అమృత వర్షిణి

మీ విలువెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది. మరి మీ విలువ ఎంత?
ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే మనకు ఆ వ్యక్తిమీద కోపం రావడం సహజం. ఒక మనిషికి విలువ కట్టేంత మొనగాడివా? అని కోపంగా ప్రశ్నించవచ్చు. మనిషిని విలువ కట్టలేం. మనిషి ఆలోచనలు అనంతం ఆ ఆలోచనలకు విలువ కట్టలేం. కానీ ఆర్థిక అంశాల దృష్ట్యా మనిషికి విలువ కట్టవచ్చు. సమాజం కోసం కాదు. మన కోసం మన కుటుంబం కోసం, మన ఆదాయాన్ని మెరుగు పరుచుకోవడం కోసం మన విలువ ఎంతో మనం తెలుసుకోవచ్చు. దీనికి ఆర్థిక నిపుణులు ఒక సూత్రం రూపొందించారు.
ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు. మీరు నెలకు పాతిక వేల రూపాయలు సంపాదిస్తారు అనుకుందాం. ఏడాదికి మూడు లక్షల రూపాయలు అవుతుంది. మీరు పని చేయకపోయినా నెలకు పాతిక వేలు, ఏడాదికి మూడు లక్షల రూపాయలు మీకు రావాలి. బ్యాంకులో డిపాజిట్లకు ఆరుశాతం వడ్డీ చెల్లిస్తారు. అంటే 50లక్షల రూపాయలు మీరు బ్యాంకులో డిపాజిట్ చేస్తే నెల నెలకు మీకు పాతిక వేల రూపాయలు వస్తాయి. నెలకు పాతిక వేలు సంపాదించే మీ విలువ ఈ లెక్క ప్రకారం 50లక్షల రూపాయలు. అంటే మీరు పని చేయకపోయినా ఎప్పటి మాదిరిగా మీకు నెలకు పాతిక వేలు రావాలి అంటే 50లక్షల రూపాయలు మీరు బ్యాంకులో డిపాజిట్ చేస్తే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడం లభిస్తుంది. అంత మొత్తం డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసి మీ కుటుంబ ఖర్చులు తీరిపోతే ఆర్థిక స్వేచ్ఛతో మీ సమయాన్ని మీ ఇష్టం వచ్చినట్టు గడపవచ్చు.
ఈ లెక్క కేవలం ఆర్థికంగా ఒక మనిషి విలువ ఎంత అని లెక్కకట్టడానికి మాత్రమే. నిజానికి ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతుంది. ఒకేలా ఉండదు. అయితే ప్రస్తుతం సంపాదించే దాని ప్రకారం మన విలువ ఎంత అనే లెక్క కట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మన విలువ ఇది అని తెలిసిన తరువాత ఎప్పటికప్పుడు ఆ విలువను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆర్థిక స్వేచ్ఛ లభించాలి అంటే ఎంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయాలనే ఆలోచన వస్తుంది. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు మనం ఎంత మొత్తంలో బీమా తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది.
పాతిక వేలు సంపాదించే వ్యక్తి మన విలువ 50లక్షలు మాత్రమేనా ఆనే ఆలోచన వచ్చినప్పుడు ఆ విలువ పెంచుకోవడానికి మానసికంగా సిద్థం కావడంతో పాటు ఆదాయం సమకూర్చుకునే మార్గాలను అనే్వషిస్తాడు విలువ పెంచుకుంటాడు.
నిజానికి బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ద్రవ్యోల్బణం వల్ల ఏ మూలకు సరిపోదు. ఈ లెక్క ఉద్దేశం బ్యాంకులో డిపాజిట్ చేసి కాలుమీద కాలు వేసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పడం కాదు. మన విలువను మనం లెక్క కట్టుకోవడానికి ఒక మార్గం మాత్రమే. మన విలువ పెంచుకొనే ఆలోచన కలిగించే ఉద్దేశం మాత్రమే.
