జాతీయ వార్తలు

ఆధ్యాత్మిక దినోత్సవంగా ఆదిశంకరాచార్య జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంస్కృతిక శాఖ కార్యాచరణ

న్యూఢిల్లీ, నవంబర్ 21: భారతీయ ఆధ్యాత్మిక విలువలు, ప్రాధాన్యతలు వాటి ఆవశ్యకతపై భావితరాలకు అవగాహన కల్పించటానికి అద్వైత వ్యాప్తికి ఎనలేని కృషిచేసిన ఆదిశంకరాచార్య జయంతిని ఆధ్యాత్మిక దినోత్సవంగా నిర్వహించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ సమాయత్తమవుతోంది. 8వ ఆదిశంకరాచార్య నెలకొల్పిన శృంగేరీ పీఠం సుదీర్ఘ కాలంగా జరుపుతున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మెరుగుపడటంతో దీనిపై ప్రణాళికను రూపొందిచడంలో నిమగ్నమైంది. ఏటా వైశాఖ మాసంలో ఆదిశంకరుల జయంతి వేడుకలు జరుగుతాయి. పరిస్ధితులు అనుకూలించినపక్షంలో ఈ వైశాఖ మాసం (ఏప్రిల్)లో ఆదిశంకరాచార్యుల జయంతిని అధికారికంగా నిర్వహించే అవకాశాలున్నాయి. ఎనిమిదో శతాబ్దాదానికి చెందిన అదిశంకరాచార్య అద్వైతాన్ని ప్రచారం చేశారు. ఆయన కాలి నడకపై దేశ వ్యాప్తంగా తిరిగి అద్వేత వ్యాప్తికి కృషి చేశారు. ఆయన సిద్ధాంతాలపై ప్రజలకు విపరీతమైన భక్తి విశ్వాసాలున్నాయి. కర్నాటకలోని శృంగేరీలో ఆయన ఏర్పాటు చేసిన పీఠం వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఆదిశంకరుల జయంతిని ఒక ప్రముఖ కార్యక్రమంగా నిర్వహించే చర్యలు తీసుకోవలసిందిగా కోరుతోంది. మోదీ ప్రధాని అయిన తరువాత తిరిగి శృంగేరీ పీఠం తన లక్ష్యసాధనకు నడుంబిగించింది. ఆయన జయంతిని ఆధ్యాత్మిక దినోత్సవంగా నిర్వహించటానికి తగిన ప్రణాళికకు రూపకల్పన చేసి అందచేయవలసిందిగా సాంస్కృతిక శాఖను కేంద్రం ఆదేశించింది. త్వరలోనే ఒక ముసాయిదాను ప్రభుత్వానికి అందచేస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు.