ధర్మసందేహాలు

తాంబూలంలో యాపిల్ ఇవ్వవచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇప్పటికి ఎన్ని మహాయుగాలు గడిచినవి? అన్ని మహాయుగాలలో నారాయణుడు దశావతారాలు ఎత్తాడా? వేరే అవతారాలు వున్నాయా? (రామకృష్ణ, నంద్యాల)
ప్రస్తుతం 28వ మహాయుగం నడుస్తోంది. అన్ని మహాయుగాలలోనూ దశావతారాలు పూర్తిగా వున్నాయని పురాణాలు చెప్పటం లేదు. అలాగే దశావతారాలు మాత్రమే నారాయణావతారాలని చెప్పటం లేదు. భాగవతంలోనే ఇరవై యొక్క అవతారాల ప్రసక్తివుంది. ఆ సంఖ్యగూడా నియతం కాదనీ, నారాయణావతారాలు అంశావతారాలుగా ఆవేశావతారాలుగా, అనంత సంఖ్యాకంగా సాగుతూ ఉంటాయనీ గూడా భాగవతాది పురాణాలు చెపుతున్నాయి.
* కురుక్షేత్రంలో అర్జునుని ఎదుట విశ్వరూపం ప్రదర్శించినది ఎవరు? (కె.రామనాథం, పిడుగురాళ్ళ)
ఎక్కడైనా సరే పధ్నాలుగు లోకాలను అఖండంగా వ్యాపించి వున్న పరమాత్మ మాత్రమే విశ్వరూపాన్ని ప్రదర్శించగలడు. గీతోపదేశ సమయానికి ఆ అనంత పరమాత్మ శ్రీకృష్ణ స్వరూపాన్ని ధరించి, అర్జునుడి ఎదుట గురువై నిలబడి వున్నాడు. అందువల్ల అనంతపరమాత్మ శ్రీకృష్ణుడి ద్వారా వ్యక్తమై విరాట్ రూప దర్శనాన్ని అనుగ్రహించాడని మనం గ్రహించాలి.
* నేనెరిగిన ఒక సిద్ధాంతిగారు మరణానంతర దశదినకర్మలకు వలయు సామాగ్రి- ముందుగా ప్యాక్ చేసి వెలిసె (ఇంటిచూరు) పై వుంచారు. తర్వాత వారి పుత్రులు అవి కర్మకాండకు వాడారు. ఇది సమంజసం, ధర్మమేనా?
- శివరాజేంద్రమూర్తి, చింతగుంటపాలెం
దీనిలో ఏమీ తప్పు కనిపించటం లేదు.
* ఆబ్దీకంలో భోక్తలకు దక్షిణ సహిత తాంబూలంలో అరటిపండ్లు గానీ, యాపిల్ గానీ, బత్తాయిలు గానీ పెట్టి ఇవ్వవచ్చునా? - శివరావు, సూర్యాపేట
తాంబూల ప్రదానం అశుభకర్మలో భాగం కాదు. అందుచేత ఆబ్దీకానంతరం తాంబూల ప్రదానం గానీ, ఫలప్రదానం గానీ తప్పుకాదు.
* ముక్కోటి ఏకాదశి అనగా మూడు కోట్ల దేవతలు ఒక్కటైనారు అని విన్నాము. కానీ ఇటీవల చాగంటివారు 33కోట్ల దేవతలుగా ప్రవచించుచున్నారు. ఏది నిజం? (సాయిరామానందస్వామి, పొదలకొండపల్లె)
వేద మంత్రాలలో ముప్పైముగ్గురు దేవతలని వున్నది. వారే ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు. అష్ట వసువులు, అశ్వనీదేవతలు (ఇద్దరు). వీరియొక్క అంశోపాంశలను స్వీకరించి పురాణాలు 33 కోట్ల దేవతలు అన్నాయి. ముక్కోటి దేవతలు అనేది మంది దేవతలు అనే అర్థంలో వచ్చిన సామాన్య వచనము. అనగా ఉజ్జాయింపు మాట.
* హిందూ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క వియ్యంకుడు గాని, వియ్యపురాలు గాని కాలం చేస్తే బ్రతికివున్న వియ్యంకుని, లేక వియ్యపురాలిని పరామర్శ చేయకూడదు అని అంటారు. ఎందుకు? దీనికి శాస్త్రప్రకారం ఆధారాలు వున్నాయా? (మంచికంటి సూర్యనారాయణమూర్తి, కాకినాడ)
దుఃఖంలో వున్నవారిని పురామర్శించకూడదనటం ఆలా దురాచారం. అలాంటి సందర్భాలలో పిలవకుండానే వెళ్ళి దుఃఖితులను ఓదార్చాలని ధర్మశాస్త్రం స్పష్టంగా నిర్దేశిస్తోంది. దీనికి వియ్యంకుల విషయంలో ఏ రకమైన మినహాయింపూ లేదు.
**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి