ధర్మసందేహాలు

హోమగుండం ప్రత్యేకత ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గణపతి విశిష్టత ఏమిటి? - వెంకటేశ్వర రావు, చెన్నై
ఈ సృష్టిలో ఏ పదార్థమూ ఒంటరిగా వుండలేదు. అది గుంపులుగానే వుంటుంది. ఆ గుంపుకే జాతి అనీ గణము అనీ పేరు. అలాంటి గణాలన్నిటిలోనూ అనున్యూతంగా, (అంటే ళ్యశఆజశఖ్యఖఒ) ఒక అవిచ్ఛిన్నతత్త్వం వుంటుంది. ఇది ఏ గణానికి ఆ గణంలో కొంత స్పష్టంగానే కనిపిస్తూ వుంటుంది. ఉదాహరణకు గోవుల గుంపులో గోత్వం అనుశ్యూతంగా వుంటుంది. ఇలా పరిమితంగా కాక ప్రపంచంలోని గణాలన్నిటిలోనూ కలిపి ఒక అవిచ్ఛిన్న అనున్యూత తత్త్వ ఉంటుంది. అదే గణపతి. అందువల్ల గణపతికి చేసే పూజ సర్వదేవతాపూజే అవుతుంది. ఇదే గణపతి విశిష్టత.
* లక్ష్మీ గణపతి అంటే ఏమిటి?
- శ్రీనివాస్, నెల్లూరు
అఖండ వ్యాపకతత్త్వ స్వరూపమైన గణపతిని ఉపాసించేందుకు వీలుగా కొన్ని పరిమిత గణపతి స్వరూపాలు ఉపాసనా కాండలో ఉపదేశింపబడి ఉన్నాయి. వాటిలో లక్ష్మీగణపతి రూపం ఒకటి. ఇక్కడ లక్ష్మీ అనే పదానికి విష్ణుమూర్తి భార్య అనే అర్థం కాదు. ఒకే పేరు అనేక మందికి ఉన్నట్టుగా గణపతి ని ఆశ్రయించుకుని వున్న ఒకానొక శక్తిదేవతకు లక్ష్మీ అనే పేరు ఉంది. ఆ శక్తితో కలసి ఉన్న దేవత లక్ష్మీగణపతి.
* హోమగుండంలో నెయ్యి పోయడం కట్టెలు కాల్చడం విశిష్టత ఏమిటి?
- వెంకటేశ్, గుంటూరు
ఎవరికి భావనాశక్తి లేదో వారు హోమప్రక్రియను కట్టెలు కాల్చడంగా భ్రమిస్తారు. అదే నిజమైతే వంటలు చేసుకొనే కట్టెల పొయ్యి కూడా హోమగుండమే కావలసి వుంటుంది. అలా కాదు కదా. నామరూపాలకు అతీతమైన దేవతాతత్త్వాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నంలో దేవతా విగ్రహాలకు ఉన్నట్టుగానే అగ్ని జ్వాలలకు గూడా ఒక విశిష్ట స్థానం ఉంది. అందుకనేకట్టె పడితే ఆ కట్టెకాకుండా రావి, మోదుగ వంటి నిర్దిష్ట సమిధల ద్వారా స్వదేశీ గోఘృతం ద్వారా అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ జ్వాలలోకి ఆయా దేవతలను మంత్రపూర్వకంగా అవాహనం చేసి, వారికి అగ్ని జ్వాలల ద్వారా ఆహుతులను అందించడమే హోమప్రక్రియ అవుతుంది. అంతేకాని , చలిమంటలు హోమకుండాలు కావు.
* శక్తి అన్నా త్రిశక్తి అన్నా ఒక్కడేనా?
- శుత్రి, బోలక్‌పూర్ హైదరాబాద్
లక్ష్మీ పార్వతీ సరస్వతులను శక్తి దేవతలని సామాన్యమైన పేరు. ఆ మూడు శక్తులు కలసిన శక్తికి త్రిశక్తి అని పేరు.
* సత్రాజిత్తు అన్నదమ్ములెంతమంది వారి పేర్లేమి? - కవిత, హెదరాబాదు
శ్రీమద్భాగవతంలో సత్రాజిత్తుకి ప్రసేనుడనే తమ్ముడు ఒకడే వున్నట్లుగా ప్రస్తావన వున్నది.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి