రాష్ట్రీయం

20 కోట్లతో డిపోలు, బస్ స్టేషన్ల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, నవంబర్ 21: రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో వున్న ఎపిఎస్ ఆర్టీసీకి చెందిన బస్ కాంప్లెక్స్ డిపోలు, బస్ స్టేషన్‌ల అభివృద్ధికి, సుందరీకరణకు సుమారు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్యలు చేపడుతున్నట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరైక్టర్ ఎన్ సాంబశివరావు వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌ను ఆకస్మిక తనిఖీలు సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఒక్కో జిల్లాలో ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్‌ల అభివృద్ధికి రూ.కోటి వరకూ కేటాయిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. బస్టాండ్లలో నెలకొన్న సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. బస్ కాంప్లెక్స్‌ల్లో బస్సుల పార్కింగ్, డ్రెయినేజీల సమస్య, పైపులైన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహారీ గోడలు, సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ఆర్టీసీ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణ, రాజమండ్రి రీజినల్ మేనేజర్ సిహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.