జాతీయ వార్తలు

క్షమాపణలు చెప్పడం ఆ కుటుంబానికి తెలియదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇతరులకు క్షమాపణలు చెప్పడమన్నది గాంధీ కుటుంబానికి తెలియదని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినందుకు అతను క్షమాపణ చెప్పాలి లేదా పరువునష్టం కేసులో విచారణకు సిద్ధం కావాలంటూ సుప్రీం కోర్టు పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ దిగ్విజయ్ ఈమాటలన్నారు. ఎవరికీ క్షమాపణ చెప్పిన దాఖలాలు గాంధీ కుటుంబంలో లేవన్నారు. ఆరెస్సెస్ వేసిన కేసులో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామే తప్ప క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు.