జాతీయ వార్తలు

సర్ డేవిడ్ అటన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:జీవ వైవిధ్య శాస్తవ్రేత్త సర్ డేవిడ్ అటన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించింది. బీబీసీలో ఎన్నో డాక్యుమెంటరీలను తీసిన ఈ శాస్తవ్రేత్త ప్రకృతిలో ఉన్న వివిధ రకాల జీవ సంపదపై ఎన్నో రకాల పుస్తకాలు రాశారు. ఆయన తీసిన డాక్యుమెంటరీలకు సైతం విశేష ఆదరణతో పాటు అవార్డులను సైతం గెలుచుకున్నాయి. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ నేతృత్వంలోని అంత‌ర్జాతీయ జ్యూరీ ఈ అవార్డు విజేత‌ను ఎంపిక చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ మెమోరియ‌ల్ ట్ర‌స్టు ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. భూగోళంలోని ప్ర‌కృతి ర‌హ‌స్యాల‌ను విశ‌దీక‌రించిన గొప్ప శాస్త్ర‌వేత్త స‌ర్ అట‌న్‌బ‌రో అని ట్ర‌స్టు త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. అంత‌రిస్తున్న‌, స‌జీవంగా ఉన్న అనేక జీవాల‌కు అట‌న్‌బ‌రో పేరును పెట్టారు.