ధర్మసందేహాలు

శివాలయ ప్రదక్షిణ నియమాలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేసే విధానమేమిటి ? అనేకరకాలుగా చెబుతున్నారు. ఏరకమైన శివాలయంలో ఏ ప్రదక్షిణం చేయాలి - ఎమ్. బుచ్చి కృష్ణమూర్తి తుని
శివాలయ ప్రదక్షిణం గురించి ఆగమ శాస్త్రగ్రంథాల్లో విభిన్న రీతుల విధానాలున్నాయి. వాటిలో అర్థ ప్రదక్షిణ విధానం ప్రశస్తంగా కనిపిస్తోంది. దీనిలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి శివాలయానికి ప్రదక్షిణ క్రమంగా నడిచి, శివాభిషేకజలాలు బయటకు వచ్చే తూము దాకా వచ్చి దానిని దాటకుండా వెనక్కు అప్రదక్షిణంగా నడిచి, ధ్వజస్తంభాన్ని దాటి మళ్లీ సోమ సూత్రాన్ని దాటకుండా రెండవ ప్రదక్షిణాన్ని పూర్తిచేయాలి. రెండవ ప్రదక్షిణం మాత్రం సోమసూత్రం నుంచీ ప్రారంభమై మళ్లీ సోమసూత్రం దగ్గరే ఆగుతుంది. ఇక మీదట ఎన్ని ప్రదక్షిణాలైనా ఇంతే. ఇది చేతకానప్పుడు గానీ, అభిషేక జలద్వారం (సోమసూత్రం) స్ఫుటంగా కనిపించని సందర్భంలోగానీ మామూలు ప్రదక్షిణం చేయాలని పెద్దలు చెబుతున్నారు.

* నాకు 82 ఏళ్లు. కాళ్లు వంగవు. కింద కూర్చోలేను. నేను సత్యనారాయణ వ్రతం చేసుకొనే మార్గమేమిటి? ఎస్.వి. రమణరావు, రాజమండ్రి
ఈ వయస్సులో ఈ ఆరోగ్య స్థితిలో కింద కూర్చోవటం ముఖ్యం కాదు. ఎత్తయిన టేబులు వంటి వాటి మీద విగ్రహాదులను పెట్టుకుని మీరు కుర్చీలాంటి దాంట్లో కూర్చుని, అన్ని పూజలు చేసుకోవచ్చు. అదీ చేతకాని పక్షంలో వ్రతాన్ని అమూలాగ్రంగా నిదానంగా మానసిక విధానంలో చేసుకోవచ్చు. దీని ఫలితం ఇంకా ఎక్కువ. అంతేగానీ అసలేమీ అనుష్ఠానం లేకుండా వుండరాదు.

* వినాయకుడికి సిద్ధి, బుద్ధి భార్యలని ఏ పురాణంలో ఉంది? నిర్మల, బెంగుళూరు
ఈ విషయాన్ని శివ పురాణంలో ఉంది. సిద్ధి లక్ష్మీదేవి అంశ, బుద్ధి సరస్వతీ దేవి అంశ. అందుకనే వినాయక చవితినాడు వినాయక విగ్రహానికి ఒక పక్క పుస్తకాలు, మరో పక్క ఫలసస్యాదులు, వుంచి పూజిస్తారు.
**

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org

- కుప్పా వేంకట కృష్ణమూర్తి