Others

దారితప్పుతున్న ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సమాజంలో ధర్మము దారితప్పుతున్నది. అధర్మం రాజ్యమేలుతున్నది. ఎక్కడ చూసినా ఏరంగంలోనైనా అవినీతి బహుధా కనిపించడం శోచనీయం. నేటి యువతకు ఏది ధర్మమో? ఏది అధర్మమో తెలియని పరిస్థితి నెలకొని యుండుట విచారకరం. తుదకు దైవసన్నిధిలో కూడా నిర్భయంగా అవినీతిని కొనసాగించుట చూస్తే అతిత్వరలో ధర్మసంస్థాపనా యజ్ఞ క్రతువు ప్రారంభమగుట తథ్యము. సజ్జనులు, సామాన్యులు ఈ అవినీతి కోరలలో చిక్కి విలవిలలాడుట చూసి సహించుట దుర్లభం కదా. నిరంతర స్వార్థ యోచనలో మునిగిన అసుర స్వభావులు అరిషడ్వర్గాలలో అసలైన ఆనందానికి దూరమగుచున్నారు. కామమే ఆనందమనే భ్రమలో క్రోధమునకు దగ్గరగుచున్నారు. భోగమే యోగమనుకొని రోగగ్రస్థులై నరకమునకు పోవుచున్నారు. సత్సాంగత్యము లేక, సత్కర్మ లేవియో తెలియక వికర్మలను చేపట్టి పతనమగుట కలియుగ లక్షణముగా కనబడుచున్నది. ఇటువంటి విపత్కర పరిస్థితిలో జ్ఞాననిష్ఠ, ధ్యాననిష్ఠ అత్యంత అవశ్యము.
జ్ఞానమనగా వర్ణాశ్రమ ధర్మాచరణ. ధర్మసంస్థపనకు జ్ఞానమే సరియైన ధర్మపథమును అందించును. జ్ఞానమార్గమే శ్రేయోమార్గమని కృష్ణ్భగవానుడు ప్రవచించాడు. ‘్ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అని అవినీతిపరులైన దుర్జనులను హెచ్చరిస్తున్నాడు గీతాచార్యుడు.
ధర్మాచరణయే జ్ఞానమార్గమని తలచి ఫలాపేక్ష, స్వార్థరహిత కర్మపథములో పయనించి సచ్చిదానందమును చేరువారే సజ్జనులు. వీరికి ఈ జన్మలోనే మోక్షము లభించుటలో ఆశ్చర్యమేమున్నది.

-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు