రాష్ట్రీయం

ఇది డిజిటల్ విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూన్ నాటికి రాష్టమ్రంతటా విస్తరణ పేదలకు మెరుగైన సేవలు
అవినీతిని నిర్మూలిస్తా ఫైబర్ గ్రిడ్ ప్రారంభం సందర్భంగా చంద్రబాబు
విశాఖపట్నం, మార్చి 17: ఇదొక విప్లవం.. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరితో కావాలంటే వారితో మాట్లాడుకునే వెసులుబాటు వచ్చింది. ఇ-లెర్నింగ్, టెలిమెడిసిన్, ఇ-గవర్నెన్స్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సాయంత్రం నొవాటెల్‌లో ఆయన ఫైబర్‌గ్రిడ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తొలి డిజిటల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పేదలకు కేవలం రూ.150లకే ఇంటర్నెట్, టివి, ఫోన్ సౌకర్యం లభిస్తుందన్నారు. వచ్చే నెలాఖరు నాటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ సేవలను తొలి దశలో అందుబాటులోకి తెస్తామన్నారు. జూన్ నాటికి రాష్టమ్రంతటా విస్తరిస్తామని వివరించారు. రాష్ట్రంలో 1.3 కోట్లకు పైబడి గృహాలకు, వ్యాపార సంస్థలకు టెలిఫోన్, టెలివిజన్, ఇంటర్నెట్ సేవలు, 60వేలకు పైగా పాఠశాలలు, కళాశాలలకు ఇ-లెర్నింగ్ సేవలు, 6580 పిహెచ్‌సి కేంద్రాలకు టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఇందుకోసం రాష్టవ్య్రాప్తంగా 22,500 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను వేయాల్సి ఉండగా 9వేల కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నారు. ఇందుకు రూ.333 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో ఇ-గవర్నెన్స్‌ను తీసుకురావడం ద్వారా అవినీతి లేని పాలనను అందిస్తామన్నారు. 2022 నాటికి దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. 2029 నాటికి భారత్‌లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, 2050 నాటికి ప్రపంచంలోనే ఉత్తమ రాష్ట్రంగా మన రాష్ట్రం నిలుస్తుందని వివరించారు. ప్రపంచంలో 25 శాతం మంది ఐటి ఉద్యోగులు భారత్ నుంచే వెళ్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పెదముషిడివాడ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులతోను, సబ్బవరం పిహెచ్‌సిలోని డయాబెటిక్ రోగికి టెలీమెడిసిన్ ఎలా అందించాలన్నదీ వివరించారు. ఇ-లెర్నింగ్ వల్ల విద్యార్థులకు ఎలాంటి లాభం ఉంటుందో విద్యార్థులతో చెప్పించారు. ఆ పాఠశాలకు చెందిన విద్యార్థి సుష్మిత మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్‌కు అంత కష్టపడుతున్నా మీకు అలసట రాకపోవడానికి కారణమేమిటని ముఖ్యమంత్రిని ప్రశ్నించింది. దీనికి చంద్రబాబు నవ్వుతూ పనిలో ఆనందం పొందగలిగితే అలసట ఉండదని బదులిచ్చారు.
అనంతరం అమెరికాకు చెందిన సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టి చాంబర్స్ కూడా పెదముషిడివాడ విద్యార్థులతో ముచ్చటించారు. మీరు ఉన్నత స్థాయికి చేరుకోడానికి మీ విజయ రహాస్యం ఏమిటని ప్రశ్నించగా, సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాధరెడ్డి, జిల్లా కలెక్టర్ యువరాజ్, ఎంఎస్‌ఒ ఆపరేటర్లు, పారిశ్రామిక వేత్తలు, జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ, జాయింట్ కలెక్టర్ డివి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
(చిత్రం) విశాఖపట్నంలో గురువారం ఫైబర్‌గ్రిడ్‌ను ప్రారంభించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు