Others

స్నేహం విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సజ్జన స్నేహం గురించి తులసీదాసు రామచరిత్‌మానస్‌లో గొప్పగా చెబుతారు. సజ్జన సాంగత్యాన్ని ఎంత ఖర్చైనా గూడా చేయాలంటారు. దుర్జనులతో సాంగత్యాన్ని రూపాయి ఖర్చుచేసి మరీ వదిలించుకోమంటారు. సజ్జన స్నేహం కోసం ఎంతదూరమైనా వెళాలనేది పెద్దలమాట. రామాయణంలో కైకకు అరణపు దాసిగా వచ్చిన మంథర తో చాలా స్నేహం ఉండేది. అన్ని చోట్ల ఈ స్నేహం బాగానే ఉంది కాని కైకపై ఉన్న దురభిమానంతో మంథర దుర్బోధ చేసింది. రాముడిని వనవాసం పంపించమని, భరతునికి రాజ్యకావాలని అడమని దుర్బోధ చేసింది. దానివల్ల కైకకు వైధవ్యం లభించింది. కన్నకొడుకుమించిన ప్రేమించిన రాముడు దూరమైయ్యాడు. కన్నకొడుకుతో నిష్ఠూరాలను పడింది. అట్లానే భారతంలో దుర్యోధనుడు శకునితో, కర్ణునితో స్నేహం చేసి లేనిపోనీ గొప్పలకు పోయి రాజ్యమేకాక తన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నాడు.
కాని రామాయణంలో రాక్షసుడైనా మనుజుడైన రాముడితో విభీషణుడు స్నేహం చేసి లంకాధిపతి అయ్యాడు. జటాయువు దశరథునితో స్నేహం చేసి దశరథుని కొడుకుకు సాయం చేసి చివరకు రాముని చేతిలో మరణించాడు. రాముడు సొంత తండ్రిని పోగొట్టుకున్నట్టుగా బాధపడి జటాయువు అంటే పక్షిరాజుకు అంత్యక్రియలు చేశాడు. ఇలా మంచి స్నేహం వల్ల రాజ్యాలేకాదు చరిత్రలో వారి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడేట్టుగాపరిస్థితులు మారుతాయి. అందుకే మంచిస్నేహం గురువు దగ్గర నేర్చిన విద్యలాగాను, జ్వాలాయమానంగా వెలిగే దీపంగాను చెబుతారు.

-ఆర్. పురంధర్