Others

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

292. భానునందను డవనిజ పతిని జూచి
‘‘రాఘవా! మే మొక దినము పర్వతాగ్ర
మందు నుండగ గగన మార్గమ్మునందు
రావణాపహృతయగు స్ర్తి మమ్ముజూచి

293. భూషణంబుల కొంగున మూటగట్టి
మా దరికి విసరగ నవి మేము దెచ్చి
భద్రపరచితి’’ మని గుహన్ పదిల పరచి
నట్టి నగలను రాఘవునెదట నుంచ

294. ప్రియ సతి చీరె చెరగును భూషణముల
జూచి దంతదీ మూర్ఛిల్లె రాఘవుండు
అంత తెలివొంది కన్నుల నీరు గప్ప
‘‘లక్ష్మణా! సీత సొమ్ములే జూడు’’ మనగ

295. సజల నయనుడై సౌమిత్రి నగల జూచి
వొక్కటొకటిగ దీసి ‘యిందొక్క టెరుగ
నందియలు మాత్ర మామెవె నిత్య మామె
పదములకు మ్రొక్కునప్పుడు జూతుగాన’’

296. అంత రాముడు రవిసుతు జూచి ‘‘సఖుడ!
సీత నపహరించి పెనుసంకటము గలుగ
జేసి నట్టి యా రాక్షసుడెచట నుండు?’’
దెల్పు మిపుడె నప్పాలసు ద్రుంచివైతు

297. ‘‘రఘుపతీ! వాని వాన స్థలంబు నెరుగ
నద్దనుజు పుత్ర మిత్ర బంధుసహితముగ
బటిట బరిమార్చి శీఘ్రమే పత్ని తోడ
నిన్ను గూర్చెద రాఘవా! నమ్ము నన్ను’’

298. అనుచు బల్కి సుగ్రీవుడు ‘‘రామచంద్ర!
శోకమును వీడి పౌరుషం బూతగొనుము
నీకు నుపదేశమును జేయ నెంతవాడ
నెయ్య మెదనుంచి నన్ను మన్నింప వయ్య!’’

299. సూర్యనందనుడట బల్క సుగుణధాము
డైన దాశరధి సుగ్రీవు ప్రేమ మీర
చెంతకుం జేర్చి నీవంటి సఖులు గలరె?
కష్ట కాలంబు నందాదుకొనెడు వారు
300. ‘‘నీదు మాటల నామది నిర్మలతను
పొందె సీతను వెదకగా బూనుకొనుము
నీకు నేనేమి జేయగవలయు దాని
దెల్పు మింతయు సందేహమేని వలదు.’’

301. అన సుగ్రీవుడు జానకీనాధుతోడ
‘రాఘవా! నిన్ను సఘునిగ పొంది నేను
ఇంద్ర పదవియేనియు పొందు దింక నాదు
రాజ్యమన నెంత నెంచగ రామచంద్ర!’’

302. సాల వృక్ష శాఖను సుఖాసీనులైన
రామ లక్ష్మణులకు నిజ చరిత మెల్ల
జెప్ప దొడగె సుగ్రీవుడు చిత్తమందు
మరుగు పరచిన హృదయ తాపమ్ము దీర

303. ‘‘ఋక్షరజసుడు కిష్కింధ రాజు నతని
పుత్రులము మేము నిర్వుర మగ్రజుండు
వాలి రాజ్యమేలుచు నుండెనొక నిశీధి
యందు మాయావి యను రక్కసుండు వచ్చి

304. వాలి ననికి బిల్వ రోషించి మాయన్న
వాని మద మణంచి వత్తు ననుచు
వేగుచున్న నిల్వ మిది సమయంబుగా
దన్న వినక మమ్ము ద్రోసి జనియె

305. ఒంటిబోవు వాని వదలక వెన్నంటి
బోతి నేను మమ్ము జూచి వాడు
వెరచి పరచి కొండ గుహయందు దాగిన
నన్ను నీవిచటనె నిల్వు మంచు

306. వాలియును బిలమును జొచ్చె ద్వారమందు
గాచు కొని యుంటి నేనట్లు వత్సరంబు
గడిచె నొక దిన మద్రిగహ్వరము నుండి
రక్తమాంసముల్ బయటకు రాగ జూచి

307. దైత్య గర్జనములు గుహనుండి వినిపింప
వాలి దైత్యుచేత నిహతుడయ్యె
నని దలంచి రక్కసుడు బయల్పడకుండ
పెద్దబండ చేత బిలము మూసి
*

టంగుటూరి మహాలక్ష్మి