మీ నెట్‌వర్త్ ఎంత?
నెలకు సంపాదించే జీతం ఆధారంగా మన విలువ తెలుసుకుంటాం.
అదే విధంగా తక్షణం మన విలువ ఎంత అనే లెక్క కూడా ఎప్పటికప్పుడు మనకు తెలిసి ఉండాలి.
కంపెనీలకు నెట్‌వర్త్ ఉన్నట్టుగానే వ్యక్తులకు ఉంటుంది.
చాలా మంది ఆస్తులకు అప్పులకు తేడా తెలియదు.
మీకో ఇళ్లు, కారు, బ్యాంకులో డిపాజిట్ రూపంలో మీ ఆస్తి ఉండవచ్చు. మీ నెట్ వర్త్ ఎంత అంటే వేటిని లెక్కించాలి. అంటే ఆస్తులను లెక్కించి, అందులో నుంచి మీరు చెల్లించాల్సిన అప్పులను మైనస్ చేస్తే మీ నెట్‌వర్త్ ఎంతో తేలుతుంది.
మీ ఇంటి విలువ, బ్యాంకులో ఉన్న డిపాజిట్లు, మీ కారు విలువ, బంగారు ఆభరణాలు, ఇన్స్యూరెన్స్ పాలసీల విలువ, వివిధ రకాల ఇనె్వస్ట్‌మెంట్‌ల విలువ ఇవన్నీ మీ ఆస్తులు. వీటి విలువను లెక్క కట్టి. మీరు చెల్లించాల్సిన అప్పులను ఇందులో నుంచి మైనస్ చేయాలి. ఇళ్లు నివసించేందుకే కానీ అమ్మడానికి కాదు కదా? ఏటేటా విలువ ఎంతో తెలుసుకోవలసిన అవసరం ఏముంది? అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ మన ఆస్తి విలువ ఎంతో తెలుసుకోవడం అంటే అమ్మడం కోసం కాదు. ఎప్పటికప్పుడు ఆస్తి విలువ తెలుసుకోవడం వల్ల ఆస్తి ఎలా పెరుగుతుంది. ఆస్తిని మరింతగా పెంచుకోవడానికి ఏం చేయాలి. ఎలాంటి ఇనె్వస్ట్‌మెంట్ చేస్తున్నాం. ఇంకేం చేయాలి ఆనే ఆలోచన వస్తుంది. మనం ఆస్తి విలువ పెంచుకుంటున్నామా? విలువ తగ్గే ఆస్తులను కూడబెట్టుకుంటున్నామా? అనేది తేలుతుంది. ఇంటి విలువ ఏటేటా పెరిగితే కారు విలువ ఏడాదికి ఏడాది తగ్గుతుంది. దీని వల్ల వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకుంటాం.
మన నెట్‌వర్త్ పెరగాలి అంటే మన ఆదాయం పెంచుకోవాలి. పొదుపు పెంచుకోవాలి. సరైన ఇనె్వస్ట్‌మెంట్ చేయాలి. ఖర్చు తగ్గించుకోవాలి. ఈ ఆలోచనకు మన నెట్‌వర్త్ ఎంత అనేది తెలుసుకుంటే ఉపయోగపడుతుంది. కంపెనీలు ఏటేటా ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తాయి. ఆ ప్రకటనలుతో ఆ కంపెనీ షేర్లు మార్కెట్‌లో పెరగడం తగ్గడం జరుగుతుంది. మనను ఎవరూ అడగరు కాబట్టి మన నెట్‌వర్త్ ఎంతో మనం లెక్కించం, ప్రకటించం. కానీ కంపెనీల తరహాలోనే కనీసం మన కోసం మనం మన నెట్‌వర్త్ ఎంతో ఏడాదికోసారి లెక్కించుకుంటే మనం ఏ దారిలో వెళుతున్నాం. ఏం చేయాలో తేల్చుకోవచ్చు.

-బి.మురళి