ఫిలిం క్విజ్

ప్రపంచానికి రాసే ప్రేమలేఖే సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లపూసలు, ఎన్టీఆర్ నగర్ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు బాబ్జీ. ప్రస్తుతం వేటకొడవళ్ళు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు దర్శకుడు రాసే ప్రేమలేఖే సినిమా అంటున్న బాబ్జితో చిట్ చాట్...

నీ నేపథ్యం?
మాది ప్రకాశం జిల్లా. ప్రజానాట్యమండలి వేదికగా అనేక ఉద్యమాల నుంచి రంగస్థలం మీదుగా సినీ పరిశ్రమకు వచ్చాను.
దర్శకుడవ్వాలని ఎందుకు?
నాటక రంగం నుంచి వచ్చాను కనుక, సమాజానికి ఏదో చెప్పాలన్న తపన ఉండేది. నాటకంగా చెబితే వెయ్యిమందే చూస్తారు. సినిమా అయితే అందరికీ చేరుతుందని దర్శకుడిని అయ్యాను.
ఇష్టమైన జోనర్స్
కొత్తదనంతో విషయాన్ని చెప్పే జోనర్లన్నీ ఇష్టమే. సినిమాలో దృశ్యం వినిపించాలి, మాట కనిపించాలనే విధానంతో సినిమా రూపొందించడం ఇష్టం.
పరిశ్రమలో సమస్యలు?
చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. తెలుగు సినిమాకు ఆద్యుడు రఘుపతి వెంకయ్యనాయుడు కథతో చిత్రం నిర్మిస్తే, అది దాసరి నారాయణరావు కొన్నారు. ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి కూడా థియేటర్లు దొరకని పరిస్థితి. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉంటుందా?
మినీ థియేటర్ల మీద మీ వ్యూ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మినీ థియేటర్లు త్వరలో రాబోతున్నాయి. ఆర్టీసి డిపోలు, రైల్వే స్టేషన్లలో మినీ థియేటర్లు రానున్నాయి. ఇప్పటికే వీటి నిర్మాణం ప్రారంభమైంది.
తర్వాత ప్రాజెక్టులు
సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రంగా వేటకొడవళ్ళు రూపొందిస్తున్నా. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తా.
దర్శకుడంటే
సమాజానికి మార్గదర్శకుడిగా ఉంటూ నిన్న, నేడులో బ్రతికేవారికి రేపు, ఎల్లుండి గురించి చెప్పాలి. సమాజంపట్ల బాధ్యతతో చిత్రాలు నిర్మించాలి.

- బాబ్జీ