Others

యాజ్ఞసేని - 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సుయోధనుడు నిశ్చయంగా కురువంశ వినాశకుడు అవుతాడు. సర్వనాశనమూ ఇతని వల్లనే జరుగుతుంది.’’ అని అనగా దుర్యోధనుడు విదురుని ధిక్కరించి
‘‘ప్రాతికామీ! ద్రౌపదిని తీసికొనిరా! పాండవుల గురించి భయపడవలసిన అవసరము లేదు. విదురుడు పిరికివాడు.’’ అని అనగా ప్రాతికామి సింహపు గుహలోనికి కుక్క ప్రవేశించినట్లుగా రాజ భవనంలోనికి ప్రవేశించి ద్రౌపది వద్దకు చేరాడు. ద్రౌపదిని చూచి ఆమెతో
‘‘అమ్మా! ద్రౌపదీ! యుధిష్ఠిరుడు ద్యూతోన్మాదానికి లోనయ్యాడు. దుర్యోధనుడు నిన్ను గెలుచుకొన్నాడు. ఇప్పుడు నీవు ధృతరాష్ట్రుని భవనానికి రావాలి. నిన్ను దాసీపనికి అక్కడకు తీసికొని వెళతాడు’’ అని అన్నాడు. అప్పుడు ద్రౌపది

‘‘ప్రాపతికామీ! ఏమిటిలా అంటున్నావు. రాజకుమారుడు ఎవరైనా భార్యను పందెం పెట్టి జూదమాడుతాడా? పందెం పెట్టటానికి మరేదీ దొరకలేదా?’’ అని అనగా
‘‘రాజకుమారీ! జూదంలో పందెం పెట్టటానికి మరేదీ లేని సమయంలో అజాతశత్రుడైన ధర్మరాజు ఈ విధంగా జూదమాడాడు. ఆ యుధిష్ఠురుడు ముందు తమ్ములను, తరువాత తనను, చివరికి నిన్ను కోల్పోయాడు’’ అని అన్నాడు ప్రాతికామి. వెంటనే ద్రౌపది
‘‘సూత కుమారా! వెళ్లి జూదగాడైన ఆ మహారాజును ఈ విధంగా అడుగు ‘‘ముందు నిన్ను ఓడిపోయావా? లేక నన్ను ఓడిపోయావా?’’ సూతకుమారా! ఆ విషయం తెలిసికొనిరా! తరువాత నన్ను తీసికొని వెళ్లవచ్చును. ఇది తెలిసిన తరువాతనే దుఃఖితనైన నేను సభకి వెళతాను’’ అన్నది.
ప్రాతికామి ఏమియూ మాట్లాడక తిరిగి వెళ్లి రాజుల సమక్షంలోవున్న యుధిష్ఠురునకు ద్రౌపది మాటనిలా వినిపించాడు.
‘‘ఏ వస్తువులపై ఆధిపత్యం కలిగిన నీవు నన్ను ఓడిపోయావు. ముందు నిన్ను ఓడిపోయావా? లేదా ననే్న ముందు ఓడిపోయావా? అని ద్రౌపది అడిగి రమ్మన్నది’’ అని సమాధానాన్ని కోరాడు.
యుధిష్ఠురుడు నిశే్చష్టుడయ్యాడు.ప్రాణాలు పోయినట్లయింది. సమాధానం చెప్పలేకపోయాడు
అంత దుర్యోధనుడు ‘‘ఆమెను ఇక్కడికి వచ్చి ఆ ప్రశ్న వేయమను’’ అని అనగా ఆ మాటలను విని ప్రాతికామి మరలా రాజభవనానికి వచ్చి ద్రౌపదిదేవితో
‘‘రాకుమారీ! ఈ సభ్యులు నిన్ను సభలోనికి పిలుస్తున్నారు. కౌరవులకు వినాశకాలం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. నిన్ను సభలోనికి పిలిపించి పతనమైన ఆ సుయోధనుడు తన ఐశ్వర్యాన్ని రక్షించుకొనలేడు’’ అని అనగా
‘‘ఓ సూతపుత్రా! విధి ఈ విధంగా నిర్ణయించాడు. మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనకు శాంతినిస్తుంది. ధర్మమొక్కటే లోకంలో గొప్పది. ఈ ధర్మాన్ని నేను అతిక్రమించను. కాబట్టి నీవు కౌరవ సభలోనికి వెళ్లి ధర్మబద్ధమైన నా మాటలను అడుగుము. నేనేం చేయాలో వారే నిర్ణయించి చెపుతారు. ఆ మేరకు నేను పాటిస్తాను. ధర్మాతులు, నీతిమంతులు ఆ పెద్దలు చెప్పినట్లు చేస్తా’’ అని అన్నది ద్రౌపది.
ప్రాతికామి తిరిగి వచ్చి అక్కడ సభలో ద్రౌపది చెప్పిన మాటలను వినిపించాడు.
దుర్యోధనుడు చేయదలచిన పనిని విని ధర్మరాజు ద్రౌపదికి నచ్చిన ఒక దూతను ఆమె దగ్గరకు పంపాడు.

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము