సబ్ ఫీచర్

పుష్పించడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మగవాడూ మరి ప్రతి స్ర్తి- ఏదో ఒక సమయానికి లేదా ఏదో ఒక జన్మలో పుష్పిస్తారు. దానే్న ‘్యతీళూజశ’ అంటారు. మనిషి తర్కాన్ని అధిగమిస్తే తప్ప పుష్పించలేడు. ఆధ్యాత్మికత అనేది ఒక సహస్ర దళ పుష్పం. అది హేతువాదానికి, తర్కానికి అందేది కాదు. అది సహజత్వం. అది వికసించిన స్థితి ఒక సీతాకోక చిలుకకు తెలుసు ఆ పుష్పించిన స్థితి. ఒక తేనెటీగకు తెలుసు. మకరందం ఎక్కడుంటుందో! ఒక రామచిలుకకు తెలిసి ఏ పండు మిగలపండి మృదుమధురంగా ఉంటుందో!
ఒకామె భర్త మరణించిన వేదనలో ఇదిస్తోంది. అక్కడకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన వారి పక్కింటాయన. చూడమ్మా! ఆత్మశాశ్వతం. కానీ శరీరం శాశ్వతం కాదు. నీ భర్త శరీరం మరణించింది- కానీ ఆత్మ మరణించలేదు- అది మళ్ళీ జన్మ తీసుకుంటుంది. దుఃఖించకు అన్నాడు పెద్ద వేదాంతిలా. రెండేళ్ళ తర్వాత అతని భార్య మరణించింది. అపుడు పక్కింటి మహిళ (గతంలో భర్తను కోల్పోయిన స్ర్తి) వచ్చి ఏడవకండి అంకుల్! మీరు గుర్తుచేసుకోండి. రెండేళ్ళ క్రింద మావారు మరణించినపుడు మీరేం చెప్పారో! మీ భార్య శరీరం మరణించింది. అయితే ఆమె ఆత్మ మరణించలేదు. మళ్ళీ జన్మ తీసుకుంటుంది కదా అంది.
ఆ అంకుల్ ఇలా అన్నాడు- తనదాకా వస్తే ధర్మాలు మారిపోతాయి అవి ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయంటారు ఆచార్య ఆత్రేయ. ఇలా ఎన్నోఎన్నో అనుభవాలు. తర్వాత, కొన్ని జన్మల అనే్వషణ తర్వాత మనిషి పుష్పించడం ప్రారంభిస్తాడు. ప్రకృతిని సునిశితంగా గమనిస్తాడు. ఒక పువ్వును, దాని సున్నితత్వాన్ని, ఒక పిట్టను, దాని కూతను, దాని రంగును, అది ఎగరడాన్ని, నీటి అలను, ఆకుల కదలికను, గువ్వల గుసగుసలను, పాప చిరునవ్వునూ, తాత బోసి నోటిని ఇలా సృష్టిలోని ప్రతి అందాన్ని, మాధుర్యాన్ని మమతను, ప్రేమను, స్నేహాన్ని అన్నింటిలో ఆనందిస్తాడు ఆస్వాదిస్తాడు.
అలా ఉండడానికి ప్రయత్నిస్తాడు. క్రమక్రమంగా తానే అదైపోతాడు. అతనికి డబ్బు అధికారం, పదవి, భోగం ఏవీ ఎక్కువ కావు. ఏదీ తక్కువ కాదు. తానే అదైన స్థితి. అదే తానైన స్థితి. అదే పుష్పించడం అంటే!
దీనికి స్ర్తిపురుష భేదం లేదు. స్పందించే హృదయం కావాలి- అలా వుండడానికి! నిజమే కళాకారులు వీరే! రవివర్మ పెయింటింగ్స్‌లో జీవకళ ఉట్టిపడుతుంది అంటే అతడి హృదయం పుష్పించి ఉందన్న మాట. త్యాగరాజు గొంతులోంచి ‘‘దొరుకునా ఇటువంటి సేవ’’- ‘‘పిబరే రామరసం’’- నిధి చాలా సుఖమా! రామా నీ సన్నిధి చాలా సుఖమా! అని వెలువడిందంటే అది పుష్పించిన గొంతు! గుండెలోతుల్లోంచి వచ్చిన ఆర్ద్రత!
ఆ ద్వితీయ ప్రసిద్ధిగాంచిన మహనీయులు వారి జీవితాలల్లో పుష్పించిన స్థితిని పొందినందువల్లనే అది సాధ్యమయింది. అది ప్రతిభ కాదు, ప్రావీణ్యంకాదు, పాండిత్యం కాదు.
అది సహజత్వాన్ని సంతరించుకున్న స్థితి- ఆత్మానంద స్థితి.
