ధర్మసందేహాలు

తార, రుమ మానవులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కుమారునికి గాని, కుమార్తెకు గాని వివాహం చేస్తే పితృ కార్యక్రమములు చెయ్యకూడదు అంటారు. ఇది శాస్తస్రమ్మతమేనా?
మంచికంటి సూర్యనారాయణమూర్తి, కాకినాడ
కుమారునికి గాని, కుమార్తెకు గాని వివాహం చేసిన కర్త, ఆ వివాహానికి అంగ భూతం నాందీ శ్రాద్ధము అనబడే ఒక చిన్న శ్రాద్ధాన్ని చేస్తాడు. ఇది చేసిన తర్వాత మూడు నెలల వరకు ఇతర పితృకర్మలను చేయరాదు. పెళ్ళి నిశ్చయం చేసుకొనేటప్పుడే రాబోయే మూడునెలల్లో పితృ, మాతృ శ్రాద్ధాదులు లేకుండా జాగర్తపడాలి. మూడు నెలలు దాటిన తర్వాత అన్ని పితృకార్యాలనూ ఆచరించుకోవచ్చు.
* రామాయణంలోని వాలి సుగ్రీవుల కథలో వారిద్దరూ అన్నదమ్ములైనప్పటికీ భార్యలైన తార, రుమల విషయంలో పరస్పరము అనైతికంగా ప్రవర్తించినట్లు వుందికదా! వాలి సుగ్రీవులు వానరులైనా వారి భార్యలు మానవులే కదా! వారు మానవ ధర్మాన్ని అతిక్రమించటం న్యాయమా?
- ఐతా ఆనందబాబు, గూడూరు
వాలి సుగ్రీవుల భార్యలు మానవులని రామాయణంలో ఎక్కడా లేదు. పైగావారు వానర స్ర్తిలే అనే విషయం రామాయణ కథనంలో స్పష్టంగా వుంది. ఆనాటి వానరజాతి అంటే ఈనాటి ఆటవిక జాతులతో పోలిన వానర లక్షణాల అధికంగాగల ఒకానొక నరవానర మధ్యస్థ జాతి అని మనకి రామాయణ కథనాన్నిబట్టి అర్థమవుతోంది. అందువల్లే ఆ జాతికిగల ప్రత్యేకమైన కట్టుబాట్లను, ధర్మాలను రక్షించటమే రాజప్రతినిధిగా శ్రీరాముని యొక్క కర్తవ్యం. అందువల్లే ఆయన వాలిని శిక్షించి వానర ధర్మాన్ని రక్షించాడు.
* మేము కాపులము. మా ఇంటి పేరుగలవారిలో ఎవరైనా చనిపోతే ఎన్నితరాలదాకా మైల పాటించాలి?
- బి.దుర్గేశ్వర
వంశమూల పురుషుడిని గుర్తించి, ఆ మూల పురుషుడిలోంచి ఎన్ని శాఖలు ఏర్పడ్డాయో గుర్తించి అందులో మనం ఏ శాఖలోవున్నామో గుర్తించి, మన స్వశాఖలో ఏడుతరాల వరకు పురుడు, మైలలు పాటించాలి. ప్రక్క శాఖలో 3 తరాల వరకు మూడురోజులపాటు పురుడు మైలలు పాటించాలి. ఆ పైన స్నానంతో సరి.
* మన బంధువులలో ఎవరైనా మతం మారిపోతే వారికి మనం పురుడు మైలలు పట్టాలా? -ఎ. రాములు
పూర్వం ధర్మపరిషత్తులు అని వుండేవి. వాళ్ళు ధర్మభ్రష్టులను వెలివేసేవారు. అలాంటి వారికి పురుడు మైలలు పట్టవలసిన అవసరం ఉండేది కాదు. మన దురదృష్టవశాత్తు ఇవాళ ధర్మపరిషత్ వ్యవస్థ అంతరించిపోయింది. అందువల్ల ఆ వ్యవస్థలేకపోయినా మతాంతరం పుచ్చుకున్నవారిని ధర్మభ్రష్టులుగా భావించి వారికి సంబంధించిన పురుడు మైలలు పట్టకుండా వుండటమే ప్రశస్తమని పెద్దలు చెపుతున్నారు.
* హరిహర బ్రహ్మాదుల కులమేమిటి?
- యన్.రాజ్యలక్ష్మి, సికిందరాబాద్
కులమనేది వృత్తినిబట్టి వస్తుంది. వర్ణమనేది జన్మనుబట్టి వస్తుంది. హరిహర బ్రహ్మాదులకు వృత్తీలేదు, జన్మా లేదు. అందువల్ల వారికి కులంగాని వర్ణం గాని వుండే వీలులేదు. అవి మానవులకు మాత్రమే వర్తిస్తాయి.
* మహాభారతంలో బర్బరీకుడు ఎవరు?
సాయిరామానందస్వామి, పొదలకొండపల్లె
ఘటోత్కచుని భార్య కటంకట అనీ, ఆమెకు కలిగిన పుత్రుడు బర్బరీకుడు అని స్కాంద పురాణంలో వుంది.
* ఋషులకు దేవతలనుగూడా శపించగల శక్తి వుంటుందా?
- యస్.హెచ్.శివాజీరావు, చైతన్యపురి, హైద్రాబాదు
తపో మహిమకు హద్దులేవు. అందుకనే హరిహర బ్రహ్మాదులు కూడా, ఉత్తములైన మహర్షులను గౌరవించటం పురాణాలలో అనేకచోట్ల మనకు కనిపిస్తూ వుంటుంది.
**

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి