ధర్మసందేహాలు

నందికొమ్ముల సంకేతం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నందీశ్వరుని కొమ్ములపై ఏ చేయి వుంచి మిగిలిన ఏ చేయితో వృష్ఠ్భాగం తడవాలి? దాని విశిష్ఠత కూడా తెలియచేయమని కోరుచున్నాము? - యమ్.బుచ్చికృష్ణమూర్తి, తుని
నందీశ్వరుడి కొమ్ములు ఏకాగ్రతకు సంకేతం. వాటిపై కుడి చేయి వుంచి ఆ కొమ్ముల సందులోంచి శివలింగాన్ని దర్శించడంవల్ల మనలోని ఏకాగ్రత పెంపొందుతుంది. నందీశ్వరుడి వృష్ఠ్భాగం ఇంద్రియ నిగ్రహానికి సంకేతం. అందువల్ల శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వర వృష్ఠ్భాగ స్పర్శనం ఎడమ చేతితో చేయాలని విధించబడింది. ఈ ప్రక్రియలో కుడి ఎడమల విషయంలో స్పష్టమైన నిర్ణాయక వాక్యాలు కనపడటం లేదు. కనుక ఈ విషయంలో ఏ చేయిని ఎలా వాడినా ఇబ్బంది లేదు.
* నా భార్య చనిపోయి నేను భరించరాని దుఃఖంలో వున్నాను. నా దుఃఖం తీరే దెలాగ?
- ఆర్.లక్ష్మీనారాయణ, దమ్మాయిగూడ
జీవుల గమనాగమాల గురించి వివరించే ఘట్టాలు భారతంలోనూ, భాగవతంలోనూ, భగవద్గీతలోనూ విశేషంగా వున్నాయి. వాటిని మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేయటమే మీ బోటి పండితులకు ఈ విషయంలో ఉత్తమ మార్గం.
* గురునాథస్వామి అంటే ఎవరు? మా వంశంలో గురునాథస్వామి నోము ఉన్నది గానీ దాని నియమ నిష్ఠలకు భయపడి మేము ఆచరించలేకపోయాము. దానివల్ల మా పిల్లల అభివృద్ధిలో ఆటంకాలు వస్తున్నాయి. దానికి పరిష్కార మార్గం చెప్పండి.
వంశానికి ఇలవేల్పు ఎలా వుంటాడో అలాగే కొన్ని వంశాలకు కుల గురువు వుంటాడు. ఆ గురువు సామాన్యంగా త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి యొక్క అంశగలవాడై వుంటాడు. ఆ వంశంలోవారు ఏ కొద్ది శ్రద్ధతో తన వ్రతం ఆచరించినా వారకి విశేష సత్ఫలితాలను అందించటమే గురునాథ స్వామియొక్క దీక్ష. మీరు నియమ నిష్టలకు భయపడి ఆ వ్రతం మానటంవల్ల మీ వంశంలో పుణ్యబలం తగ్గి పిల్లలకు ఆటంకాలు కలుగుతున్నాయి. కనుక నియమ నిష్ఠలు కొంచెం తగ్గినా, లఘువుగానైనా గురునాథ వ్రతాన్ని ఆచరించడం మీ అవశ్య కర్తవ్యం.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి