్యోతి పేరు మీద చిట్టినగర్‌లో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ నడుపుతున్నాడు. 2010వ సంవత్సరం నుంచి విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామ పంచాయతీ పి నైనవరం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలగా కొనసాగుతున్న వైష్ణవి విద్యానికేతన్‌ను ఈ ఏడాది ఆయన కొనుగోలు చేశారు. ఈ పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా అప్‌గ్రేడ్ చేసే విషయమై అనుమతుల కోసం గత ఫిబ్రవరిలో డిఇఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంబంధిత ఫైల్‌ను పరిశీలించిన ఎడి స్వరాజ్యబాబు ఆర్‌జెడి కార్యాలయానికి పంపాల్సి ఉంటుందని, రూ.50వేలు ఇవ్వాలన్నారు. రూ.25వేలకు డీల్ కుదుర్చుకుని బాధితుడు శివ ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. స్వరాజ్యబాబును విజయవాడలోని ఏసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు డిఎస్పీ గోపాలకృష్ణ విలేఖర్లకు వివరించారు.
లంచం తీసుకుంటూ దొరికిపోయన ఎస్‌ఐ
తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ ఎస్‌ఐ కె శివరామకృష్ణ గురువారం అవినీతి శాఖాధికారులకు పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ కోసం 25 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఏసిబి గుంటూరు డిఎస్పీ దేవానంద్ శాంతో కథనం సంగంజాగర్లమూడికి చెందిన పాలడుగు వినయ్‌కుమార్‌కు అదే గ్రామానికి చెందిన లక్ష్మీతిరుపతమ్మతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో తిరుపతమ్మ భర్త వినయ్‌కుమార్, అత్తమామలు, కుటుంబ సభ్యులు ఐదుగురిపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ఇటీవలే ఆ ఐదుగురిపై 498 కేసు నమోదు చేశారు. వినయ్‌కుమార్ హైదరాబాద్‌లోని రెడ్డి ల్యాబ్స్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకు, కుటుంబ సభ్యులకు స్టేషన్ బెయిల్ కావాలంటూ ఎస్‌ఐ శివరామకృష్ణను ఆశ్రయించాడు. బెయిల్ ఇవ్వాలంటే డబ్బు ఖర్చవుతుందని వినయ్‌కు చెప్పారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున ఇవ్వాలంటూ ఎస్‌ఐ డిమాండ్ చేయటంతో మనస్థాపం చెందిన వినయ్‌కుమార్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.