ధర్మసందేహాలు

గోళ్లు ఏ వారాలలో తీసుకోవచ్చు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- సి. విజయలక్ష్మి, కాకినాడ
సోమ, బుధవారాలు దానికి ప్రశస్తం. గురు, ఆదివారాలు మధ్యమం. మిగిలిన వారాలు నిషిద్ధం. తిథులలో ఏకాదశి, పూర్ణమి, అమావాస్యలు పూర్తిగా నిషిద్ధం. షష్ఠి, అష్టమి, ద్వాదశి, మధ్యమ నిషేధం. మిగిలిన తిథులు ప్రశస్తం.
* వివాహాలకు ముందు తిరుపతి వెళ్లే ముందు ‘జోగి’ ఎత్తుతుంటారు. జోగి అంతరార్ధం ఏమిటి?
- ప్రభు, వేదాయపాలెం, నెల్లూరు
కొంతమంది దేవునికి మ్రొక్కులు పెడతారు, జోగి కూడ ఒకరకమైన మ్రొక్కుగా భావిస్తారు.
* ఇంటిలోగాని ఖాళీస్థలంలోగాని ఈశాన్య దిశలో ఎలాంటి బరువైన వస్తువులు ఉంచరాదు అంటున్నారు. వాస్తవమేనా? కారణం తెలుపగలరు.
- మహేందర్, ఆమనగల్లు
ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టరాదని వాస్తు శాస్త్రంలో ఏ మహర్షిగాని, పూర్వపు వాస్తు శిల్పులుగాని ఎవరు చెప్పలేదు. ఈనాటికీ ఈ శాస్తమ్రు ఈ విధంగా అపప్రచారంలో నడుస్తోంది. అన్ని రకాల వస్తువులను పెట్టుకొనవచ్చును. పెట్టకూడదనేది అశాస్ర్తియం.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి