రివ్యూ

జంటగా ఊగించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** దిల్‌వాలే (ఫర్వాలేదు)

తారాగణం:
షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్‌ధావన్, కృతిసనన్ తదితరులు
సంగీతం:
అమర్ మోహిలె.. ప్రీతమ్ చక్రవర్తి
నిర్మాతలు:
గౌరీఖాన్, రోహిత్‌శెట్టి
దర్శకత్వం:
రోహిత్‌శెట్టి

అప్పటికి ‘కెమిస్ట్రీ వర్కవుట్’ అన్న మాట రాలేదు. ఈ రసాయనిక చర్యలూ ప్రక్రియలూ ఇప్పటివే. ఒక శకంలో సువర్ణ్ధ్యాయాన్ని సృష్టించిన హిట్ పెయిర్ అది. యువతను ఉర్రూతలూగించి తీయటి అనుభూతుల లోకాల్లో విహరించేట్టు చేసి.. ఎప్పటికీ మాయని శిలాక్షరంగా మిగిలిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ మాట మనసులో దొర్లితే ఏ వయసు వారైనా.. ఆనాటికి వెళ్లిపోక తప్పదు. అక్కడే కాసేపు తచ్చట్లాడక తప్పదు. అలాంటి ఒకానొక చరిత్రకి ప్రాణం పోసిన ‘జంట’ కలిసి మళ్లీ ఇన్నాళ్లకి నటిస్తున్నారంటే సహజంగానే ఉత్సుకత. అంచనాల పల్స్ రేటు మరీ పెరిగిపోతుంది. ఆనాటికీ ఈనాటికీ నటనలో మార్పు లేకపోయినా.. వయసు పెరిగిన ‘జంట’ ఏ రీతిన ప్రేక్షకుల్ని అలరించ (?)నుందని ఎవరికైనా అనిపిస్తుంది. 20ఏళ్ల క్రితం ‘మధుర’ ఊహల్లో తారట్లాడిన షారుఖ్ - కాజోల్.. మరి ఇప్పుడు ‘దుల్హనియా లేజాయేంగే’ని కట్ చేసి.. ‘దిల్‌వాలే..’గా ఎలా కనిపించనున్నారో చూద్దాం.
కథ - రెండు డ్రగ్ మాఫియాల మధ్య తరచూ గొడవలు. ఆ కుటుంబానికి చెందిన రాజ్ (షారుఖ్‌ఖాన్), మీరా (కాజోల్).. అనుకోని పరిస్థితుల్లో కలుస్తారు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి చిగుర్లు వేస్తూన్న తరుణంలో-ఇరు కుటుంబాల మధ్య కొట్లాటలు పెచ్చుమీరటంతో ఇద్దరూ విడిపోయి వేర్వేరు ప్రాంతాల్లో కాలం వెళ్లబుచ్చుతుంటారు. రాజ్ మాఫియా గొడవలు మానేసి -గోవాలో కారు మెకానిక్‌గా చేస్తూ ఉండిపోతాడు. అదే ప్రాంతంలో మీరా కూడా ఉంటుంది.
రోజులు సంవత్సరాలుగా మారి -15 ఏళ్లు గడుస్తాయి. రాజ్ తమ్ముడు వీర్ (వరుణ్‌ధావన్), మీరా చెల్లెలు ఇశిత (కృతి సనన్) ఉన్నపళంగా ప్రేమలో పడతారు -యాదృచ్ఛికంగా. వీరిద్దరి ప్రేమని గెలిపించటానికి రాజ్ -మీరా మళ్లీ ఒక్కటవుతారు. వీర్ -ఇశిత మాఫియా ముఠా బారినుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్లారు? వారిని వెతుకుతూ వచ్చిన రాజ్ -మీరా జంట మళ్లీ కలిసిందా? ఇరు కుటుంబాల మధ్య గొడవలు సమసిపోయాయి? ఇత్యాది ప్రశ్నలకు ‘క్లైమాక్స్’ సమాధానం.
కథ ఏమిటన్నది వదిలేద్దాం. ఎందుకంటే- ఇటువంటి కథలు ఎన్ని రాలేదు? ఎన్ని పోలేదు? కథలో కొత్తదనం లేదు. కొన్నాళ్ల క్రితం ఒక జంట ప్రేమించుకోవటం.. విడిపోవటం. తర్వాత మరో ప్రేమ జంటని కలపటం కోసం వాళ్లిద్దరూ కలవటం. కాబట్టి -కథని పైపైన నడిపిస్తూ స్క్రీన్‌ప్లేని బలంగా సమకూర్చుకున్నాడు దర్శకుడు. రోహిత్‌శెట్టికి కామెడీ.. యాక్షన్ అంటే ఎంత ఇష్టమో.. ఆ చిత్రీకరించే తీరు మళ్లీ ‘దిల్‌వాలే’లో కనిపించింది. కామెడీని పండించటంలోనూ.. యాక్షన్ సీన్లను తీయటంలోనూ తనకి తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. దీనికి తగ్గట్టు ప్రతి సన్నివేశం ఎంతో రిచ్‌గా ఉంది. లొకేషన్లు చూడ చక్కగానూ.. పాటలు మహత్తరంగానూ.. ఆనాటి ‘దిల్‌వాలే దుల్హనియా..’తో పోటీ పడేట్టుగానూ ఉన్నాయి. అక్కడక్కడ లాజిక్ మిస్సయినా.. అనవసర సన్నివేశాల జోలికి వెళ్లినా -్ఫస్ట్ హాఫ్ కథ సాఫీగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్‌లో ఉన్నట్టుండి కథలో వేగం తగ్గింది.
నటనాపరంగా -షారుఖ్ ఖాన్‌ని పక్కనపెడితే.. కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇనే్నళ్ల వయసులోనూ ఆ ఛార్మింగ్ అలానే ఉంది. మళ్లీ ఆనాటి కాజోల్‌ని చూస్తున్నట్టే. గ్లామర్ పరంగానూ.. నటనలోనూ తాను ఏ మాత్రం వెనుకపడలేదని నిరూపించింది.
వరుణ్ ధావన్.. కృతి సనన్ నేటి యువతకు ప్రతీకగా నిలిస్తే.. ఆనాటి తరానికి కాజోల్ -షారుఖ్ దీటైన ‘ప్రేమ’ని చూపించగలిగారు.
మిగతా పాత్రలన్నీ వచ్చి వెళ్లిపోయేవే.
దర్శకుడు రోహిత్‌శెట్టి -‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ రోజుల్ని మళ్లీ తెచ్చాడని చెప్పలేం కానీ.. హృదయాన్ని కొల్లగొట్టాడని మాత్రం చెప్పొచ్చు. రోహిత్‌కి గోవా అంటే ఎంత ఇష్టమో.. మరోసారి తెలిసింది. గోవాలో చిత్రీకరించిన సన్నివేశాలన్నీ రిచ్‌గా ఉన్నాయి. సన్నివేశ పరంగా కామెడీ పండింది. షారుఖ్ -కాజోల్ ‘కెమిస్ట్రీ’ వర్కవుట్ అయ్యిందా? లేదా? అన్నది తెరపై చూసి తీరాల్సిందే.

-ప్రనీల్