ధర్మసందేహాలు

పేరులోని రహస్యమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వెంకటేశ్వరస్వామిని వడ్డీకాసులవాడు అని ఎందుకు పిలుస్తారు? - వేంకటేశ్, నల్లగొండ
వెంకటేశ్వరస్వామి తన వివాహ సందర్భంగా కుబేరునివద్ద అప్పు తీసుకున్నాడని, దానికి వడ్డీగా సొమ్ము చెల్లించేందుకోసమే భక్తుల దగ్గరనుంచి భూరి విరాళాలను కలియుగాంతంవరకు స్వీకరిస్తాడని పురాణాలు చెపుతున్నాయి. అందుకనే ఆ స్వామికి ‘‘వడ్డీకాసులవాడు’’ అనేది బిరుదై పోయింది.
* శివుడి మూడో కన్ను విశేషాలు తెలుపండి? - రామారావు, సూర్యాపేట
పదార్థాలను ప్రకాశింపచేసే శక్తిని జ్యోతిస్వరూపం అని పిలుస్తారు. జ్యోతిస్వరూపం మూడు రకాలు. 1) అగ్ని మండలం- ఇది భూమిని ఆశ్రయించుకుని ఉండే జ్యోతిచక్రం 2) చంద్ర మండలం- ఇది అంతరిక్ష లోకాన్ని, అనగా భూమ్యాకర్షణ పరిధి పైనుంచి స్వర్గలోకం క్రింద దాకా వుండే ప్రదేశాన్ని, ఆశ్రయించుకుని వుండే జ్యోతిచక్రం 3. సూర్యమండలం- ఇది స్వర్గలోకాన్ని ఆశ్రయించుకుని వుండే జ్యోతిచక్రం. ఇది వేద సాంకేతిక భాష. ఈ మూడు రకాల జ్యోతిస్సులు నేత్రాలుగా గలవాడే ఈశ్వరుడు. వీటిలో అగ్నిమండలమనబడే జ్యోతిస్సుకి దహన శక్తి కూడా వుంది. అది భౌతిక పదార్థాలనూ దహించగలదు. మానవుల అజ్ఞానాన్ని గూడా దహించగలదు. అటువంటి అగ్ని మండల జ్యోతిస్సును శివుడు తన కనుబొమ్మల నడుమ ఆజ్ఞాచక్రస్థానంలో తృతీయ నేత్రంగా ధరించి వున్నాడు.
* దేశంలో అశాంతికి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చే కారణమా? దేశం శాంతియుతంగా వుండాలంటే మనమేమి చేయాలి?
- నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక
మీ ప్రశ్నలో రెండవ వాక్యం చాలా ముఖ్యమైనది. అశాంతికి లౌకిక కారణాలు అనేకం వుండవచ్చు. వాటిన్నిటికీ పరిష్కార మార్గం సత్వ గుణపూర్ణమైన మనస్సుతో శాంతి భావనా తరంగాలను మన పరిసరాలలో విస్తరింపచేయటమే. దీనికోసమే హిమాలయ గుహలలో కొంతమంది మహర్షులు అనేక వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ మన దేశంలోకి శాంతి తరంగాలను ప్రసరింప చేస్తున్నారు. మనకు చేతనైనంత స్థాయిలో మనం కూడా అదే పనిని చేయడమే దేశశాంతికోసం మనం చేయవలసిన పని.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి