ధర్మసందేహాలు

అంగరాజ్య దానం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ధృతరాష్ట్రునికి రాజ్యపాలన హక్కులేదు గదా! అతనికే లేనప్పుడు, అతని కుమారుడు దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఎలా దానం చేశాడు? దానిని పెద్దలు ఎలా ఆమోదించారు?
- రత్నంరాజు, హైదరాబాదు
ధృతరాష్ట్రునికి రాజ్యాధికారయోగ్యత లేదు గానీ, అతని తమ్ముడైన పాండురాజు యొక్క ఔదార్యంవల్లఅతనికి రాజ్యాధికారం వచ్చింది. ధృతరాష్ట్రుడి దుస్తంత్రంవల్ల దుర్యోధనుడు పరోక్షంగా ఆ అధికారాన్ని వాడేసుకున్నాడు. దానివల్ల ధృతరాష్ట్రుడి ద్వారా కర్ణుడికి అంగరాజ్యం ఇప్పించగలిగాడు. ఇక పెద్దల ఆమోదం అంటారా, అది ధృతరాష్ట్ర, దుర్యోధనులకు ఎప్పుడూ లేనే లేదు.
* ప్రతి స్ర్తి తమ గుమ్మానికీ, మెట్లకు, సూర్యుని ఆకారంలో వున్న గుర్తుకి పసుపు రాసి బొట్లు పెడతారు. ఇది అలంకారం కోసమా? ఏదైనా చరిత్ర వుందా?
- పి.సూర్యనారాయణ, రాజమండ్రి
ఇది ప్రాంతీయాచారం. అలంకారంగూడా దీనిలోని ఒక భాగం.
* కర్ణునకు వివాహమైనదా? సంతానమున్నదా?కర్ణుని గురించిన సమాచారాన్నిఇవ్వండి. - రాజమల్లు, నెల్లూరు
కర్ణునికి వివాహం అయింది. సత్యసేనుడు, సుషేణుడు, చిత్రసేనుడు, సుశర్ముడు, వృషసేనుడు అనే వారితని పుత్రులని, వీరు గూడా మహాభారత యుద్ధంలో మరణించారనీ మహాభారంలో వుంది. ఇతని పుత్రులలో వృషకేతువనేవాడు జీవించి వున్నాడనీ అతనిని ధర్మరాజు జాగర్తగా ఆదరించాడనీ జైమిని భారతంలో వుంది.
* కొందరు జుట్టుబాగా పెంచుకుంటారు. కొందరు పెంచుకోరు. దీనిలో శాస్తప్రరంగా ఏదైనా ఉపయోగం వుందా? - బి.ప్రసాద్, గుంటూరు
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సంన్యాసాలని నాలుగు ఆశ్రమాలున్నాయి. వీటిలో ఎవరెవరు తమ కేశాలను ఎలా వుంచుకోవాలో శాస్త్ర నిర్దేశం వుంది. కొందరు దీని ప్రకారం జుట్టు పెంచుకుంటారు. కొందరు కేవల వైరాగ్యంతో జుట్టు పెంచుకుంటూ వుంటారు. శాస్త్ర నియమాలను అనుసరించేవారికి, శాస్త్రంలో చెప్పిన ఉపయోగాలు వుంటాయి.
* ద్రౌపదికి 5గురు భర్తలు వుండటంలో ధర్మం ఉందా?
నిర్మల, బెంగుళూరు
ఆమె పూర్వజన్మలో చేసిన మహాతపస్సువల్ల, ఈశ్వర వరప్రభావంవల్ల ఆమె విషయంలో 5గురు భర్తలుండటం ధర్మమేనని వ్యాస భగవానుడు బహిరంగంగా ప్రకటించినందువల్లే ఆ వివాహం జరిగింది.
* రామునికీ, శ్రీకృష్ణునికీ ఉన్నని దేవాలయాలు ఇతర అవతారాలకు లేదు ఎందుకని? = మోహనరావు , నల్గొండ
రాముని, శ్రీకృష్ణుని అవతార సమయంలో భక్తులు భావన చేసుకునేందుకు వీలయిన లీలా విశేషాలు అత్యధికంగా జరిగాయ కనుక వారికి దేవాలయాలు కూడా ఎక్కువగా ఉన్నాయ.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.

కుప్పా వేంకట కృష్ణమూర్తి