ఆంధ్ర గాథాలహరి

ఇవి కారుమబ్బులు కావా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
గిహ్మే దవగ్గిమసి మలి ఆఇందీసంతి విజ్ఘసింహరా ఇం!
ఆనసు పఉ త్థవ ఇఏణ హూంతి ణవపా ఉసచ్ఛా ఇం (బుద్ధవాహుడు)
సంస్కృత ఛాయ
గ్రీష్మే ద వాగ్ని మషీ మలినితాని దృశ్యంతే వింథ్య శిఖరాణి
ఆశ్వ సిహిప్రోషిత పతికే నభవంతి నపప్రావృఢ భ్రాణి!!

తెలుగు
తే.గీ ధవుని రాకకై తపియించు తరళనయన
కనగ వింధ్యాచలము మీది కారుమబ్బు
వార్షుకముగాదు, మదిలోన భయము వలదు
దుస్సహదవానలోద్భూత ధూమమదియె

దూర దేశాననున్నమగడు వర్షాకాలం వచ్చేటప్పటికి వస్తానన్నాడు. వింధ్య పర్వతంమీద అలముకొని ఉన్న కారుమబ్బును చూచి పతి ఇంకా రాలేదేమని భయపడుతూన్న చెలిని ఊరడిస్తూ ప్రియసఖి ‘వింధ్య పర్వతంమీది కారుమబ్బులు వర్షమేఘాలు కావు, గ్రీష్మంలో జనించే కార్చిచ్చు వల్ల కలిగిన నల్లని పొగలు’ అని చెప్పింది.
వస్తామన్న సమయానికి రాకపోతే పతి గురించి ఆలోచించే పత్ని బాధ వర్ణనాతీతం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆ బాధను ఈ చెలికూడా భరించినదేకనుక ఆమెకు పతి గురించి బాధపడవద్దని వస్తాడు లెమ్మని చెప్పడానికి కారుమబ్బులను సైతం కార్చిచ్చు వల్ల కలిగిన మబ్బులుగా చూపించింది. అతివ అనుకొంటే దేనినైనా సులభం చేసేస్తుంది.బాధను దూరం చేసి పతి విరహాగ్నిలో వేగిపోక వేచి చూడమని సలహా ఇచ్చిన నెచ్చలి నైజం మెచ్చు కోవలసిందే .

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949