ధర్మసందేహాలు

అన్నివేళలా భగవద్గీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గ్రహస్తోత్రం చేసేటప్పుడు సూర్యుడి దగ్గరనుంచీ వరసగా చదవాలా? ఏ గ్రహం నుంచీనైనా చదవవచ్చా? - పద్మ, కాకినాడ
జాతక విశేషాలు తెలిసిన పెద్దల ద్వారా ఏ గ్రహానికి శాంతి చేసుకోవాలో తెలుసుకొని, ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ఆ పెద్దలు చెప్పిన సంఖ్య ప్రకారంగా చదువుకుంటూ మొదట్లో గానీ చివర్లోగాని నవగ్రహ స్తోత్రాన్ని సూర్యుడాదిగా కేతువు పర్యంత క్రమంలో చదువుకోవటం ఉత్తమం. ప్రత్యేక శాంతి అవసరం లేకపోతే, నవగ్రహ స్తోత్రాన్ని యథాతథంగా నిత్యపారాయణ చేయడం మంచిదే.
* పేరు మారిస్తే అదజష్టం కలసి వస్తుందా?
- ఎన్. రామలక్ష్మి, సికింద్రాబాద్
సనాతనమైన జ్యోతిశ్శాస్త్రంలో అలా లేదు.
* భగవద్గీతను పార్థివ దేహాల దగ్గర వినిపించవచ్చునా? - నీరజ, వెంకటాపురం
ఇలా చేయమని ధర్మశాస్త్ర గ్రంథాలలో ఎక్కడా కనిపించటం లేదు. కానీ ఇలాంటి ఆచారం ఈ మధ్య పెరిగింది. దానివల్ల శుభకార్య సందర్భాలలో భగవద్గీత వినపించరాదనే అపప్రథ ఏర్పడుతోంది. అలాంటి అపార్థం లేకుండా ఉంటే ఆ సందర్భంలో భగవద్గీతను వినిపించటంలో, వినడంలో తప్పులేదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035. vedakavi@serveveda.org