ఒకసారి అక్బర్ చక్రవర్తి వాహ్యాళికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటపుడు ఒక మసీదునుంచి సుమధుర గానం వినిపిస్తోంది. అక్బర్ పరవశించిపోయాడు ఆ గాన మాధుర్యానికి. హృదయానికి ఏవో గంధర్వ పుష్ప సౌరభంతో కలిపిన వీణాతంత్రుల అపూర్వ ధ్వని స్పృశించి అతడిని పిచ్చివాడిని చేసింది. రథాన్ని మెల్లగా పోనివ్వమని చెపుతూ, గాన మాధుర్యాన్ని నింపుకుంటూ రాజభవనం చేరాడు. వెంటనే తన ఆస్థాన గాన విద్వాంసుడైన తాన్‌సేన్‌ను పిలిపించి, ఆ మసీదుకు వెళ్ళి ఆ గాయకుడి గురించి విచారించి, వీలైతే పిలుచుకురమ్మని కోరాడు.
ఒక రెండు గంటల తర్వాత ఆనందాతిరేకంతో తిరిగొచ్చాడు తాన్‌సేన్. ఇంతకుముందు తాను పొందిన ఆనందం కంటే తాన్‌సేన్ ముఖంలో దాని వంద రెట్లు ఆనందం కనిపిస్తోంది. చెప్పాడు తాన్‌సేన్! ప్రభూ- నాది తమను మైమరపించే గానం. అయితే అతడిది భగవంతుడినే మైమరపించే గానం అన్నాడు. మరింత వివరించమన్నాడు అగ్బర్.
ప్రభూ! అతడొక గంధర్వుడేమో! అతడు అల్లాను గురించి పాడుతున్నాడు. ప్రకృతిని గురించి పాడుతున్నాడు! ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అన్నీ పులకించేట్లు పాడుతున్నాడు. మనం అతడిని ఇక్కడకు రప్పించవచ్చు- కానీ అతడి పాటను రప్పించలేం అన్నాడు తాన్‌సేన్. ఏమిటి తాన్‌సేన్‌జీ మీరు చెప్పేది? అతడొచ్చినా అతడి పాట రాదా? అదేమిటి? అని అడిగాడు అగ్బర్.
బదులిలా ఇచ్చాడు తాన్‌సేన్; ప్రభూ! నవ్విస్తే పసిపాప నవ్వదు. అడిగితే పిట్ట కూయదు. అలాగే ప్రకృతితో మమైక్యమై ఉన్న ఆ దైవ సమానుణ్ణి ఆజ్ఞాపించి మనం పాట పాడించుకోలేం. మనమే వెళదాం రండి అన్నాడు. కళాకారులపట్ల గౌరవం కల్గిన అక్బర్ చక్రవర్తి మసీదుకు వెళ్ళి ఆ గాన గంధర్వుడు పాడినంతసేపూ శ్రద్ధగా కూర్చుని విన్నాడు. ఆ తర్వాత ఎంతో సేపటికి అతడు గానాన్ని పూర్తిచేసి పరిసరాలను గమనించాడు.
అక్బర్ అతడికి నమస్కరించి మహా గాయకుడా! వర్ధిల్లు. మా ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకో. నీకొక ప్రకృతి సహజ నేపథ్యంలో ఉన్న భవంతినిస్తాను- అందులో నివసించు అన్నాడు. ఆ గాన గంధర్వుడన్నాడు కదా- చక్రవర్తీ! నువ్వు అహంకారం లేకుండా ఇక్కడికే వచ్చినందువల్లనే ఈ గానం వినగలిగావు. ఈ తాన్‌సేన్ మన గాయకుడు. నేను ఎక్కడుంటే అదేనా ప్రకృతి. ఇపుడు ఈ మసీదు నా భవంతి. రేపు మరో ఊరు. మరో మసీదు. లేదా గుడి. లేదా పూరిగుడిసె. ప్రపంచమంతా నాదే! వెళ్లిరా అని అక్బర్ మరి తాన్‌సేన్‌ల శిరస్సును మూర్కొన్నాడు.
అదే పుష్పించిన స్థితి అంటే జన్మజన్మల అనుభవాల తర్వాత మనుషులు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. అక్కడా క్రిందా మీదా పడుతూ మరికొన్ని జన్మల తర్వాత సమత్వాన్ని సాధిస్తారు. ఆపైన వచ్చేదే పుష్పించిన స్థితి. దానే్న ఉజనిద్హిఉఉ అంటారు. దివ్యజ్ఞాన ప్రకాశం అంటారు. సహస్రారస్థితి అంటారు. అలాంటివారు సర్వసాధారణంగా ఉంటారు.
శ యూజూజశ్ఘూక ఘౄశ ! ఎవరైతే అసాధారణ స్థితులను అధిగమించి, అన్నీ దాటి ఉంటాడా, వారే సర్వసాధారణ స్థితిని కల్గి ఉంటారు. పుష్పించి ఉంటారు.

-మారం శివప్రసాద్.. 9618306173