కృష్ణ

పట్టిసీమతో పశ్చిమకృష్ణా సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మంత్రి దేవినేని ఉమ
తిరువూరు, నవంబర్ 29: పట్టిసీమ జలాలతో పశ్చిమ కృష్ణాను సస్యశ్యామలం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలిపారు. తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ పదవీప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఎఎంసి కార్యాలయంలో జరిగింది. చైర్మన్‌గా తాళ్ళూరి రామారావు, వైస్ చైర్మన్‌గా పామర్తి కొండలరావు, మరో 14 మంది పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దేవినేని మాట్లాడుతూ ఈప్రణాళిక కార్యరూపం దాల్చేందుకు ఇప్పటికే కోటి రూపాయల వ్యయంతో సర్వే ప్రారంభించినట్లు చెప్పారు. పట్టిసీమ జలాలతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తిరువూరుతో పాటు మైలవరం, జగ్గయ్యపేట, నూజివీడు నియోజకవర్గాలకు పుష్కలంగా సాగునీరు అందించాలన్నది తనలక్ష్యమన్నారు. ఐతే వాహినీ వారి పెద్ద మనుషులు కొందరు ఇవేమి పట్టించుకోకుండా పట్టిసీమ జలాలు ఈప్రాంతాలకు తరలించాలని కోరుతుండటం తగదన్నారు. ఈవిషయంలో విపక్షాలతో పాటు టిడిపిలోని కొందరిపై ఆయన వాహినీ పెద్ద మనుషులు అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. విపక్షనేత జగన్మోహనరెడ్డి , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారాలోకేష్‌తో పాటు బాబు కుటుంబంపై అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి బాబుకే దక్కుతుందన్నారు. డిశంబర్ 1 నుండి 14వరకు జరిగే జనచైతన్య యాత్రలు జయప్రదం చేయాలని కోరారు. బిసి సంక్షేమ శాఖమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి బాబు విశేషకృషి చేస్తున్నారన్నారు. బిసి సంక్షేమం టిడిపికి, ఎన్టీఆర్, చంద్రబాబులకే సాధ్యమన్నారు. విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గాన్ని ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాజధాని అమరావతిలోపంటలు తొలగించిన ప్రాంతాల స్ధానే తిరువూరు నుంచి వివిధ పంటలు అక్కడికి పంపేలా చర్యలు చేపడతానని, ఇందుకు జాతీయ రహదారి విస్తరణ ఎంతోగానో ఉపకరిస్తుందని అన్నారు. మార్కెఫెడ్ చైర్మన్ కంచి రామారావు మాట్లాడుతూ జిల్లాను రెండుగా విభజించాలని అన్నారు. తిరువూరు నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ రామకృష్ణ, కొవ్వూరు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కొత్తపల్లి జవహర్‌లాల్, చండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, జడ్‌పి మాజీ చైర్మన్ ఎన్ సుధారాణి, ఎన్‌ఎస్‌పి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వై పుల్లయ్యచౌదరి, డిసి చైర్మన్‌లు సుంకర కృష్ణమోహనరావు, దేవభక్తుని సీతారామప్రసాద్, డిసిఎంఎస్ డైరక్టర్ చెరుకూరి రాజేంద్రరావు,నియోజకవర్గంలోని పలువురు నాయకులు, స్ధానిక సంస్ధల ప్రజాప్రతనిధులు పాల్గొన్నారు.