Others

ఆత్మ విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆత్మ విమర్శ ప్రతివారికి అవసరమే. కాని అందరూ ఆత్మ విమర్శ చేసుకోరు. ఆ దిశగా ఆలోచించేవారు అరుదుగా కనిపిస్తారు. కాని కపిలబోధలో దేవహూతికి కపిలుడు బోధ చేస్తూ గర్భస్థ శిశువు చేసే ఆత్మ విమర్శ గురించి చెప్పినట్టు ఉంది. - గర్భస్థ పిండము నెలకు తల, రెండు నెలలకు కాళ్ళు, చేతులు మూడవ మాసం ముగియుసరికి నఖములు, రోమాలు, లింగ భేదము, నవరంధ్రములు, నాల్గవనెలకు సప్త్ధాతువులు, ఐదవ నెలలో ఆకలిదప్పికలు, ఆరవ నెలలో తల్లి గర్భమున కుడి పార్శ్వమున తిరుగుచు తల్లి తినగా లభించిన ఆహార పానీయములు ఆరగిస్తూ తన కడుపున తన శిరమును మోపిగాని ఇటు నటు కదలలేక పడియున్న తరుణంలో దేవుని కృపవలన పూర్వజన్మ జ్ఞానమును పొందును. ఆ జ్ఞాన ఫలముతో తను ఈ గత జన్మలో చేసిన పాపకృత్యములను తలచి ఆత్మ విమర్శకు పాల్పడును. చావు పుట్టుకల నేపథ్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని తల్లి కడుపున తను పొందుచున్న దుర్భర నరకయాతనలను భరించలేక తను పూర్వజన్మలో చేసిన పాప కర్మల ఫలితమును తెలుసుకొని యుక్తాయుక్త విచక్షణా జ్ఞానముతో ఆత్మవిమర్శ చేసుకొని పశ్చాత్తాపము చెందుతూ దేవదేవుని ప్రార్థిస్తాడు. భగవంతుడా నేను గత జన్మను వృధా చేసుకున్నాను, పరమాత్మవైన నిన్ను మరచి ఇష్టానుసారం ప్రవర్తించి అనేక దుష్కృత్యాలకు పాల్పడ్డాను. అంధకార బంధురమైన ఈ గర్భము నుండి నన్ను రక్షించుము. ఓ దేవ దేవా! అనేక దుఃఖములకు క్రిమి సంభవమైనట్టి దుర్భర గర్భవాసమును నేను భరించలేకున్నాను. ఆర్తత్రాయ పరాయణ- నన్ను రక్షించు. సదా నీ పాద పద్మములను భజిస్తూ మరు జన్మను అచ్యుతుని ప్రార్థించే జీవుడు తన గత జన్మను పరి పరి విధాల తలచి తలచి కర్తవ్యాన్ని గ్రహించి పశ్చాత్తాపం చెందుతాడు. *