జాతీయ వార్తలు

దిల్లీలో డీజిల్‌ వాహనాలపై నిషేధం ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీలో డీజిల్‌ కార్లు, ఎస్‌యూవీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే, హరిత పన్ను కింద వాహనాల రిటైల్‌ ధరలపై ఒక శాతం అదనపు సుంకాన్ని విధించనున్నట్లు తెలిపింది.2000 సీసీ అంతకంటే ఎక్కువ కెపాసిటీ కల్గిన డీజిల్‌ వాహనాలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నడిచిన డీజిల్‌ వాహనాల వినియోగాన్ని అడ్డుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై డీజిల్‌ వాహనాల తయారీదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మెర్సిడెస్‌, టొయోటా లాంటి సంస్థలు ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో విచారించిన న్యాయస్థానం వాహనాలపై నిషేధం ఎత్తివేస్తూ తీర్పు చెప్పింది.